WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Kids/Children Health Care. Show all posts
Showing posts with label Kids/Children Health Care. Show all posts

Friday, 27 May 2016

STOMACH INFECTION IN KIDS - AYURVEDIC HEALTH TIPS


చిన్న పిల్లల కడుపులో నులి పురుగుల నివారణ 

కడుపులో క్రిములు , నులిపురుగులు వంటివి ఉంటే చిన్న పిల్లలు నిద్రలో పండ్లు కోరుకుతారు. అందువల్ల ఆవాలని దోరగా వేయించి దంచి జల్లించి నిలువ ఉంచుకోవాలి . ఈ ఆవాల పొడి అరగ్రాము మోతాదుగా అరకప్పు పెరుగులో ఉదయం పూట సాయంత్రం పూట కలిపి తినిపిస్తుంటే పిల్లల కడుపులో ఉండే క్రిములు మూడు రొజుల్లొ మలం ద్వారా పడిపోయి పిల్లలు నిద్రలో పండ్లు కొరకడం ఆపివేస్తారు.

Tuesday, 8 December 2015

KITCHEN HEALTH TIPS TO STOP COLD IN KIDS - USE VAPOUR - HONEY - VOMU - MASSAGE - SALT WATER - HOT MILK ETC GIVES RELIEF FROM COLD FOR ALL AGES


జలుబుకు ఇంటి ఔషధాలు
పిల్లలు త్వరగా జలుబు బారినపడుతుంటారు. వాతావరణం మారినపుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా జలుబు, దగ్గు దరిచేరకుండా ఉండేలా చేయవచ్చు. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇలా చేయండి..
* ఆవిరిపట్టడం : 
పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఆవిరిపట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెడికల్‌ షాపుల్లో స్టీమ్‌మిషన్‌ లభిస్తుంది. ఇంట్లో సైతం ఒక పాత్రలో నీళ్లు వేడి చేసి ఆవిరిపట్టవచ్చు. నీటిలో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు వేసుకుని ఆవిరి పట్టిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.
* తేనె : 
జలుబుతో బాధపడుతున్న పిల్లలకు తేనెను నాకించిడం వల్ల ఫలితం ఉంటుంది. రోజులో రెండు, మూడుసార్లు పిల్లలకు తేనె ఇవ్వవచ్చు. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్‌ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
* ఓమ : 
ఒక కప్పునీళ్లు తీసుకుని చిటికెడు ఓమ, కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని తాగడం వల్ల దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. చాతీ పట్టేసిట్లుగా ఉండటం తగ్గిపోతుంది.
* మసాజ్‌ : 
రెండేళ్ల లోపు పిల్లలకు మసాజ్‌ బాగా పనిచేస్తుంది. కొంచెం ఆవాల నూనె తీసుకుని అందులో వెల్లుల్లి కలిపి బేబీ చెస్ట్‌, వీపు, మెడ భాగంలో బాగా మసాజ్‌ చేయాలి. అరచేతులు, పాదాలు కూడా మసాజ్‌ చేయాలి. దీనివల్ల పిల్లలకు క్విక్‌ రిలీఫ్‌ లభిస్తుంది.
* నీళ్లు ఎక్కువగా తాగించాలి : ముక్కు నుంచి నీరు కారుతున్నప్పుడు పిల్లలకు ఎక్కువ నీళ్లు తాగించాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గొంతులో నొప్పి తగ్గడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు బయటకు పంపబడతాయి. జ్యూస్‌, గోరువెచ్చని సూప్‌లు ఇవ్వడం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్‌ పడిపోకుండా ఉంటాయి.
* ఉప్పు నీరు పుక్కిలించడం : 
ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో టీస్పూన్‌ ఉప్పు వేసి పుక్కించాలి. దీనివల్ల గొంతునొప్పి, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. రోజులో రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* పసుపు పాలు : 
పసుపులో యాంటిసెప్టిక్‌ గుణాలుంటాయి. జలుబు, దగ్గు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి పాలలో కొంచెం పసుపు వేసి పిల్లలకు తాగించాలి. ముక్కు కారే సమస్యకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. పిల్లలకు తగినంత కాల్షియం, శక్తి లభిస్తుంది.

