WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Coconut Water Health Tips. Show all posts
Showing posts with label Coconut Water Health Tips. Show all posts

Tuesday, 16 December 2014

HEALTH WITH COCONUT WATER TIPS IN TELUGU - PUT CHECK TO ULSER WITH COCONUT WATER



కొబ్బరి నీటితో అల్సర్‌కు చెక్‌

కొబ్బరి బోండాం అల్సర్‌ను దూరం చేస్తుంది. టైమ్‌కి తినకపోవడం, అధిక కారంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం అల్సర్‌కు దారితీస్తుంది. అందుచేత అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే కొబ్బరి బోండాంను తీసుకోవాల్సిందే. కడుపులో మంట, చాతిలో మంట, వేవిళ్ళు వంటి లక్షణాలు మనక ఇట్టే తెలిసిపోతాయి. ఈ లక్షణాలు ఉన్నపుడు చాక్లెట్‌, కూల్‌ డ్రింక్స్‌, పెప్పర్‌మింట్‌, కాఫీ, బ్లాక్‌ టీ, ఆరెంజ్‌, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. గోధుమలు, చికెన్‌, ఫిష్‌, కోడిగుడ్డు, పెరుగు, మేడిపండును తీసుకోవచ్చు. కానీ చక్కెర, కొవ్వు అధికంగా గల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలి. ఉప్పును కూడా తగ్గించాలి. వీటితో పాటు కొబ్బరిబోండాం అల్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
కొబ్బరి బోండాంలోని నీటిని ఉదయం, సాయంత్రం తీసుకుంటే అల్సర్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీర ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కంటికి మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలను నయం చేస్తుంది. ఇక మధ్యాహ్నం పూట కొబ్బరిబోండా నీటిని తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనతకు చెక్‌ పెడుతుంది. బీపీని కంట్రోల్‌ చేస్తుంది. పచ్చకామెర్లు, కలరా, చికెన్‌ ఫాక్స్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.