WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Telugu Puranalu. Show all posts
Showing posts with label Telugu Puranalu. Show all posts

Friday, 30 September 2016

TELUGU PURANA STORY CHAKARAKUKSHI


చకారకుక్షి!
_
కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట.
దానిపరిణామక్రమం తెలిసికుందాం!
భారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంతపెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు చకారం యెక్కువగా వాడారట!
అదీ కాళిదాసు ఆయన్ని చకార కుక్షి యంటానికి కారణం.
కాళిదాసు విశ్వనాథుని దర్శంచేందుకు ఒకపర్యాయం కాశీ వెళ్ళాడు.
అక్కడ ఒకపరిచాయకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి " వీరు వ్యాసులవారు" అనిపరిచయం చేస్తూ విగ్రహం చూపారట.
కాళిదాసు" ఓహో వీరా ఆచకారకుక్షి " అంటూ విగ్రహం బొడ్డులోనికి తన వేలు దూర్చారట. అంతే ఆవేలు యిరుక్కుపోయింది.
.
కాళిదాసు ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి " మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి చకారం లేకుండా ఒక్క శ్లోకంచెప్పు,? చెప్పావో నీవేలూడుతుంది. అన్నాడట.

కాళిదాసు వినయంగా తలవంచి" తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం.ఊరక యేదోవేళాకోళానికల్లా అన్నాను గానీ మరేదీ గాదు. మీవలెశ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి" అనిపలికి -
.
శ్లో: ద్రౌపద్యా ః పాండుతనయాః
పతి ,దేవర, భావుకాః,
నదేవరో ధర్మరాజః
సహ దేవో నభావుకః; -
.
అని వెంటనే ఒకశ్లోకం చెప్పారట. నెచ్చుకుంటున్నానయ్యా!
నీపాండిత్యానికి, చిరాయుష్మాన్భవ! అని ఆశీర్వదించారట.
కాళిదాసు వేలు బయట పడింది.
ఇంతకీ దీనికి అర్ధంయేమిటి అని మీసమదేహంకదూ!
చెపుతా వినండి.

" ద్రౌపదీ దేవికి పాండవులతో భర్త, మరది , బావగారు, అనేమూడురకాల బాంధవ్యాలున్నాయి. ధర్మరాజు మరదికాడు , సహదేవుడు బావగాడు"
అనిదీవియర్ధం! చూశారా కాళిదాసు ప్రతిభ!
కాళికా వర ప్రసాదిగదా ఆతవికి యిక తిరుగేది?

TELUGU INFORMATION ABOUT MAYALAYA AMAVASYA



దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

Friday, 9 September 2016

STORY ABOUT BRUHASPATHI GRAHA ANUGRAHAM


బృహస్పతిగ్రహ అనుగ్రహానికి బృహస్పతి వైభవం చదవండి!
బృహస్పతి ఆవిర్భావం :
బృహస్పతి ప్రజాపతి పుత్రుడు…ప్రజాపతి ఎనమండుగురు….అని పురాణాల ద్వారా మనకు తెలుసుస్తోంది.
దక్షప్రజాపతి… త్వష్ట ప్రజాపతి…. కశ్యప ప్రజాపతి ఈ వరుస క్రమం లో… మరీచి… అనే మహాముని కుడా ప్రజాపతి పదవి లభించింది.ఈ ప్రజాపతులు తమ తమ ప్రాతినిధ్యం నిలుపుకొనుటకు అసంఖ్యాకంగా జనగణాలను సృష్టించ సాగారు.దక్షప్రజాపతికి స్త్రీ సంతానం అధికం ఒక కుమార్తె సతీదేవి ఈమే పరమేశ్వర పత్ని…ఒక కుమార్తె దితి ఆమె కశ్యపుని పత్ని…27 మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేసినాడు దక్షప్రజాపతి.
ఇంకొక ప్రజాపతి.. త్వష్ట… తన కుమార్తె …. సంజ్ఞ….సంజ్ఞను సూర్యునుకి ఇచ్చి వివాహం చేసినాడు త్వష్ట.ప్రజాపతి..
ఇదే విధంగా మరీచి ప్రజాపతి…తన పుత్రిక సురూపను ఆంగిరస మహర్షి ఇచ్చి వివాహం చేసినాడు మరీచి ప్రజాపతి. ఆంగిరస మహర్షి దంపతులకు….ఆంగిరస నామ సంవత్సర వైశాక సుద్ధ ఏకాదశి తిది యందు ఉత్తరపల్గుని నక్సత్రం లో బృహస్పతి జన్మించాడు.
బృహస్పతి రూప వివరణ :
ఒక చేతిలో అక్షమాల..మరొక చేతిలో కమండలం…ధరించి దేవతలకు గురువైనాడు బృహస్పతి…
మరో ప్రజాపతి పుత్రిక …తారను వివాహం చేసుకున్నాడు బృహస్పతి.
గురు గ్రహ అనుగ్రహానికి మార్గాలు
1.గురువారం నాడు శెనగలు దానం చేయుట.
2. బంగారం లో కనకపుష్యరాగాన్ని కుడిచేతి చూపుడు వ్రేలికి ధరించుట.
3.గురుధ్యాన శ్లోకం రోజుకి 160 సార్లు జపించుట.
4.గుంటూరు జిల్లా చేబ్రోలు లో గల బ్రహ్మ దేవాలయం దర్శించుట.
5.తమిళనాడు రాష్ట్రం లోని అల్లంగుడి ఆలయాన్ని దర్శించుట.
6.ప్రతి గురువారం సూర్యోదయానికి పూర్వమే 160 ప్రదక్షిణలు చేయుట.
7.గురువారం రోజున గోవుకు గ్రాసం పెట్టుట.
8.నవగ్రహాలలో గురువుగ్రహం వద్ద గురువారం రోజున 16 పసుపురంగు వత్తులతో దీపారాధన పసుపు వస్త్ర దానం చేయుట.
9.16 గురువారాలు 160 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి కేజిం పావు బరువుకలిగిన శెనగలు పసుపు వస్త్రం లో దానం ఇచ్చుట.
10.16 గురువారాలు ఉపవాసం చేసి ఆఖరి గురువారం దక్షిణామూర్తి కి బృహస్పతికి అర్చన చేయించుట.
ఇలా చేయుట వలన గురుగ్రహానికి పాత్రులు అవుతారు.

Friday, 2 September 2016

TREES - GODS - PUJA - IMPORTANCE OF TREES IN HUMAN LIFE



వృక్ష దేవతలు

హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.

నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.

తులసి

తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది


యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం


మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.

రావి

దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది

మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:


ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.

వేప

వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.


మారేడు

మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.

ఆ శ్లోకం

అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌


మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్షం. వారి గురువుల్లో ఒకరైన 23వ తీర్థంకరుడు భగవాన్‌ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు. మారేడులో ఔషధ గుణాలు అధికం. కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.
జమ్మి

జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి. సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం కూడా ఉంది. అది

శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని


శమి శత్రువులను నశింపజేస్తుందని, పాండవుల ఆయుధాలను మోసినదని, రామునికి ప్రియమైనదని దీని అర్థం. ఈ వృక్షం పైనే అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలు దాచారు. అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతున్నపుడు ఈ వృక్ష అధిష్ఠాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ అలాగే అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ. ఈ చెట్టు బెరడనును కుష్ఠు రోగం, గాయాలు, శరీరంపై వచ్చే వ్రణాలు వంటి వాటి చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడు పొడి గొంతు నొప్పి, ఆస్త్మా మరెన్నో రోగాల చికిత్సలో ఉపయోగపడుతుంది. గింజలు, రెమ్మలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తుంది.

ఉసిరి

ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తా రు. అందరికీ తెలిసిన వన భోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలంటారు. కార్తీక మాసంలో ఈ చెట్టు ను శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.


మేడి

మేడి చెట్టుకింద దత్తాత్రేయుల వారు కూర్చుని ఉంటారు. త్రిమూర్త్యాత్మకుడు ఎప్పుడూ ఏ చెట్టు నీడనుంటాడో అది పవిత్రమైనది కాక మరేమవుతుంది. అది దేవతా వృక్షమే. ఎండిన మేడి పళ్లను ఆరోగ్యం కోసం కూడా వాడతారు.


మర్రి

మర్రి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును చాలా సంస్కృతుల్లో జీవానికి, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్లనే సంతానం లేనివారు మర్రి చెట్టును పూజించే ఆచారం ఉంది. అలాగే దీనిని ఏ సమయంలోనూ నరికి వేయరాదన్నది పురాణాలలో పేర్కొన్నారు. సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని ఇండియన్‌ బొటాని కల్‌ గార్డెన్‌లో ఉన్న మర్రి చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దది.


అశోక

ఈ చెట్టును కామ దేవునికి ప్రతీకగా భావిస్తారు. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెబుతారు. అందువల్ల వీటిని బౌద్ధారామాల్లో ఎక్కువగా నాటుతుంటారు. అశోక వృక్షం కూడా పవిత్ర వృక్షం ఒకటి. పుష్పాల నుంచి తీసే ఎసెన్స లో ఈ పుష్పాలకు ప్రత్యేక స్థానం ఉంది.ఇది దట్టమైనాకులతో నిటారుగానిలబడే చిన్నది. ఇది పువాసన కల ఎరుపు రంగు పుష్పాలతో ఉంటుంది. ఏప్రిల్‌, మే నెల్లో ఈ చెట్టు పుష్పిస్తుంది. హిమాలయాల తూర్పు, మధ్య ప్రదేశ్‌ లోను, ముంబై పశ్చిమ తీర ప్రంతంలోనూ ఇది కనిపిస్తుం ది.అశోక అంటే సంస్కృతంలో శోకంలేనిది లేదా శోకాన్ని దూరం చేసేది అనేఅర్థాలు చెప్పుకోవచ్చు. దీనికి ప్రాంతీయ భాషల్లో పలు పేర్లు ఉన్నాయి.


