WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Salt Care Health Tips. Show all posts
Showing posts with label Salt Care Health Tips. Show all posts

Thursday, 15 September 2016

MORE SALT - HIGH CHANCE OF HEART ATTACK AND BLOOD PRESSURE - USE RAW SALT OR SEA SALT AS REQUIRED TO OVERCOME B.P HEART PROBLEMS


మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు అవసరమే అయితే ఉప్పు అధికమైతే గుండెకు ముప్పు తప్పదు. 

రోజూ మనం తినే భోజనం లో 3 గ్రాముల ఉప్పు తగ్గించుకుంటూ వస్తే హృద్రోగ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

ఇప్పటికే ప్రపంచ మొత్తం మీద కొన్ని కోట్ల మంది ప్రజలు హైబీపీతో బాధపడుతున్నారు. ఇలాగె కొనసాగితే భవిష్యత్తులో 25 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరికి హైబీపీ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. 

హైబీపీ, గుండెకు సంబంధించిన వ్యాధులకు భారీ మొత్తంలో వెచ్చించడం కంటే రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు ని తగ్గిస్తేనే గుండెను పదిలం చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా పొగతాగే అలవాటు ఉన్న వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువే...కాబట్టి ఈ అలవాటు ఆపేసి.. వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉంటె గుండెకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు.

HEALTH BENEFITS WITH SEA SALT - USE SEA SALT TO STOP B.P HEART PROBLEMS ETC


ఇదివరకు రక్తపోటు సమస్య చాలా తక్కువ.
ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు కూడా. రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది. మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలోఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు. అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని, అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు. అయితే, ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికాల్లాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్లలోనే కాదు, శరీరంలో కూడా అది కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. పైపెచ్చు రక్తపోటును పెంచుతుంది. అయితే అయొడైజ్డ్ ఉప్పుకు ఎంతో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంటుంది. ఇది చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆరోగ్యకరమని, చక్కగా స్ఫటికాల్లా మెరిసిపోతుంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఈ ఉప్పు సహజసిద్ధంగా తయారు చేసింది కాదు. ఇది కర్మాగారాల్లో తయారవుతుంది. అసలైన ఉప్పు, అంటే రాళ్ల ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. దీన్ని ఎండలో ఎండబెడతారు. ఇందులో సహజసిద్ధమైన 72 ఖనిజ లవణాలుంటాయి. ఇందులో కూడా సోడియం, క్లోరైడ్, అయొడిన్‌లు ఉంటాయి కానీ, అవి సహజమైనవి. కృత్రిమమైనవి కావు. ఈ ఉప్పు నీళ్లలో వెంటనే కరిగిపోతుంది. శరీరంలో కరిగిపోతుంది. మూత్రపిండాల్లో కరిగిపోతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. పైగా రక్తపోటును అంటే బీపీని తగ్గిస్తుంది. కండరాలు మొద్దుబారిపోవడం, తిమ్మిర్లెక్కడం, దురదలు పెట్టడం వంటివి తగ్గిపోతాయి.