Wednesday, 4 February 2015

TOUCH THERAPY IS BEST FOR KIDS - KIDS LEARN STARTS TOUCH OF THEIR PARENTS



ఎక్కువమంది చిన్నపిల్లలు స్పర్శ ద్వారా ప్రేమను అనుభవిస్తారు. అది వారి మౌలికమైన కోరిక. పెద్దవాళ్ళయ్యాక అలా తండ్రితోగానీ, తల్లితోగానీ వుండేందుకు సిగ్గు పడవచ్చు. అందుచేత పిల్లలు స్పర్శ ద్వారానే తల్లిదండ్రులను, ఇతరులను గుర్తిస్తారని నిపుణులు అంటున్నారు. 
1. గుండెలకు హత్తుకున్నా, ముద్దులాడినా లేదా పరస్పర గిలిగింతలకు పిల్లలు ఇష్టపడతారు.
2. అనవసరంగా కొట్టడం, తిట్టడం వంటి పనుల వలన పిల్లలు నొచ్చుకుంటారు. 
3. తల్లిదండ్రుల మీద ప్రేమగా పడుకోవడానికి లేదా వారిని హత్తుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు. 
4. పిల్లలను హత్తుకునేందుకు, ముద్దాడేందుకు, పక్కనే పడుకుని నిద్రించడానికి గల అవకాశాలన్నీ చక్కగా వినియోగించాలి