మామిడి

మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ మామిడిపండు పండుగా ప్రేమకు, సంతానసాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభ కార్యమైనా మామిడి ఆకు తోరణాలు కట్టకుండా ప్రారంభం కాదు. ఈ ఆకులకు ఎక్కువ మంది చేరిన చోట ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని కూడా చెబుతారు.


కొబ్బరి

కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా వ్యవహరిస్తారు. అన్ని దైవసంబందమైన కార్యాలనూ కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. పూర్ణ కుంభంలో పై నుంచేది కొబ్బరికాయనే. ఇక కొబ్బరికాయను శివ స్వరూపంగా దానిపై ఉన్నమూడు నల్ల మచ్చలను ఆయన త్రినేత్రాలుగా పేర్కొంటుంటారు. కొబ్బరికాయ నీరు మనుషులు తాకని స్వచ్చమైన జలమని నమ్ముతారు. అటువంటిది మరే పండు విషయంలోనూ లేదు, దేవతలకు కొబ్బరి నీటితో అభిషేకం చేయడం కూడా చేస్తుంటారు.


అరటి

అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవునికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభ కార్యాసమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లోకదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజచేస్తారు.


చందనం

చందనం చెక్క ఆరగదీయడం వల్ల వచ్చే చందనం నిత్య పూజలో ఒక భాగం కనుక దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులో దానిని ఇచ్చే చందన వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు.


వెదురు

దేవునికి చెందిదేదైనా పవిత్రమైనదనే భావంతో కృష్ణుని వేణువు తయారైన వెదురును కూడా దేవతా వృక్షంగా భావిస్తుంటారు. హిందీలో బన్సూరి అంటే వేణువు. కృష్ణుడు చేతిలో వేణువు కలిగి ఉంటాడు కనుక ఆయనను బన్సీలాల్‌ అని కూడా పిలుస్తుంటారు.


Tuesday, 31 May 2016

BRIEF ANALYSIS OF HINDU PURANAS


పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు
ముందుగా ఒక చిన్న కధ చెప్పుకుందాం. (పాపం శమించు గాక )

ఏదో చిన్న గొడవ వలన క్రీ.శ.12090లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇంచుమించు అన్ని బలవత్తరమైన దేశాల వద్ద అణ్వాస్త్ర సంపద వున్నాయి. అందరూ యుద్ధంలో పాల్గొని ఒకరి మీదకొకరు ఈ అస్త్రాలు సంధించుకున్నారు. కొన్ని ఉత్తర దక్షిణ ధ్రువాల మీద కూడా పడ్డాయి. అక్కడున్న మంచుకొండలన్నీ కరిగిపోయి ఒక్కసారి మొత్తం ప్రపంచమంతా జలప్రళయంలో మునిగిపోయాయి. దాదాపు అన్ని దేశాలు నీటమునిగిపోయాయి. అన్ని భవనాలు అగ్నికీలలో దగ్ధమయి తరువాత జల ప్రళయం వలన మునిగిపోయి, ఎక్కడనుండో కొట్టుకువచ్చిన మట్టితో కప్పబడిపోయాయి. ఈ భీభత్సం ఒక పది రోజులు జరిగాక మరల మామూలుగా నీరు తీసేసింది.వాతావరణం అంతా మారిపోయింది. దేవుని దయ వలన కొందరు మాత్రం ఎత్తైన కొండ గుహలలో, కొన్ని జీవ జంతుజాలం గుహలలోనో ఎక్కడో నక్కి ప్రాణం దక్కించుకున్నారు. వారు బయటకు వచ్చి చూస్తె కొత్త ప్రపంచం, మొత్తం మారిపోయి కనబడుతోంది. ఆకలేస్తోంది. వారు చెట్టులు, పుట్టలు వెతికి వారికేమైనా దొరికితే తింటూ బ్రతుకుతున్నారు. వారిలో కొంతమంది కొన్ని గుహలలోను, లేదా వారిదగ్గరున్న పుస్తకాలలోనూ వారు చూసిన ప్రపంచం గురించి రాసారు. అప్పుడు రాకెట్స్ ఉండేవని, ఎలా ఉండేవో నమూనాలు రాసుకున్నారు, దూరంగా వున్నవాళ్ళతో ఫోన్లో మాట్లాడేవారని, టీ వీలు, ఇంటర్నెట్, వగైరా, వగైరా గురించి రాసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి, ఎలా చికిత్స చేసేవారో, ఆపరేషన్లు, ఇతర జీవన ఆరోగ్యం గురించి ఎన్నో రాసుకున్నారు. అవన్నీ ఒక చోట భద్రంగా దాచుకున్నారు. నేడు వారికి తిండి దొరకడమే ప్రధానం. అన్నీ పోవడంతో వారు కేవలం కొన్ని ఆకులు కప్పుకుని బతుకుతున్నారు. వారికున్న జ్ఞానంతో కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు. వారి సంతానానికి విషయం చెప్పారు. కానీ తిండి కోసం వారు మరిన్ని ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
ఇలా ఒక పది తరాలు గడచి పోయాయి. అప్పుడు వారిలో ఒకడు వీరు ముందున్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కొన్ని పాడుబడ్డ ఆవాసాలు కనబడ్డాయి, శిధిలమై. వాటిలో వాడికొక పుస్తకం దొరికింది. దానిలో ఎలా జీవించాలో రాసుంది, అంతకు ముందు ఎలా జీవిన్చారో రాసుంది. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ తెగలో కొంతమందికి చెప్పాడు. భగవంతుడిని ఎలా ఆరాదిన్చేవారో తెలుస్కుని, వారు కూడా ఆ పద్ధతి పాటించారు. ఇదే భూగోళానికి అటువైపు కూడా కొంత మంది బ్రతికి బట్ట కట్టారు. వాళ్ళు ఎప్పుడో వీళ్ళను కలుసుకున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరున్న పుస్తకాలలో విషయాల గురించి విన్నారు. అప్పట్లో గాల్లో వేల్లెవారట, ఇది నమూనా అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. తిండే దొరకని మనకు ఈ కట్టు కధలు అవసరమా అంటూ గేలి చేసారు. ఈ తెగ వాళ్ళనందరినీ పిట్టకధల దొరలూ అని ముద్ర వేసారు. వారి జీవన విధానాన్ని వెక్కిరించారు. వారి గ్రంధాలను తిట్టారు. అప్పుడు విమానాలుంటే ఇప్పుడెక్కడికి పోయాయి. ఏది నువ్వొకటి తయారు చెయ్యి అన్నారు. కానీ అప్పుడు కరెంటు లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు, ఏమి లేదు. వారికి ఆ జ్ఞానం లేదు. వీళ్ళు ఇప్పుడు ఆ పుస్తకాలలో విషయాన్ని ప్రాక్టికల్ గా చూపలేకపోతున్నారు కాబట్టి వీళ్ళవన్నీ కాకమ్మ కబుర్లు అని, వీళ్ళు వట్టి వెధవలోయ్ అని ముద్ర వేసారు. అవును నిజమే అని ఈ తెగలో కొంతమంది మిగతా వారిని ఎద్దేవా చేస్తున్నారు. ఆస్తిక నాస్తిక మతాలు పుట్టాయి. ఆ పుస్తకాలు నమ్మిన వాళ్ళు వెర్రి వెంగలప్పలు నమ్మనివాళ్ళు ఆధునీకులు అని పేర్లు పెట్టుకున్నారు.
పైదంతా చదివితే మీకేమైనా గుర్తుకొస్తోందా? ఈ రోజున జరుగుతున్న విషయం స్ఫురిస్తోందా? మన వాంగ్మయంలో చెప్పారు ఒకప్పుడు పుష్పక విమానంలో విహరించారట అంటే అదొక కట్టు కధ. ఒకప్పుడు రాజ్యాలలో ఈ విధంగా రాజ్యం చేసారట అంటే మరొక పిట్ట కధ. అస్త్ర, శాస్త్రాలతో యుద్ధం చెయ్యగలిగేవారట. సమయం ఇలా గణించారు, శస్త్రచికిత్సలు చేసారు, కుంభ సంభవులు పుట్టారు అంటే ఇవన్నీ mythology అని కొట్టి పారేస్తున్నారు. మంత్రప్రభావం, ప్రాభవం ఇదంటే దాని మీద నమ్మకం లేక చింతకాయలు రాల్చమంటున్నారు. జలప్రళయం వచ్చి అందరూ మునిగిపోతే ఒక మనువు బ్రతికాడని, తరువాత ఎందరో మహర్షులు వచ్చి మనకొక జీవన విధానం నేర్పారు అని మన పురాణం చెబుతోంది.. నిత్యసత్యాలన్నీ మన వాంగ్మయంలో, గ్రంథాలలో ఉన్నాయంటే నమ్మి పాటించిన వారు ఒక 8000 ఏళ్ళ క్రితం ఎలా వుండేవారో నేడు కొన్ని తవ్వకాలలో బయట పడ్డాయి. అదే మనకు అవతలి వైపు వాళ్ళు అప్పటికి అడవి పందులు వేటాడుకుంటూ వుండేవారు కనీసం 1000 సంవత్సరాల క్రితం వరకు. కాలక్రమేణా వారు కొన్ని కనిపెట్టారు, మనం అందరం వాడుకుంటున్నాం. అది నిజం, ఇదీ నిజం. కానీ పురాతన గ్రంథాలలో ఎలా ఉండేదో అప్పటి మన మనుష్యుల జీవనం, న్యాయం, ధర్మం జీవన విధానం, శాస్త్ర దృక్పధం ఆరోగ్య పరిరక్షణ విధానం అన్నీ రాసి వుంది. దేవుడిని ఎలా చేరాలని రాసి వుంది. దాన్ని నమ్మి పట్టుకున్న మనం తప్పక సాధించగలం. కావలసినదల్లా దాని మీద నమ్మకం. వారు చెప్పిన విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోగల సామర్ధ్యం కావాలి. వాటి గురించి మనం మరింత లోతుగా పరిశీలించాలి. శోధించాలి, సాధించాలి. అంతేకానీ మనకు మనం తక్కువ అంచనా వేసుకుని మనం ఆత్మన్యూనతా భావం పనికిరాదు. మన మీద, మన గ్రంథాలపై, మన పురాణాల మీద మనకు నమ్మకం, గౌరవం వుండాలి. కాదంటారా?
మీకోసం ఈ లంకె.
http://timesofindia.indiatimes.com/…/articlesh…/52485332.cms

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!