రాత్రివేళల్లో పిక్కలు, అరికాళ్లలో నొప్పులు వచ్చినా, పిక్కలు బిగపట్టుకుపోయినా ఓ అరగ్లాసు నీళ్లలో ఓ చెంచాడు రాళ్ల ఉప్పు వేసి, బాగా కలిపి, ఆ నీటిని తాగండి. అయిదు నిమిషాల్లో ఆ నొప్పులు, బాధలన్నీ మటుమాయమైపోతాయి. రాళ్ల ఉప్పు వాడడం ప్రారంభించిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం మందులకు స్పందించడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాలు సజావుగా పని చేస్తున్నట్టు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. ఇక 240/140 బీపీ ఉన్నప్పుడు కూడా రాళ్ల ఉప్పు కారణంగా అది సాధారణ స్థితిలోకి వచ్చేస్తోంది. రాళ్ల ఉప్పులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. రోజూ రెండున్నర చెంచాల రాళ్ల ఉప్పును 15 గ్లాసుల నీటిలో కలిపి అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా తాగితే రక్తపోటు దరిదాపులకు కూడా రాదని చాలామంది డాక్లర్లు చెబుతున్నారు. బీపీ సాధారణ స్థితిలో ఉండాలన్నా, తలకు రక్తం సజావుగా చేరాలన్నా మిరపకాయల వాడకం, అరటి పండ్లు తినడం అనివార్యం. ఇవి రెగ్యులర్‌గా వాడేవారికి గుండె సంబంధమైన సమస్యలు కూడా తలెత్తవని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీరంలో సరైన పాళ్లలో సరైన ఉప్పు లేకపోతే నీరు నిలవడం అసాధ్యం. శరీరంలో నీరు నిలవకపోతే, రక్తనాళాలు సజావుగా పనిచేయవు. శరీరంలో నీటి శాతం ఏమాత్రం తగ్గినా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రక్తపోటు రావడం ఖాయం. అయొడైజ్డ్ ఉప్పు వల్ల శరీరంలో నీళ్లు నిలవవు. రాళ్ల ఉప్పు వల్ల శరీరంలో 95 శాతం వరకూ నీళ్లు నిలుస్తాయి. శరీరం నుంచి సరిగా మూత్రం బయటికి పోవడానికి, చెమటలు పట్టడానికి రాళ్ల ఉప్పు సహకరిస్తుంది.ఆరోగ్యం గా ఉండండి. అందరికీ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించండి. ఆరోగ్య మస్తు. 

Friday, 28 February 2014

HEALTHY USES WITH IODIZED SALT - USE ALWAYS IODIZED SALT



మీ ఉప్పులో ఐరన్ ఉందా?

మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నవారు స్త్రీలు, పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రక్త హీనతను ఎనీమియా అంటారు. దీని బారినపడ్డవారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. రక్తహీనత తీవ్రతను బట్టి నిస్సత్తువ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే 'రక్తహీనత నుంచి బయప పడాలంటే ఆహార నియమాలు పాటించడమే ప్రథమ చికిత్స. నిజమైన చికిత్స కూడా' అంటున్నారు వైద్య నిపుణులు.

రక్తహీనతను ఎదుర్కొంటున్న వారిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఎక్కువగా అలసట చెందటమే కాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. శరీరంలో శక్తి పూర్తిగా నశించిపోయిన భావన కలుగుతుంది. ఎనీమియా గురించి తెలియాలంటే రక్తానికి సంబంధించిన కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైన హిమోగ్లోబిన్ పదార్థం తయారుకావడానికి పోషక పదార్థాలైన మాంసకృత్తులు, ఇనుము ప్రధానంగా అవసరం అవుతాయి. అలా శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం 16ఎం.జి. పరిమాణంలో ఉంటుంది. ఈ లెక్కన మగవారిలో ప్రతి 100గ్రాముల రక్తంలో 13 గ్రా., ఆడవారిలో 12 గ్రా., 6 సంవత్సరాల లోపు పిల్లల్లో 11గ్రా., గర్భిణీ స్త్రీలలో 11 గ్రా., బాలింతల్లో 12గ్రా., 7-12 సంవత్సరాల లోపు పిల్లల్లో 12 గ్రా. హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ ఈ మోతాదు విలువల కన్నా తగ్గితే రక్తహీనతతో వారు బాధపడుతున్నారని అర్థం. రక్తహీనతకు గురైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు సంఖ్య తగ్గిపోతుంది. ఆర్‌బీసీ(రెడ్ బ్లడ్ సెల్స్)లోని హిమోగ్లోబిన్, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్తుంది. అంటే ఆక్సిజన్ రవాణా వ్యవస్థగా ఎర్ర రక్తకణాలు పనిచేస్తాయి.