Wednesday, 18 December 2013

WHAT ARE THE NECESSARY FOOD PRECAUTIONS TO BE TAKEN FOR BABIES HEALTH GROWTH - BABIES HEALTH CARE TIPS




ఎక్కువ శాతం పిల్లలు 6 నెలలవరకు తల్లిపాలమీద ఆధారపడిఉంటారు. అయితే 6 నెలల తర్వాత నుండి తల్లిపాలు వీరికి సరిపోవు. తర్వాత వీరి పెరుగుదలకు అవసరమైన కాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. అందువల్ల 6 నెలల తర్వాత నుండి పిల్లలకు తల్లిపాలతో పాటు, పోతపాలు ఇతర ఆహారపదార్దాలను ద్రవరూపం లోగాని, ఘనరూపంలోగాని అలవాటు చేసే పద్దతిని వీనింగ్‌ అని అంటారు.
పాలలో విటమిన్‌ 'సి' తక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్‌ 'సి'ని అందివ్వ డానికి పిల్లలకు 6 నెలల నుండి పండ్లరసా లను అందివ్వాలి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఐరన్‌నిల్వలు లివర్‌లో ఉంటాయి. ఇవి పుట్టినప్పటి నుండి 4-6 నెలల వరకూ సరిపోతాయి. తర్వాత నుండి ఆహారం ద్వారా ఐరన్‌ వారికి లభించాలి. పాలలో విటమిన్‌ 'డి' కూడా తక్కువగా లభిస్తుంది. పిల్లలు అనుకున్న రీతిలో ఆరోగ్యంగా పెరగాలి అంటే సప్లిమెంటరీ ఫీడింగ్‌ 6నెలల నుండి మొదలుపెట్టాలి. లేకుంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆరు నెలల తర్వాత నుండి తల్లిపాలు 3 లేక 4 సార్లు మాత్రమే ఇస్తూ ఆవుపాలుకాని, గేదెపాలుకాని అలవాటు చేయాలి. ఈ పోతపాలలో పోషకాలు తల్లిపాలతో పోలిస్తే వేరుగా ఉండటం చేత, పిల్లలు అలవాటు పడటానికి పాలలో కాచి చలార్చిన నీళ్ళను, పంచదారతో కలిపి తాగించాలి. పాలు, నీళ్ళ శాతం 2+1 గా ఉండాలి. చక్కెరవలన కాలరీలు పెరుగుతాయి. ఆరంజ్‌, టమాటో, ద్రాక్ష వంటి పండ్లు మంచి పోషకాలు కలిగిఉంటాయి. వీటిలో లభ్యమయ్యే పోషకాలు పాలలో దొరకవు. అందుచేత ఈ పండ్ల రసాలను పిల్లలకు కాచి చల్లార్చిననీళ్ళు కలిపి ఇవ్వడం చేయవచ్చు. నీరు, జ్యూస్‌ 1+1గా ఉండాలి. జ్యూస్‌ను వడకట్టి తాగించాలి. క్రమంగా జ్యూస్‌ మోతాదు ను పెంచుతూ, నీటిశాతం తగ్గించాలి.
పండ్లు దొరకని పరిస్థితుల్లో ప్రత్యా మ్నాయంగా ఆకుకూరల రసాన్ని సూప్‌ గా చేసి ఇవ్వాలి. దీనిని వడకట్టి తాగిం చాలి. తర్వాత మెల్లగా వడకట్ట కుండా అలవాటు చేయాలి. వీటితోపాటు ఫిష్‌లివర్‌, ఆయిల్‌ కొన్ని చుక్కలు నుండి అరటేబుల్‌ స్పూన్‌ కొన్ని పాలలోకలిపి ఇవ్వడం వలన విటమిన్‌ ఎ, విటమిన్‌ డి లభ్యమవుతుంది. పిల్లలకు పట్టేముందు జ్యూస్‌లను బాగా కలపాలి. జ్యూస్‌, సూపులు నుండి మెత్తని ఆహారాన్ని 7 లేదా 8వ నెలలో మొదలుపెట్టవచ్చు. పెరుగు తున్న కాలరీస్‌, ప్రొటీన్ల ఆవశ్యకతల వల్ల వాటిని సరైన రీతిలో అందించడా నికి, బాగా ఉడికించి, మెత్తగా చేసిన తృణధాన్యాలను పాలు, చక్కెర కలిపి పెట్టాలి. క్యాలరీస్‌ ఎక్కువగా లభ్యమయ్యే మాల్టెడ్‌వీట్‌, రాగిని ఈ ఆహారంలో చేర్చాలి. మాల్టెట్‌ తృణధాన్యాలు అంటే వాటిని రాత్రంతా నానబెట్టి, ఒక గుడ్డలో మూటకట్టి, మొలకలు వచ్చిన తర్వాత ఎండలో ఎండబెట్టి, ఎర్రగా వేయించు కోవాలి. తర్వాత మొలకలు తీసేసి పౌడర్‌ చేసుకోవాలి. ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, క్యారెట్స్‌ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్‌, ఖనిజాలు లభ్యమవుతాయి. అలాగే ఈ ఆహార పదార్ధాల వల్ల పిల్లలు కలర్‌ ఫుడ్‌కి అల వాటు పడతారు.
బాగా ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. ఉదా: కిచిడి, పొంగలి, పెసరపాయసం వంటివి. వీటిని పలుచగా కానీ లేదా కొద్దిగా సెమీసాలిడ్‌గా కానీ పెట్టవచ్చు. పప్పుధాన్యాలు ఇచ్చిన రోజు గుడ్డు, మాంసం ఇవ్వవలసిన అవసరం లేదు. అవి మరొక రోజు ఇస్తే పిల్లలకు కావలసిన శక్తి లభిస్తుంది. పిల్లలు చేతితో తీసుకుని కొరికి తినే సమయం అంటే 10-12 నెలల సమయంలో ఇలాంటి ఆహారం అందించాలి. బాగా ఉడికించిన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, మాంసం పండ్లు పెట్టాలి. ఇడ్లీ, ఉప్మా, బ్రెడ్‌, చపాతి, అన్నం, పప్పు వంటివి అలవాటు చేయాలి. చిన్నగా తరిగిన పండ్లు, కూరగాయలలో గింజలు ఉంటే అవి తీసేసి ఇవ్వాలి. వీటివల్ల దవడలకు మంచి ఎక్సర్‌సైజ్‌ లభిస్తుంది. ఎందుకంటే పిల్లలు నమిలితింటారు. కాబట్టి ఎక్కువగా శ్రద్ధచూపించే తల్లి, ఎక్కువగా ఇంట్లోచేసిన వీనింగ్‌ఫుడ్స్‌నే ఇవ్వాలి. వీటిని తృణధాన్యాలు, పంచదార, బెల్లం, పాలతో ఇంట్లోనే తయారు చేసుకోవాలి.
ఉడికించిన గుడ్డు పచ్చసొన కొంచెం తినిపించాలి. దానివల్ల ఎలర్జీ ఉండదు. పిల్లలు తినగలుగుతున్నారని నిర్ధారిం చుకున్న తర్వాత క్రమంగా మోతాదు పెంచుతూ మొత్తం పచ్చసొన తినిపించ వచ్చు. గుడ్డులోని యోక్‌లో విటమిన్‌, ఐరన్‌, ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవు తాయి. గుడ్డు తెల్లసొన మాత్రం సంవత్స రం తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
అందరూ తినే ఆహారం సంవత్సరం దాటిన తర్వాత చిన్న చిన్న మోతాదుల్లో పాలలో కలిపి అలవాటు చేయాలి. గొంతులో ఇరుక్కునే అవకాశం ఉన్న పప్పుదినుసులు, ఎండుద్రాక్ష, పచ్చియాపిల్‌, కూరగాయలు, పాప్‌కార్న్‌ వంటివి దూరంగా ఉంచాలి. ఎందుకంటే గొంతులో ఇరుక్కుని వీటివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బంది వస్తుంది.