Friday, 27 May 2016

WHAT IS THE MEANING OF "VEDHAMU"


అసలు వేదమనగానేమి ?

వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము.
వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము.

|| వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ ||
అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము.
వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు. అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది.

|| ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః ||
కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేదము అని ఆచార్య సాయణులు తమ ’ కృష్ష్ణ యజుర్వేద సంహితా భాష్యము ’ లో చెప్పినారు.

Friday, 5 February 2016

POEM AND MEANING IN BHIMESWARA PURANAM


గొప్పవారు గొప్ప,గొప్ప విశేషాలు చెప్పినా అల్పులకు 
అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు.! 

తన ‘భీమేశ్వర పురాణ’ కావ్యంలో కుకవి నింద చేస్తూ 
“ అడరి కాకులు చేరి బిట్టరచునపుడు, 
ఉదధి రాయంచ యూరక యుంట లెస్స,
సైప లేకున్న యెందేని చనుట యొప్పు” అని దూషిస్తాడు.
.
చెడ్డవారి మధ్య ఓ మంచి వాడు ఉన్నపుడు వారి ఎగతాళి మాటలకి
మౌనంగా ఉండటమే మంచిది. లేదా అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం.
.
గొప్పవారిని చూసి మనం ఎప్పుడు ఎగతాళి చేయకూడదు’.
అని సుభాషిత రూపంలో ఉన్న ఈ చాటు పద్యం వివరిస్తుంది.
.
గొప్పవారు గొప్ప,గొప్ప విశేషాలు చెప్పినా అల్పులకు అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు.!
.
ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?
దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?
మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!
.
హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరంలో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలు, మేలిమి ముత్యాలు ఉంటాయి. నత్తగుల్లలు కప్పలు వంటివి ఉండవు. మామూలు చెరువులలో వుంటూ నత్తలు, చేపలు తిని బ్రతికే కొంగలకి శ్రేష్టమైన పద్మాల, ముత్యాల యొక్క విలువ తెలియదు. అందుకే అవి హంసని పరిహసిస్తాయి. ఇది పైపద్యభావం.ఇప్పుడు సంభాషణారూపంలో వివరణ------
కొంగలు— “ఎవరునువ్వు? నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉంది ఎందుకు?
హంస - ‘నేను హంసని!’
కొంగలు – “ ఎక్కడనుంచి వచ్చావు”?
హంస - “ చాలా దూరంలో ఉన్న మానస సరోవరం నుంచి వచ్చా!”
కొంగలు - ‘ అక్కడి విశేషాలు ఏమిటి’?
హంస - “బంగారు వర్ణంలో ఉన్న తామర పువ్వులు, మంచి ముత్యాలు లభిస్తాయి!”
కొంగలు – ‘ నత్తలు ఉంటాయా’?
హంస - ‘ అవేమిటో నాకు తెలియదు’!
కొంగలు – “నత్తలు తెలియవా? అని పక,పకా నవ్వుతాయి”

Saturday, 30 January 2016

REASON BEHIND WEARING PEACOCK EYES OVER HEAD BY LORD SRI KRISHNA


శ్రీకృష్ణుడు నెమలి ఫించము ఎందుకు ధరిస్తాడు

మయూరనృత్యం మనసును ఆహ్లాద పరుస్తుంది. అందానికి నిండైన ఉదాహరణ నెమలి. హిందువుల ఆరాధ్యుడైన శ్రీకృష్ణ భగవానుడి అలంకారంలో నెమలిపింఛానికి ఉన్న విలువ అంతాఇంతాకాదు. పురాణేతిహాసాల్లో నెమలి ప్రస్తావన ఉండనే ఉంది. అందుకే మన జాతీయపక్షిగా నెమలిని గుర్తించారు. ఈ నెమలి ఈకలకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసుకోవాంటే ఈ కథ చదవాల్సిందే..

నెమలిని మయూరము అని అంటారు ఎందుకు? ‘మ' కారము మధనానికి అని అర్ధము. ‘యూర'అనే పదం హృదయానికి అని అర్ధం. ఇంకా ‘మ' అంటే మగనెమలిని అని కూడా అంటారు. పక్షిజాతిలో ‘యోగవిద్య' తెలిసిన పక్షులు 5మాత్రమే ఉన్నాయి. అవి..శుకము, హంస, గరుడు, నెమలి చివరిది పావురము. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఝానము ఉన్నది. అసలు నెమలి అందమే పింఛం. క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలిసికుందాము: శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచపక్షుల గాయాలు నయంచేసినందుకు గాను వృద్దుడైన ఆ రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే, వద్దని, మీకు మల్లే నేను విహాంగంగా ఆకాశంలో విహారించాలిని ఉందని అది అనుగ్రహించండి. అలాగే అని మేము చెప్పబోయే దేవతా మంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడే నీకు పనిచేసి, నీకు చిత్రవిచిత్రమైన వర్ణనలు కలిగిన ఈకలు, పింఛము కలుగగలవు. అప్పుడు ఈ జగత్తులో నీయంతటి అందమైన పక్షి మరొకటి ఉండదు. ఒక హెచ్చరిక, ఎటువంటి పరిస్థితులలో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు' అని వెళ్ళిపోయాయి.

ఒకనాడు ఆకాశం మేఘావృతమై ఉండగా ఈ మంత్రప్రభావం చూద్దామని, మంత్రోఛ్చరణంగా ఈ మంత్రాన్ని పఠించి మనోహరమైన, అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తుండగా అతని భార్య చూసింది. ఆనాటి నుండి భర్తను ఎన్నో విధాలుగా హింసిస్తూ, వేధిస్తూ ఆ మంత్రాన్ని తనకు చెప్పమంది. ఇక ఆ బాధలు పడలేక సరేనన్నాడు. ఇది తెలిసికున్న ఆ మంత్రాన్ని అధిష్టించిన దేవత అతని భార్యకు బుద్దిచెప్పాలకున్నది. ఆ మంత్రము చేత కారుమేఘాలను సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేసింది. ఆ సమయంలో ఆయన భార్య తను అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నాననే భావనలో ‘అతి సుందర:' అనబోయి‘అసుందర' అన్నది. వెంటనే ఆ పదజాలంతో ఆమె పింఛంలేని ఆడనెమలిగా మారిపోయింది.

తమకు ఇచ్చిన వాగ్ధానాన్ని తప్పాడని ఆ క్రౌంచపక్షులు ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారిపొమ్మన్నాయి. రేతస్సు అనగా వీర్యం: దీనిలో అమొఘమైన శక్తి నిల్వ ఉంటుంది. ఇలంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్ని పొంది వీర్యహీనులు అంటే తేజమును, శక్తిని కోల్పోతుండగా, యోగులు ఇదే వీర్యాన్ని‘ఊర్ధ్వపతన' క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గగాములుగా అవుతున్నారు.

ఇటువంటి యోగులందరిలోకి శ్రీకృష్ణభగవానుడు పరమొత్తమమయిన పరమయోగి. పదహారువేల మంది గోపికలున్నా, అష్టభార్యా సహితుడైనా, భామాలోలుడన్న పేరున్నా ఆయన అసలుసిసలైన నిఖార్సైన బ్రహ్మచారి. అందుకే ఆయన ‘అస్ఖలిత బ్రహ్మచారి' అయ్యాడు. నెమళ్ళకు తమ వీర్యాన్నీ ఊర్ద్వముఖంగా నడిపించినగల శక్తి గలవి. అయితే జ్జానంలో మనిషికన్నా ఒక స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఈ రేతస్సు(వీర్యం)పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదపువాసను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్బం ధరిస్తుంది. ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది, స్త్రీ పురుష జననేంద్రియాల సంభోగ ప్రక్రియ ప్రసక్తే లేదు. అందుకని నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. ఎప్పుడైతే, ఎక్కడైతే స్ఖలనము లేదో దాన్ని యోగీ యోగ సమానమై ఆరాధ్యనీయము , సూజనీయము గౌరవస్థానాన్ని ఆక్రమించింది కనుకనే శ్రీకృష్ణుడు తన శిరముపైన నెమలిపింఛానికి సముచిత, సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు.

Wednesday, 27 January 2016

COW PUJA - HOW TO PERFORM PUJA TO COW FOR REMOVING GRAHA DHOSHAM


గోపూజతో గ్రహదోషాలు నశిస్తాయి....!

గోవును పూజించి సేవిస్తే అన్ని గ్రహదోషాలూ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి, ఒక్కోవారము, ఒక్కో ధాన్యము సూచించపడ్డాయి. ఆయా వారాలలో ఆయా గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యాన్ని బెల్లముతో కలిపి ఆవుకు తినిపిస్తే ఆయా గ్రహదోషాలు తొలగిపోయి గ్రహాలు శాంతిస్తాయి.

01. సూర్యుడికి - గొధుమలు, 
02. చంద్రునికి - వడ్లు,
03. కుజునికి - కందులు,
04. బుధునికి - పెసలు,
05. గురునికి - శనగలు,
06. శుక్రునికి - బొబ్బర్లు,
07. శనికి - నువ్వులు,
08. రాహువుకి - మినుములు,
09. కేతువుకి - ఉలవలు. ఇష్టమైన ధాన్యాలు.

Monday, 25 January 2016

WHY FEEDING TO CROW ? TELUGU PURANA ARTICLE



కాకికి అన్నం పెట్టడం ఎందుకు?