ప్రధానమైన బలహీనత
మహిళల్లో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనతలు రక్తం హీనత. అందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. రక్తం నష్టపోవడం, రక్తం ఉత్పత్తిలో ఆటంకం ఏర్పడం, పౌష్టికాహారలోపం. అయితే, సాధారణ పనులకే ఆయాసం రావడం, బలహీనం, నిరాశక్తత, ఆలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, పాదాల్లో నీరు చేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 ఏళ్ల వయసుగల మహిళల్లో, పదకొండు సంవత్సరాలలోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. రుతుచక్రం సమయంలో అధిక రక్త స్రావం కావడం వల్ల, పైల్స్ సమస్య వల్ల కూడా ఎనీమియా సంభవించవచ్చు. కొద్ది మంది మగవాళ్లలో కూడా రక్తహీనత సంభవిస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత వల్ల ముఖ్యంగా బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువతో బిడ్బ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గిపోవడం, వెంటనే వెంటనే రోగాలు రావటం, చదువులో వెనకపడటం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మొదలైన దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

రక్తహీనత ఉన్నవారు ప్రధానంగా ఆహార నియమాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మహిళలు. ఇనుము ఎక్కువగా లభ్యమయ్యే ఆకుకూరలు, పొట్టుధాన్యాలు, మాంసాహారం తరుచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం తప్పనిసరిగా చేయాలి. రక్తహీనత ప్రమాదకరమైనది కాబట్టే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక పెట్టి ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఉచితంగా అందజేస్తోంది.

ఇనుము కలిసిన ఉప్పుతో...

నిజానికి దేశంలో అధిక శాతం జనాబా రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు ఏర్పడిన కొత్త మార్గం ఇనుము కలిపిన ఉప్పును వినియోగించటం. దీన్ని జాతీయ పోషకహార సంస్థవారు కనుగొన్నారు. సాధారణ ఉప్పుకు బదులు కొత్తగా తయారు చేసిన ఈ ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడటం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్తహీనతను నివారించవచ్చు. ప్రస్తుతం ఇనుము కలిపిన ఉప్పు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే దొరుకుతోంది.

విటమిన్ బి12 తప్పనిసరి అవసరం. తాజా కూరగాయలలో, పాలకూర, క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అరటిపండు, యాపిల్, ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. అరటిపండులో ఉండే ఫోలిక్ యాసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు బాగా ఉపకరిస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగడం మానేయాలి. ఎండు ఫలాలు, పులుపు ఉండే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

రక్తహీనతను అశ్రద్ధ చేయవద్దు. అది కేవలం నీరసానికి మాత్రమే దారి తీయదు. ప్రాణహాని కూడా కలుగవచ్చు. అందుకే ఆహార నియమాలు పాటిస్తూనే వైద్యులను సంప్రదించడం సరైన పని.

Saturday, 22 February 2014

SALT - USES TO HUMANS - ADVANTAGES AND DISADVANTAGES OF USING SALT - BRIEF ARTICLE ON SALT


'ఉప్పులేని కూర యొప్పదోరు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు... అప్పులేనివాడే అధిక సంపన్నుడు...' అంటూ సాగే వేమన పద్యాన్ని చాలామంది చదివే ఉంటారు. దీనిలో అప్పులేని అధికమైన ధనవంతుడని చెప్పినా తొలుత 'ఉప్పులేని కూర..' అన్నాడు. కూర రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. నేడు ఉప్పువాడని పదార్ధం అంటూ లేదు. చివరకు చాలామంది మంచినీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలుపుకుని తాగుతుంటారు కొన్ని సందర్భాల్లో. అలా ఉప్పు అన్నది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అంతేకాదు ఉప్పుకోసం సత్యాగ్రహమే జరిగిన దేశం మనది. గాంధీగారి 'ఉప్పు సత్యాగ్రహం' ఆనాటి పాలకులను గడగడలాడించిన సంగతి జగద్విదితమే. అయితే ఉప్పుఅయినా, అప్పు అయినా ఎక్కువైతే ముప్పే సుమా! మన శరీరానికి ఎంతమేరకు అవసరమో అంతవరకే ఉప్పును వాడుకోవడం ఉత్తమం. 