వాల్మీకి రామయణమందు కొన్ని ప్రాణుల ప్రత్యేకతను వివరించి వుంది. పూర్వ కాలంలో మరుత్ అనే రాజు దేవ గురువు బృహస్పతి సహోదరుడైన సంవర్తుని ఆధ్వర్యముతో ఒక యాగమును చేసెను. ఆ యాగమునకు ఇంద్రాది దేవతలు సహాయ సహకారాడులను అందించిరి. అప్పుడు అచ్చటికి రావణుడు వెంచేసేను అతని అసాధ్యమైన బల పరాకరమునకు బ్రంహ వారమునకు అంజి దేవతలు తమ రూపాదులను పక్షులుగా మ్రుగాములుగాను మార్చుకొని దాగుకోనిరి. రావణుడు ఒక అపరిశుబ్రమైన శునకము వలే సభలోకి వేంచేసి మరుత్ను యుద్ధమునకు ఆహ్వానించెను. యుద్ధమునకు అంగీకారము లేకపోతె ఓటమిని ఒప్పుకోనమని నిర్భందించెను. అప్పుడు రాజు నువ్వెవరని ప్రశ్నించితే రావణుడు ఒక అలక్ష్య నవ్వు నవ్వి నన్ను గుర్తించలేదా నీ అమయాకత్వానికి జాలి కలుగుతోంది నేను కుబేరుని అసహోధరుడిని అతనిని జయించి ఈ పుష్పక విమానమును పొందితిని. దానికి రాజు నువ్వు నీ సహోదరునే యుద్దములో జయించావా ముల్లోకములలోను నీ లాంటి వీరుని కాంచడం కష్టము కటిన తరమైన తపము ఆచరించి గొప్ప వరములు పొందినది ఎందుకు నేను ఇంతవరకు నిన్ను గురించి వినబడలేదు దూర్తుడా కాచుకొమ్ము నువ్వు ప్రాణములతో తిరిగి వెళ్ళలేవు నిన్ను ఇచ్చటనుండి నేరుగా యమపురికే పంపుతాను అని యుద్ధమునకు సన్నాహములు చేయబోయేను 
అప్పుడు అధ్వర్యుడు సంవర్తుడు రాజా నా మాట మన్నించు మహేశ్వరుని గురించి చేసే యాగ మధ్యలో త్యజించడం నీ వంశ నాశనానికి హేతువు అవును యాగ దీక్షలో ఉండేటప్పుడు యుద్ధము కోపము తగదు యుద్ధము అంటే జయము నీకే నిశ్చయము కాదు అదియు కాక రావణునితో యుద్ధము చాలా శ్రమముతో కూడిన కార్యము అని హిత వచనములు పలికెను రాజు దానికి అంగీకరించి యాగము చేయడానికి పూనికోనేను అప్పుడు రావణుని మంత్రి రావణుడు జయము పొందెను అని ఘోశించెను రావణుడు కూడా ఆ స్థలము విడచి వెళ్ళిపోయెను. 
అప్పుడు ఇంద్రాది దేవతలు తమ స్వయ రూపములతో సభలోనికి వెంచేసిరి ఇంద్రుడు నెమలి రూపములో ఉండినందున నెమలికి సర్ప భయము వుండదు ప్రజలు నిన్ను చంపరు. నీ నీలిరంగు పించ్చమునందు నా వేయి నేత్రముల వలే నీకును కలుగును వర్ష ఆగమనమునకు పూర్వము నువ్వు పించ్చము విప్పదీసుకొని ఆడటము చూడడానికి వేయి కళ్ళు చాలదు అంత రమణీయముగా ఉండును అని వారము ఇచ్చెను 
యముడు కాకిని చూసి నాకు నీయందు చాలా ప్రీతి కలిగినది నీ వల్ల ఎవ్వరికీ ఏ రోగము రాదు నిన్ను ఎవ్వరు చంపరు నీకు అందించే ఆహారము వల్ల పితృ లోకములో పితరులు క్షుద్భాద నుండి విముక్తులు అవుదురు 
వరుణుడు హంసకు పూర్ణ చంద్ర బింబము లాంటి కలుగునట్టు వరము ఇచ్చెను నిన్ను నీటిలో విహరిన్చందము చూసే దానికి రమణీయముగా కనపదేఅట్టు వరము ఇచ్చెను ఏ వరమునకు ముందు హంసకు రెక్కలు అగ్రము నలుపుగాను హృదయ భాగము నీలముగాను వుంటూ ఉండెను 
ఇక కుబేరుడు తొండకు (ఊసరవల్లి) బంగారు వన్నె రుంగుతో ప్రకాశించేదవు నీ శిరో భాగము అరుణ వర్ణముగా వేలుగొందేటట్టు వరము ఇచ్చను 
ఇలా దేవతలు ఆయా ప్రాణులకు వారములు ఇచ్చి రాజు హోమము కొనసాగే వారకు వుంది వరములను ఇచ్చి వెళ్ళిరి. 
అందువల్ల కాకికి అన్నం పెడితే పితృదేవతల తృప్తి కలుగును ఇది యమ వరం.

GAJENDRA MOKSHAMU - TELUGU PURANA STORY ABOUT LORD SRI MAHA VISHNU


గజేంద్ర మోక్షం - శ్రీమద్భాగవతం 

లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి. అక్కడ వరుని దేవుని దయచేత యెప్పుడూ మలయమారుతం వీస్తూనే ఉంటుంది. అందుచేత అక్కడికి దేవతలు వచ్చి విహరిస్తూ ఉంటారు.
హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.
పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక అడవికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠతో విష్ణుధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అగస్త్యముని తన శిష్యులతో ఆ అడవికి వచ్చాడు. ఎదురుగా వచ్చినా తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ మునిని చూడలేదు. లేచి నమస్కరించలేదు. అగౌరవం చేసాడు అని అగస్త్యునికి రాజుపై కోపం వచ్చి , " మదించి ఉన్నట్లున్నావు. అందుచేత నువ్వు ఒక మదపుటేనుగువై పోదువుగాక" అని రాజుని శపించాడు.
అదంతా తన ప్రారబ్ధకర్మ, అనుభవించ వలసినదే అని రాజు మాట్లాడలేదు. తక్షణమే ఇంద్రద్యుమ్నుడు త్రుకూట పర్వత సమీపంలో ఉండే అడవిలో తిరిగే ఏనుగు రాజయిపోయాడు. ఆ ఏనుగురాజెంత బలంగా ఉండేవాడంటే , వాడిని చూడగానే సింహాలు, పులులు , కూడా పరుగెత్తి పారిపోయేవి. ఒక నాడు ఆ యేనుగులరాజు తన గుంపుతో పసందైన ఆకులన్నీ తింటూ తిరిగి తిరిగి , అలసిపోయాడు. గొప్ప దాహమయింది. త్రికూట పర్వతం నుండి చల్లని మలయమారుతం వస్తుంది. ఆ వైపు ఏనుగులరాజు దారి తీసాడు. అలా అలా వెల్లగా ఒక సరోవరం కనిపించగానే ఆనందంగా దాహం తీర్చుకుని , తన గుంపుతో జలక్రీడలాడుకోడం మొదలు పెట్టాడు.
ఆ సరోవరరంలోనే శాపవశాన్న మొసలిగా మారిన గంధర్వుడు ఉన్నాడు. ఆ మొసలి చట్టున వచ్చి , ఏనుగురాజు కాళ్ళు పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ మొసలి నుంచి విడిపించుకుందామని గజేంద్రుడు యెంతో ప్రయత్నించాడు. కష్టమవుతుంటే మిగతా ఏనుగులుకూడా సాయం చేయవచ్చాయి. కాని లాభం లేకపోయీంది. హోరా హోరీగా ఆ రెండూ వేయేళ్లు పోరాడుకున్నాయి. ఈ భయంకరమైన పోరాటం చూడడానికి దేవతలందరూ వచ్చి యేమవుతుందో అని కుతూహలంతో కళ్లప్పగించి ఉండిపోయారు.
క్రమంగా ఏనుగు అలసిపోయి , మొసలిదే పైచేయి అవవచ్చింది. గజేంద్రుడికి మరి తన శక్తితో లాభం లేదని తెలిసిపోయింది. పూర్వజన్మ వాసన వలన దైవచింత వచ్చింది. అందరినీ రక్షించే ఆ దేవుడే నన్ను కాపాడాలి అని ఆలోచించి , " నేనింక పోరాడలేను. ఎవరి ఆజ్ఞచేత యీ ప్రపంచమంతా నడుస్తుందో, ఎవరు తానే సర్వమయి అంతటా ఉన్నాడో , అతడైన నీవే , తండ్రీ , నా దిక్కు" అని దేవుని పార్ధించడం మొదలు పెట్టాడు గజరాజు .
తమని పేరుపెట్టి పిలవలేదని బ్రహ్మ , శివుడు దాని ప్రార్ధనలు పట్టించుకోలేదు. ఏమేమని దేవుని వర్ణించి ప్రార్ధించాడో అవి తనకే చెల్లుతాయి అని శ్రీహరి పరుగుపరుగున గరుడవాహనుడై , అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏనుగు తొండమెత్తి మొక్కుతూండగా , తన చక్రం వేసి , ఆ మొసలిని చంపేసాడు. శాపవశాన్న మొసలి అయిన గంధర్వుడు శ్రీ హరి చక్రంతో శాపవిముక్తుడై , తన యథారూపంలో లేచి వచ్చి , విష్ణుమూర్తికి నమస్కరించిన తరువాత తన లోకానికి వెళ్లిపోయాడు. గజరాజు మొక్కుతూండగా ఆ గజేంద్రమోక్షణం వింతగా చూడవచ్చిన దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు.

Tuesday, 22 December 2015

TELUGU PURANA STORY - LIFE STORY OF BHAKTHA JAYADEVA - IN TELUGU


భక్త జయదేవుడు.

జయదేవుడు సంస్కృత కవి, పండితుడు. ఈయన 12 వ శతాబ్దమునకు చెందినవాడు. అతడు వ్రాసిన రాధాకృష్ణుల ప్రణయకావ్యం, గీత గోవిందం హిందూమత భక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది.

జీవితం

జయదేవుడు ఒడిషా రాష్ట్రం, ఖుర్దా జిల్లాలోని ప్రాచి లోయలో ఉన్నకెందుళి(బిందుబిల్వ) గ్రామంలో ఒక ఉత్కళ బ్రాహ్మణకుటుంబంలో జన్మించాడు. కెందుళి సాసన్ ( ఇప్పుడిలా పిలువబడుతోంది ) గ్రామం, పూరీ కి సమీపంలో ఉంటుంది. కెందులి పట్నము, కెందులి దౌళి, కెందులి సాసనము మూడు గ్రామములలో కలసిన ప్రదేసము. ఇవి ప్రాచీనది ఒడ్డున ఉన్నవి. ఈనది పరమపవిత్రమైననది. కెందులి గ్రామసీమ నుండి రెండుమైళ్ళ దూరంలో ఖుశభద్రానది రెండు పాయలతో ప్రాచీనదిని కలిసేచోటును జనం త్రివేణీసంగమ మని వ్యవహరిస్తారు. కెదులి గ్రామములో వాసుదేవ విగ్రహాలు నారాయణ నామంతో అనేకం కనిపిస్తున్నాయి. అందువల్ల జయదేవుని జన్మగ్రామం ఒరిస్సాలోని ప్రాచీనది ఒడ్డున ఉన్న కెందులి అని చారిత్రకారులు నిర్ణయించారు. ఈ విషయమును జయదేవుడు 7 వ అష్టపదిలో "కిందుబిల్వ సముద్ర సంభవ" అని పేర్కొనెను. జయదేవుడి తల్లిదండ్రులు, భోజదేవుడు మరియు రమాదేవి లు. జయదేవుడు జన్మించినప్పుడు ఒడిషా చోడగంగ దేవ ఏలుబడిలో ఉండేది. జయదేవుడు కుర్మపాటక లో తన సంస్కృత విద్యాభ్యాసం గావించాడు. తరువాత దేవదాసీ అయిన పద్మావతిని వివాహమాడాడు. ఆమె కృష్ణ భక్తురాలు. ఆ కాలంలో ఆ ప్రాంతమంతా వైష్ణవ బ్రాహ్మణుల ప్రాబల్యంలో ఉండేది. జయదేవుడు చిన్నతనం నుండే సంగీత సాహిత్యములలో గొప్ప పాండిత్యమును సంపాదించెను. బీద బ్రాహ్మణుడైన జయదేవుడు ఊరి చివర ఒక గుడిసెలో నివసిస్తూ చాలా వరకూ ధ్యానములో కాలము గడిపినాడని తెలియుచున్నది.బెంగాలులోని నవద్వీపమునకు రాజైన లక్షణసేనుని ఆస్థానమున క్రీ.శ. 1116 లో జయదేవుడు ఒక పండితుడిగానున్నట్లు అచట గల ఆధారములను బట్టి తెలియుచున్నది. మహారాజు కోటద్వారము వద్ద గల రాతిపై "గోవర్థనుడు, పారణ, జయదేవుడు" అను మూడు రత్నములు మహారాజు కొలువులో నున్నట్లు చెక్కబడియున్నవి.

వివాహ కథ

జయదేవుని వివాహము పద్మావతితో జరుగుటకు ఒక ముఖ్య కారణము కలదు. ఆ గ్రామములోనే దేవశర్మ యను మరియొక బ్రహ్మణుడు ఉండెడివాడు. దేవశర్మ తన మొదటి సంతానమును శ్రీ పురుషోత్తమ స్వాములకు అర్పించునటుల మ్రొక్కుకొనెను. ఆ విధముగా దేవశర్మ భార్య విమలాంబకు ఒక ఆడ శిశువు జన్మించగా ఆ శిశువునకు 'పద్మావతి' అని నామకరణం చేసిరి. యుక్త వయస్సు వచ్చిన పిదప ఆమెను శ్రీ పురుషోత్తమ స్వామికి అర్పించి దేవశర్మ యింటికి వెడలిపోయెను. ఆ రాత్రి దేవస్థానములోని పూజారులకు శ్రీ పురుషోత్తమ స్వామి కలలో కనబడి "ఆ బాలికను జయదేవుని యొద్దకు తీసుకుని వెళ్ళి, అతనికి ఇచ్చి వివాహము చేయమని" చెప్పినాడట. మరునాడు ఉదయము వారు దేవశర్మను, ఆ బాలికను జయదేవుల సమక్షమునకు గొనిపోయి దేవశర్మ యొక్క మ్రొక్కుబడిని గూర్చి, స్వప్నమున శ్రీ స్వామి చెప్పిన విషయములన్నియు విశదీకరించిరి. కాని జయదేవుడు దేవశర్మతో " ఈ కూటికి గతిలేని బీద బ్రాహ్మణుని అల్లునిగా ఏల ఎంచుకున్నావయ్యా" అని తన దారిద్ర్యమును గూర్చి చెప్పి నిరాకరించెను. కాని దేవశర్మ పద్మావతిని అచటనే విడచి వెళ్ళిపోయెను. కొంతకాలము తరువాత పద్మావతి తన పట్ల చూపుతున్న శ్రద్ధకు, సేవలకు ముగ్ధుడై ఆమెను శాస్త్రోక్తముగా వివాహమాడెను. జయదేవుడు శ్రీ పురుషోత్తమ స్వామి అంశయేనని అందురు. తరువాత వీరిద్దరూ అన్యోన్యానురాగములతో దాంపత్య జీవితమును గడుపుచూ, కృష్ణుని మహిమలను గానము చేయుచూ జీవితమును గడిపిరి.పద్మావతీదేవి పాతివ్రత్యమును పరీక్షింప నొకమారు సాత్యకిరాజు స్వామి ఇంటలేని సమయమునందు విచ్చేసి "మీభర్త దుర్జనులచే హతమైనాడని" ఒక యళీకవార్త వినిపింప నామె ఆత్మహత్య చేసుకొనగా జయదేవస్వామి తిరిగివచ్చి కృష్ణసంకీర్తన మొనర్పగా ఆమె "సుప్తిబోధిత" వలె మేల్కొని నత్లు మరియొక జనశ్రుతి వినవచ్చుచున్నది.జయదేవుడు ఉపాస్యదేవత అయిన నారాయణమూర్తి కైంకర్యంకోసం ధనార్జన చేయటానికి బృందావనం, జయపురం మొదలయిన ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చోరులు అయిన ధనాన్ని అపహరించి కాళ్ళూ చేతులు విరుగగొట్టి పోయినారట! ఒక ప్రభువు వేటకు వచ్చి ఆయన దుర్దశను చూచి రాజధానికి తీసుకొనిపోయి చికిత్సచేయించి స్వాస్థ్యం చేకూర్చిన తరువాత పద్మావతితో ఆకవి అక్కడనే కాపురం చేస్తూ ఉన్నాడు. యతివేషాలు వేసుకొని వెనుకటి చోరులు ఆరాజధానికి వచ్చినా తెలుసుకొనికూడా వారికి జయదేవుడు శిక్షచెప్పించలేదట!

సాహిత్యం

జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, దశకృతికృతే, కృష్ణుడు మూడు ముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, త్రిభంగి అతని వల్లే ప్రాశస్త్యము నొందింది. జయదేవుని రెండు అష్టపదులు సిక్కుల మతగ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ లో కనబడతాయి. దీనిని బట్టి, జయదేవుని రచనలు గురునానక్మీద, అతడు పూరీని సందర్శించినప్పుడు, ఎంత ప్రభావం చూపాయో అర్థమౌతుంది.

గీత గోవిందం

గీత గోవిందం జయదేవుని గొప్ప కావ్యం. రాధాకృష్ణుల ప్రేమ తత్వమును గూర్చి అష్టపదులుగా రచించిన మహానుభావుడు. అది 12 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయం 24 ప్రబంధాలుగా విభజింపబడింది. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిది ద్విపదలుఉంటాయి. వీటినే అష్టపదులు అంటారు. ఈ గ్రంథము 24 అష్టపదులు, 80 కి పైగా శ్లోకములు కలిగి, 12 సర్గలతో వ్రాయబడెను. గోవిందుని గూర్చి రచింపబడిన గేయ ప్రబంధమగుటచే దీనికి "గీతగోవిందం" అని పేరిడిరి. ఈ అష్టపదులు నాయకా, నాయకీ, నటులచే పాడబడినట్లు రచింపబడెను. దీనిలో 19 వ అష్టపది "దర్శనాష్టపది" అనియు " సంజీవనీ అష్టపది" అనియు చెప్పబడినది. ఇది రాధాకృష్ణుల ప్రణయతత్వమే పరమార్థంగా భావించే, నింబార్కుడి వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి యున్నకావ్యం.నవవిధ భక్తి మార్గాలలో - 1. పిత్రాపుత్ర 2. రక్ష్య రక్షక 3. ఆధారధేయ 4. శరీరాత్మ 5. జ్ఞాతజ్ఞయ 6. భోక్తృభోగ్య 7.స్వస్వామి 8.భార్యాభర్తృ 9.శెషశేషి అను భార్యాభర్తృ భక్తిమార్గం గీతగోవిందంలో జయదేవుడు నిరుపించాడు. ఇందులో సర్గనామములు సాభిప్రాయములు-సామోద దామోదరము, క్లేశ కేశవము, ముగ్ధ మధుసూదనము ఇత్యాదులు పలు సర్గలు. రసము శృంగారము, ఏకాదశ ద్వాదశ సర్గలలోని శృంగారము, సంభోగము.నాయకుడు గోవిందుడు. నాయిక రాధ.జయదేవ కవి రాధ ఇంద్రాణి అయినట్లు జయదేవ స్వామి చరిత్రలో ఇలా ఉంది. 'తొల్లి ఒకప్పుడు స్వర్గరాజ్య రమమైన ఇంద్రాణి వైకుంఠధాముని దర్శించటానికి వెళ్ళి ఆతని నవమన్మధ మన్మధాకృతిని దర్శించి నంత మాత్రాన మోహబాణ పాతాలకు పాలై స్వామిని చూచి "ఓ దీనమూర్తి హరా! నన్ను నీ ఉత్సంగానికి ఆశ్రితురాలిగా చేయవే" అని ప్రార్ధించింది. భగవంతుడు ఆమెను చూచి "నేను సాధుసంత్రాణ శీలుడనై కృష్ణాఖ్యతో భూమిమీద అవతరిస్తాను. నీవు రాధగా జన్మించి నీ మనోధసిద్ధి పొందుదువుగాక." అని అనుగ్రహించినాడు.సర్ విలియమ్ జోన్స్ 1792 లో, తొలిసారిగా గీత గోవిందాన్నీఆంగ్లంలోకి అనువదించాడు. తరువాత ఇది ఎన్నో ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయబడింది. గీత గోవిందం సంస్కృత కావ్యాలలోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది.