సాధారణంగా మన శరీరానికి ఉప్పు రోజుకు సుమారుగా 4 గ్రాములు అవసరమవుతాయని డాక్టర్లు చెబుతుంటారు. అయితే కొలతలతో తీసుకోరు కనుక ఉప్పును చాలామంది అనుకున్న దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉప్పును ఆహార పదార్ధాల ద్వారా తీసుకోవడం జరుగుతోంది. ఉప్పు ఎక్కువగా వాడే వారికి అధిక రక్తపోటు వస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. అలాగే అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, మూత్రాశయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రక్తపోటు వచ్చిన వారు పలు విధాల మందులను ఎక్కువగా వాడకుండా సాధ్యమైనంత తక్కువగా ఉప్పును వాడటం ద్వారా రక్తపోటు చాలామటుకు అదుపులో ఉంచుకోవచ్చునని వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. 

రక్తపోటు తగ్గేందుకు వాడే మందులవల్ల కళ్ళు తిరగడం, ఒళ్ళు తూలడంతో పాటు గుండె జబ్బులు వంటి అనర్ధాలకు దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరించడమేకాదు, రక్తపోటును తగ్గించుకోవడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరమనికూడా చెబుతున్నారు.

చిన్నపిల్లలు ఉప్పు ఎక్కువగా తినడం, ఊరగాయలు ఎక్కువగా తినడం వల్ల వారిలో ఉదర సంబంధమైన క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉప్పు ఎక్కువగా వేసి తయారుచేసే కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్‌ను తినిపిస్తుంటారు. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఫాస్ట్‌ఫుడ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.

నేడు ఎంతోమంది జరిపిన పరిశోధనల్లో ఉప్పుకోసం ప్రత్యేకంగా ఉప్పును వాడనవసరం లేదని మనం రోజూవారీ తీసుకునే ఎక్కువగా వండని కూరగాయలు, పండ్లలో మన శరీరానికి అవసరమైన ఉప్పు లభిస్తుందని పరిశోధనల్లో ద్వారా తేలింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఉప్పును అసలు తీసుకోకుండా ఉన్నట్లయితే నీరసం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఏర్పడతాయంటున్నారు. అందుకే ఉప్పును ఎంతవరకో అంతే తీసుకోవడం ఉత్తమం.

ఉప్పువల్ల కొన్ని లాభాలుకూడా ఉన్నాయి. ఉప్పును నీళ్ళల్లో కలిపి ఇంటిని శుభ్రంగా కడిగినట్లయితే ఈగలు కొన్ని గంటల వరకు నేలపై వాలి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. దీపం బుడ్డిలో పోసే కిరోసిన్‌లో కొద్దిగా ఉప్పు కలిపితే దీపం కాంతి ఎక్కువ కావడమేకాకుండా, కిరోసిన్‌ కూడా ఆదా అవుతుంది. ఈ విషయం తాతయ్య, నానమ్మలు ఉన్న ఇళ్ళల్లో చాలామంది తెలిసే ఉంటుంది. నేటికి కూడా కిరోసిన్‌ దీపాలు వాడే చాలా ఇళ్ళల్లో ఇలా చేస్తుంటారు కూడా. వస్త్రాలమీద సిరా మరకలు ఉన్నట్లయితే ఉప్పుతో బాగా రుద్ది, వేడినీళ్ళతో కడిగినట్లయితే పోతాయి. 

నిల్వ ఉండే బియ్యంలో ఉప్పును చల్లినట్లయితే పురుగులు బియ్యానికి పట్టే అవకాశం లేదు. దానిలో ఉన్న పురుగులు కూడా పోతాయి. ఇలా ఉప్పు వల్ల చాలా లాభాలున్నాయి. అయితే శరీర ఆరోగ్యం ముఖ్యం కనుక శరీరానికి ఎంత ఉప్పు అవసరమో అంత ఉప్పునే వాడటం ద్వారా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.