గీత గోవింద సారాంశం

జయదేవుడు శ్రీ కృష్ణుని పరబ్రహ్మ స్వరూపముగా పూజించెను. ఈ గీత గోవిందమును శృంగార రసముతో, మధుర భక్తితో, నాయకా, నాయకీ భావముతో స్తుతించెను. ఇందు రాధ నాయకి-జీవాత్మ, కృష్ణుడు నాయకుడు-పరమాత్మ మరియు సఖి - ఈ సఖి జీవాత్మను ముక్తి పథములో నడిపించి పరమాత్మలో లీనము చేయుటకు తోడ్పడును. ఇదియే గీత గోవిందములోని సారాంశము.

దర్శన అష్టపది

జయదేవుడు గీత గోవిందమును మిక్కిలి ఉత్సాహముతో, దీక్షతో , భక్తితో వ్రాయుచుండెను. 10 వ సర్గలో గల 19 వ అష్టపదిలో 7 వ చరణమును రచించుచున్న సమయములో తన భావనాకల్పన అతి విచిత్రముగా నుండెనట. కృష్ణుడు రాధతో...“స్మరగళ ఖండన మమ శిరసి మండనందేహి పద పల్లవముదారం.....”"రాధా! ప్రేమ అను విషము నా తలకెక్కి యున్నది. అందువలన నీ కోమలమైన పాద పద్మములను నా శిరస్సు పై నిడుము. అపుడు ఆ విషమంతయు దిగును." అను అర్థము వచ్చునటుల వ్రాసినాడట. కాని వెంటనే "ఏమీ! రాధ తన పాదమును కృష్ణ పరమాత్మ తలపై నుంచుటయా? ఇది మహాఘోరమైన పని. ఇట్లు వ్రాయుట మహాపచారము" అని తలచి ఆ పంక్తులను కొట్టివేసి, జయదేవుడు లేచి, అభ్యంగన స్నానమునకు నూనె ఒంటికి, తలకు రాసుకొని నదికి వెళ్ళినాడట.కొంత సేపటికి ఆ స్వామి జయదేవుని రూపమున తిరిగి వచ్చి ఆ వ్రాతప్రతిని తెమ్మని పద్మావతిని ఆడిగి, ఆ కొట్టివేసిన పంక్తులనే మరల వ్రాసి వెళ్ళిపోయెనట. స్నానము చేసి వచ్చిన జయదేవ కవికి తాను కొట్టివేసిన పంక్తులు మరల వ్రాసి యుండుట చూసి, ఆశ్చర్యపడి ఎవరు వ్రాసినారని పద్మావతిని అడిగెనట. ఆమె "స్వామీ! మీరే కదా మరల వచ్చి వ్రాసి పోయితిరి. నూనె బొట్లు కూడా ఆ ప్రతిమీద నున్నవే" అని చెప్పగా సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మయే వచ్చినాడని తెలుసుకొని, పద్మావతి పుణ్యమును వేనోళ్ళ కొనియాడుచూ శ్రీ కృష్ణుడు తన భార్య పద్మావతికి దర్శనమిచ్చినందున ఆ అష్టపదికి "దర్శనాష్టపది" అని నామకరణం చేసెను. ఈ అష్టపది యొక్క ఎనిమిదవ చరణమున.
“జయతు పద్మావతీ రమణ జయదేవకవిభారతీఫణీత మితిగీతం”
అని తనపేరుకు ముందుగా ఆమె పేరు పెట్టెనట.

సంజీవని అష్టపది

జయదేవ కవి, భార్యయగు పద్మావతి తో శ్రీ లక్షనసేన మహారాజుచే గొప్పగా గౌరవింపబడుచుండెను. అది సహించలేని రాజుగారి భార్య రాణి తగిన సదవకాశము నకై వేచియుండెను. ఒకనాడు రాజు పరివారముతో కూడి జయదేవకవితో కలసి వేటకై వెళ్ళినాడట. రాణిగారు పద్మావతి కి జయదేవ కవికి వైపరీత్యము జరిగినట్లు అబద్ధపు సమాచారమును తెల్పెనట. అంత పద్మావతి దుఃఖ సముద్రమున మునిగి అసువులు బాసెనట. ఇటువంటి విషాద సంఘటన జరుగునని రాణి ఈషణ్మాత్రమైనా యోచించలేదు. రాణి భయముచే ఒణికి పోసాగెను. కొంత సమయము తరువాత రాజు, జయదేవుడు వేట నుండి తిరిగి వచ్చి, జరిగిన సంఘటన చూచి, ఏమిచేయవలెనో తెలియక దిగులుపడిరి. అపుడు జయదేవుడు "తన మరణవార్త విన్నందువల్ల చనిపోయినది కాని ఇప్పుడు తాను బ్రతికే ఉన్నాను కదా" అని చెప్పి 19 వ అష్టపది అయిన "పదసీయతి" పాడి ముఖముపై నీళ్లు చల్లగా, ఆమె నిద్ర నుండి మేల్కొనినట్లు లేచి కూర్చుండినదట. ఈ అష్టపదిలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన స్వహస్తములతో వ్రాసిన పంక్తులు కలవు. కనుక ఆమె మరల పునరుజ్జీవము పొందినది. అందువల్ల ఈ అష్టపదికి "సంజీవని అష్టపది" అని పేరు కలిగినది.జయదేవుడు స్వయముగా దేవాలయములలో అష్టపదులను పాడుతున్నప్పుడు పద్మావతి వాటికి నాట్యము చేసెడిదట. 21 వ అష్టపదిలో పద్మావతితో నున్నట్లు వ్రాయబడినది. ఉదా:“విహిత పద్మావతి సుఖసమాజేభణతి జయదేవకవి రాజరాజే”మొదటి శ్లోకములోనే "పద్మావతీ చరణ చారణ చక్రవర్తి" అని జయదేవ కవి వ్రాసినాడు

జయదేవపురం

ఒడిషా రాజైన పురుషోత్తదేవునకు జయదేవునిపై ఎడతెగని ఈర్ష్య. అందువలన జయదేవుని "గీత గోవిందము" ను పోలి ఉన్న 'అభినవ గీత గోవిందం" అను గ్రంథమును రచించెను. తన గ్రంథములోని రచనలనే పాడవలెనని ప్రజలను నిర్బంధించెను. కాని ప్రజలు గీతగోవిందము నే పాడుచుండిరి. అందుకు ఇష్టపడక తన గ్రంథము గొప్పదో లేక జయదేవుని "గీతగోవిందం" గొప్పదో పరిశీలించుటకు ఇద్దరి గ్రంథములను శ్రీ జగన్నాధస్వామి యొద్ద పెట్టి తలుపులు మూసివేసిరి. మరునాడు ప్రాతః కాలమున తలుపులు తెరచి చూచుసరికి జయదేవుని గ్రంథము శ్రీ స్వామి చేతిలోనూ, రాజుగారి గ్రంథము గర్భగుడిలో ఒకమూల నుండుటను గమనించి, రాజు ఖిన్నుడై "గీత గోవిందము" శ్రేష్టతను కొనియాడెను. ఈ అష్టపదులు రచింపబడిన స్థలము నాటి నుండి జయదేవపురముగా పిలువబడుచున్నది.

పీయూష లహరి

పీయూష లహరి జయదేవుడు రచించిన ప్రముఖ సంస్కృత గోష్ఠీ రూపకము. దీనికి కథావస్తువు గీత గోవిందంలోని కథా వస్తువైనరాధ ప్రధాన నాయికగా శ్రీకృష్ణుడు రాసలీల నడపడము కథాంశము. అందువలన పీయూష లహరిని గీత గోవిందానికి భూమికగా శ్రీకార్ మహాశయుడు అభిప్రాయపడ్డాడు.ప్రాచీన కాలంలో జగన్నాధస్వామి ఆలయంలో అనేకములైన ఏకాంకనాటికలను ప్రదర్సించేవారు. పీయూషలహరిని కూడా అటువంటి నాటకసమాజంతో కలిసి జయదేవుడు దీనిని ప్రదర్సించినట్లు పీయూషలహరి లోని "గోష్ఠి శ్రీ జయదేవ పండితమణేః సావర్తతే నర్తితుమ్" అన్న వాక్యంవల్ల వ్యక్తమౌతున్నది.జయదేవుడు గీతగోవిందంలోనూ, పీయూషలహరిలోనూ నిరూపించిన 'రాసలీల' భాగవతం పురాణాన్ని అనుసరించింది కాదు. భాగవత రాసలీల శరత్తులో జరుగుతుంది. జయదేవునికి మూలం బ్రహ్మవైవర్తము.ఈ రాసలీల మూడు దినాలు. భాగవత రాసలీల పంచదశద్రాత్రులు. జయదేవుని తరువాత జన్మించిన అనేక వైష్ణవ కవులు కూడా ఈ బ్రహ్మవైవర్త రాసమే అనువదించారు.జయదేవుని గీతగోవిందం, పీయూషలహరి అర్ధంచేసుకోవటానికి ఒరిస్సా వైష్ణవాన్ని గురించిన విజ్ఞానం కొత అవసరం. కళింగదేశంలో క్రీ.శ. 8 వ శతాబ్దములో ప్రవేశించినమహాయాన బౌద్ధం క్రమంగా వజ్రయాన, సహజయానాలుగా రూపొందింది. క్రీ.శ.729 నాటి ఒరియారాజు ఇంద్రభూతి, చెల్లెలు లక్షింకర వల్ల సహజయానం ఆదేశంలో ప్రవేశించిందని ప్రతీతి. ఇంద్రభూతి జ్ఞానసిద్ధిలో జగన్నాధుడు ని బుద్ధదేవునిగా స్తుతించాడు. సహజయానం ప్రచారం చేసినవారు కౌపదాదులు ఔఢ్రదేశీయులు.వజ్రయానము, సహజయానము వైష్ణవాలు కలిసి ఔఢ్రదేశంలో నూతన వైష్ణవానికి దారితీసి ఉంటవి. దానికి ముఖ్యమైన ప్రవక్తలు- జయదేవుడు, రామాసంద రాయలు. సహజయాన పాంధేయులు జయదేవుణ్ణి ప్రధమ ప్రవక్తగానూ, నవరసికుల్లో ఒకడినిగాను ప్రకటిస్తారు.క్రీ.శ 15, 16,17వ శతాబ్దాల్లోని ఔఢ్రరచయితలు సరళదాసు, బలరామదాసు,అచ్యుతానందులు, పీతాంబరుడు మొదలైన కవులు సహజయానాన్ని అనేక గీతాల్లో ప్రశంసించారు.రామానుజుడు, మధ్వాచార్యుడు ఇరువురూ పూరీ జగన్నాధానికి వెళ్ళి వైష్ణవమతాన్ని ప్రచరం చేసారు.తరువాతి వాడైన జయదేవుడు వారిప్రభావంవల్లనూ అనాదునుంచి వస్తూన్న ఇంద్రభూతి చెల్లెలు తెచ్చి పెట్టిన సహజయాన బౌద్ధ ప్రభావం వల్లనూ నూతన రాధాతత్వాన్ని సాధించి ప్రభోధించాడు. దానిని స్వీకరించినఅద్వైతాచార్యుడు, ఈశ్వపూరీ లకు గురువైన మహేంద్రపూరివంగదేశంలో ప్రవేశపెట్టినాడు.ఆయన శిష్యుడైన ఈశ్వపూరీ చైతన్య మహాప్రభువు శిష్యుడు.చైతన్య ప్రభువు జయదేవుని భక్తిజ్యోతిని అందుకొని వంగవైష్ణవ ప్రపంచాన్ని ఉద్యోతితం చేసాడు. అందువల్ల వంగవైష్ణవానికి ప్రధమ ప్రవక్త జయదేవుడే అని చెప్పుకోవాలి.గోష్ఠిలో 9 లేక 10 మంది ప్రాకృత పురుషులు మరియు 5 లేక 6 గురు స్త్రీలు ఉంటారు. అంకం ఒకటే. గర్భ విమర్శ సంధులు ఉండవు. ఉదాత్త వచనం ఉండదు. వృత్తి కైశికి, కామ శృంగార ప్రధానం.పీయూష లహరి పై మొదటగా భారతి పత్రికలో వావిలాల సోమయాజులు ఒక సుదీర్ఘ వ్యాసం రచించాడు. తరువాత తెలుగు అనువాదాన్ని మరియు సంస్కృత మూలంతో సహా తెలుగు విశ్వవిద్యాలయం 1990 సంవత్సరంలో ముద్రించింది.

కైవల్యం

జయదేవుడు 1153 , డిసెంబరు 28 న శ్రీముఖనామ సంవత్సర మర్గశిర బహుళ ఏకాదశి దినమున కైవల్యము పొందెను.

Saturday, 12 December 2015

TELUGU PURANA ARTICLE ABOUT KARMA - WHAT IS KARMA AND TYPES OF KARMA


'కర్మ అంటే మరేదో కాదు విద్యుక్త ధర్మకు కర్మ అది శుచియై, పవిత్రమై ఉంటుంది. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. ఈ ధర్మాలు ఆయా వర్ణాలకు విడిగా ఉంటాయి. కాబట్టి వారి విధులు, మరొక వర్ణానికి, తేడా వర్గానికి, తప్పని తోచవచ్చు. ఉదా. క్షత్రియుడు, పాలకుడిగా, ప్రజాసంరక్షణ ధ్యేయంతో శత్రువు లను చంపవచ్చు ఇది దోషం కాదు. విద్యుక్త ధర్మమే అవుతుంది. వీటినే ధర్మసూక్ష్మాలుగా భావించాలి. కర్మలు విధిని ధిక్కరించలేవు. వాటి స్వాధీనంలోనే ఉంటాయి. విధి భగవంతుని నిర్ణయం. అయితే తెలిసి, తెలిసి విషితత్త్వాలు ధిక్కరించేవారు మాత్రం దోషులే!

విహిత కర్మలంటే
ప్రాచీనులు వర్ణవ్యవస్థలో ఆయా వర్ణాలకు కొన్ని విహిత కర్మలు నిర్ణయించినారు. వారు సామాజిక సంఘటిత స్వరూపం కాపాడమనే ఈ వ్యవస్థ నేడు కులాలలో ఎబిసిడి అని ఏర్పాటు చేసి నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అనేది తదాచర కాలంలో మరింత స్వార్థబుద్ధితో కల్పించినవే. అందరికి సమాన అవకాశాలు కల్పించటం నేటి ప్రభుత్వాల విధి. ఒకవిధంగా ఇది ప్రభుత్వ విషిత కర్మనే అవు తుంది.

బ్రాహ్మణులతో యజ్ఞయాగాది క్రతువులు, విహిత కర్మలు, క్షత్రియులకు, యుద్ధాలు చేయుట, దుష్టశిక్షణ, శిష్టరక్షణ విహితకర్మలు. ఈవిధంగా మిగతా వర్ణాలకు విహిత కర్మలు న్నాయి. వీటన్నింటిని ధర్మం తప్పక అనుభవంలో పెట్టాలన్న భగవంతుడు, తాను మాత్రం అందరికి సమానుడు అని చాటాడు. భగవంతుడే సృష్టికర్త. అతన్నిసృజించి తరించటం విషయంలో అందరూ సమానమే. అందుకే మానవులందరిని సంభో దిస్తూ ఈ శ్లోకం చెప్పాడు.

శ్లోః యతః ప్రవృత్తి దూతానం మేన సర్వమిదం తతమ్‌, స్మకర్మణాః తమభ్యర్చ్యసిద్ధిం విదంతి మానవః మోక్షసద్వినియోగం

అని సమస్త సృజనాధిపతి అయిన ఆ దేవదేవుని స్వాభావిక ధర్మ, కార్యాచరణ ద్వారా పూజించి, మానవులు తరించుచున్నారు. అని అన్ని వర్ణాల, వర్గాల ప్రజలు దేవుని పూజించి, తనలో ఏకం కావచ్చునన్నాడు.

అంటే, మానవజాతిలోగాని, వర్ణవర్గాల్లో గాని, ఏవిధమైన విచక్షణ, లేదా భిన్న త్వం కానీ లేదని సూచించినట్టే కదా. కర్మలలో భిన్నత్వం సామాజిక ధర్మాల విభజనకు మాత్రమేనని, ఆయా కర్మలు వారివారి స్వాభావిక క్రియలు మాత్రమే అని తనని చేరటానికి ప్రతిబంధకం కాదు అని స్పష్టం చేసాడు
..బ్ర‌హ్మాశ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు 

Thursday, 10 December 2015

GANANADHA NAYANAR HISTORY IN TELUGU


గణనాథ నాయనారు (శివభక్తులు) చరిత్రలు

గణనాథార్‌ సర్కాలిలో నున్న పవిత్ర బ్రాహ్మణుడు. పరమ శివభక్తుడు. అందరూ ఆయన విశిష్ట జీవునమును కొనియాడేవారు. భక్తితో ఆయన దగ్గరకు సలహాల నిమిత్తము వచ్చేవారు. వచ్చిన ప్రతివానికి వారు జాపిన కొలది చేయగల దేవాలయ పనిని ఒక దానిని అప్పజెప్పేవాడు. ఒకరు దేవాలయమును పరిశుభ్రముగా వుంచేవారు. ఒకరు పూలమాలలు దేవుని గ్రుచ్చి ఇచ్చేవారు. ఒకరు తోటపని చేసేవారు. ఒకరు దేవునికి దీపములు అమర్చేవారు.

వారికి భక్తి ప్రపత్తులు నేర్పి వారిని మంచి శివభక్తులుగా చేసేవాడు. జ్ఞాన సంబంధార్‌ యెడ బహుప్రీతి. ఈ పనుల మూలాన పరమశివునికి గణనాథార్‌పై మంచి కృప గలిగింది. అంత్యమున గణనాధ నాయనారు శివసాన్నిధ్యాన్ని పొందారు.

భక్తి విషయంలో ఇంకో సులభమైన ప్రక్రియ వుంది.

దేవునిగూర్చి, దైవలీలలను గురించి, భక్తిని గూర్చి ఇతరులతో సంభాషించడం. ఈ పని మూలాన నీ ఆధ్యాత్మిక వికాసము వెల్లివిరుస్తుంది. ఎవరు అనవసర ప్రసంగము చేయరు. నీవు చేయనీయవు. నీ ప్రవర్తన కొందరికి ముందర రుచింపకపోవచ్చు. కాని త్వరలో వారంతట వారే నిన్ను అవగాహన చేసికొని నీకాలము వృథా చేయరు. అప్పుడు చాలా మందిని, దైవము, ధర్మముల యెడ ఆకర్షితులుగా చేసి వారి మనస్సును దైవము మీద కేంద్రీకృతము చేయవచ్చును.

REBIRTH STORY OF MANMADHA ACCORDING TO SRI SIVA PURANAM IN TELUGU



మన్మధుని పునర్జీవితుని చేయుట-

శ్రీ శివ మహాపురాణము

మన్మధుని పునర్జీవితుని చేయుట
సరిగ్గా అదే సమయమని భావించిన దేవతలందరూ, శివుని పరిపరి విధముల కైవారము చేసి, రతీదేవిని అక్కడ ప్రవేశపెట్టారు. అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమైన రతీ మన్మధులు ప్రణయోద్దీపకులు కూడా గనుక, పరిణయానంతర ప్రణయానికీ - ప్రేమసామ్రాజ్య మథనానికీ మదనుని అవసరం అతి ముఖ్యమైనది కనుక - వారందరూ అదే సరైన అదనుగా భావించారు.
రతీదేవి, తన కొంగున కట్టిన మన్మధుని బూడిదను, శివదేవుని చరణసన్నిధిన ఉంచి "సదాశివా! ఇదేనా నీ కరుణ? పార్వతిని పెండ్లాడ్డానికి - దేవతా ప్రేరితుడై కదా...నా పతి నీకు పరోక్షంగా సహకరించాడు. అది తమ కోపావేశాలకు కారణభూతమై...ఇదిగో! నా పతిదేవుని ఇలా పిడికెడు బుగ్గిగా మిగిల్చింది! అమ్మా! పార్వతీ! కొత్త పెళ్లికూతురివి! భర్త లేనిదే భార్యకు ఎన్ని సంపదలున్నా వృధా అని తెలిసి - తపమాచరించి మరి భర్తను పొందిన దానివి! నా బాధ అర్ధం చేసుకోగలవు కద తల్లీ!" అంటూ ఇరువురినీ వినయ - భక్తి తత్పరతలతో వేడుకున్నది.
పతిదేవుని పట్ల రతీదేవికి ఉన్న అనురగానికి, ఆ నూతన దంపతులు ( సనాతన దంపతులైన ఆది దేవుడూ - అంబ ) అచ్చెరు వొందారు. ఆమె జీవితంపట్ల జాలిపడి అయినా సరే, మన్మధుని బ్రతికించాల్సిందిగా బ్రహ్మది దేవతలు సైతం అభ్యర్ధించారు.
కరుణాంతరంగుడైన కాలకంఠుడు, మదన కుమారుడి భస్మాన్ని తన అమృతమయ వీక్షణాలతో ఒక్కసారి అవలోకించాడు. అంతే! సమస్త చిహ్న, లాంచన, రూప, యవ్వన సంపత్సహితంగా పునరావిర్భావం చెందాడు మన్మధుడు. రతీదేవి పతి సమేతంగా శివదంపతులకు నమస్కరించింది. పెళ్ళికళకే కొత్త కళలు వచ్చి చేరినట్లయింది కందర్పాగమనం.
కైలాసవాసిగా గౌరీశుడు
తన ఎడమచేతి చిటికెను వ్రేలు పట్టుకొని నునులేతసిగ్గుతో, కొత్త పెళ్లుకూతురైన కొండరాచూలిని వెంట బెట్టుకొని తన నిజనివాసమైన కైలాసపురిని చేరుకున్నాడు కృత్తివాసుడు.
అనంతరం అంగజు కేళికి సమాయత్తమైనారా నూతన వధూవరులు.
"పుణ్యాతిపుణ్య విభవన్మునిశ్రేష్ఠులారా! సమస్త పాపహరణమూ అయిన పార్వతీఖండమందు ఈ కల్యాణ ఘట్టము మీకు గల ఆసక్తి చేత వినిపించితిని. మనమందరమూ ఈ కల్యాణ మననం ద్వారా ధన్యులమైతిమి" అని ఆనాటికి పురాణ శ్రవణం ముగించాడు రోమహర్షణుడు.
పార్వతీ ఖండము సంపూర్ణము.

Wednesday, 9 December 2015

IMPORTANCE OF NUMBER FIVE ACCORDING TO HINDU PURANALU


ఆధ్యాత్మిక వనంలో ‘ఐదు’ ప్రాముక్యత!!

మన పురాణాలలో ‘ఐదు’ కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పంచాక్షరీ మంత్రంతో మొదలై పంచభూతాలు, పంచనదులు, పంచయజ్ఞాలు అంటూ ఐదు సంఖ్యతో కూడిన సంగతులు అనేకం! వాటిలో కొన్ని వివరాలు:

పంచామూర్తులు: శ్రీగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీపరమశివుడు, శ్రీపార్వతీదేవి, శ్రీచండీకేశ్వరుడు మొదలైన ఐదుగురు మూర్తులను శైవక్షేత్రాలలో పంచామూర్తులుగా పూజిస్తుంటారు.

పంచాయతనం: ఒకే పీఠం పై ఐదుగురు దేవతలను ఆవాహన చేసుకుని పూజించడం.

పంచమాతలు: తన తల్లి, గురువు భార్య, రాజు భార్య, తన భార్య తల్లి (అత్త)లను మాతలుగా భావించి పూజిస్తారు. అందుకే వీరిని పంచమాతలు అనంటారు.

పంచపితృమూర్తులు: జన్మనిచ్చిన తండ్రి, విద్య బోధించిన వ్యక్తి, మంత్రోపదేశం చేసిన వ్యక్తి, అన్నంపెట్టిన వ్యక్తి, భయాన్ని పోగొట్టిన వ్యక్తులను పంచపితృమూర్తులుగా భావిస్తారు.

పంచప్రతిష్ట: పాంచరాత్రాగమాన్ని అనుసరించి ఐదు రకాలైన ప్రతిష్ఠలు జరుగుతుంటాయి.

స్థాపన: నిల్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
ఆస్థాపన: కూర్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
మైస్థాపన: పడుకున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
పరస్థాపన: వాహనాలపై పలు భంగిమలలో చేసే ప్రతిష్ఠ
ప్రతిష్ఠాపన: షణ్మార్చనతో చేసే ప్రతిష్ఠ

శివపంచాయతనం: మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించి చుట్టూవున్న ప్రదక్షిణంలో సూర్యుడు, వినాయకుడు, అంబిక విష్ణువులను ప్రతిష్టించి పూజించడమే శివ పంచాయతనం.

పంచయజ్ఞాలు: జల్లెడ, రుబ్బురోలు, చీపురు, రోలు, కుండ ఈ ఐదింటిని వాడటంవల్ల పాపం వస్తుంది. వీటి నివారణకు చేసే యజ్ఞాలను పంచమహాయజ్ఞాలనంటారు.

దేవయజ్ఞం: అగ్నితో హోమం చేయడం.
పితృయజ్ఞం: పితృకార్యాలను చేయడం.
భూతయజ్ఞం: జంతువులకు ఆహారాన్ని అందివ్వడం
మానుషయజ్ఞం: విందును ఇవ్వడం
బ్రహ్మయజ్ఞం: రోజూ వేదపఠనం చేయడం

పంచాహోమాలు:

గణపతి హోమం: అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరేందుకై చేసే హోమం.
చండీహోమం: దరిద్రం, భయాలు తొలగేందుకు చేసే హోమం.
నవగ్రహ హోమం: గ్రహదోషం తొలగేందుకు నవగ్రహ హోమం.
సుదర్శన హోమం: సమస్త దోషాలు తొలగేందుకు చేసే హోమం.
రుద్రహోమం: అయుర్ వృద్ధి, ఆరోగ్యం కోసం చేసే హోమం.

పంచయాగాలు:

కర్మయాగం:భగవంతునికి పూజ చేయడం.
తపయాగం:వ్రతం చేయడం.
జపయాగం:మంత్రాలను జపించడం.
ధ్యానయాగం:భగవన్నామాన్ని ధ్యానించడం.
మంత్రయాగం:వేదగ్రంథాలను పఠించడం.

పంచాతాండవం: ఆనందతాండవం, సంధ్యాతాండవం, త్రిపురతాండవం, ఊర్థ్వతాండవం, ముని తాండవం

పంచనాథ స్థలాలు:

కాశీ – శ్రీవిశ్వనాథుడు
గుజరాత్ – శ్రీసోమనాథుడు
పూరి – శ్రీజగన్నాథుడు
రామేశ్వరం – శ్రీ రామనాథుడు
వైదీశ్వరం – శ్రీవైథీశ్వరుడు

పంచభగవతి స్థలాలు:

కొల్లూరు – మూకాంబిక
వడగరా – లోకాంబిక
పాల్ ఘాట్ – హోమాంబిక
కొడూంగబారు – మహాభగవతి
కన్యాకుమారి – బాలాంబిక

పంచదేవి: దుర్గ, రాధ, లక్ష్మీ, సరస్వతి, సావిత్రిలను పంచదేవిలు అనంటారు.

పంచనదం: దూతపాప, కిరాణానది, ధర్మనది, గంగ, యమునా నదులను కలిపి పంచనదాలంటారు. ప్రస్తుత పంజాబ్ కూడ ఒకప్పుడు పంచనదం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఐదు నదులు ప్రవహిస్తుంటాయి.

పంచపర్వాలు: ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానాలు.

పంచబ్రహ్మాసనం: భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దృశ్యమానప్రపంచం వీటి వల్లే ఏర్పడుతోంది.

పంచలింగాలు:

పృథివీలింగం – కంచి
ఆపల్లింగం – జంబుకేశ్వరం
తేజోలింగం – అరుణాచలం
వాయులింగం – శ్రీకాళహస్తి
ఆకాశలింగం – చిదంబరం

పంచవటం: గోదావరి తీరంలో ఉంది. ఇక్కడ ఐదు వటవృక్షాలు (మర్రిచెట్లు) ఉండటంతో పంచవటి అని అన్నారు. ఈ ఐదు మర్రివృక్షాలు గత జన్మలో గంధర్వులు. అగస్త్యుడిని ఎటూ కదలకుండా చేయాలని ప్రయత్నించి, అతని శాపానికి గురై వృక్షాలుగా మారుతారు. శ్రీరామదర్శనంవల్ల శాప విమోచనమవుతుందని చేయుతాడు. ఇక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు.

పంచాక్షరీ: నమశ్శివాయ అనే ఐదాక్షరాల మంత్రం.

పంచాయతనం: కాశీలోని శివుని విగ్రహం. శివుని ఐదు ఆత్మలు ఐదు ఆయతనాలు – అవి: శాంతి, అతీత శాంతి, పరాపర విద్య, ప్ర్రతిష్ట, నివృత్తి.

పంచపాండవులు: పాండురాజు కుమారులు.

పంచత్రంత్రం: చిన్న పిల్లలకు జీవితమ పట్ల అవగాహన కలిగేందుకు విష్ణుశర్మ రాసిన కథల పుస్తకం.

పంచద్వారక: బద్రీనాథ్, పూరీ, అయోధ్య, ద్వారక, పండరీపురం.

Monday, 16 November 2015

SRI KEDARESWARA VRATHA KATHA IN TELUGU


శ్రీ కేదారేశ్వర వ్రత కథ.
పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి 
శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతముని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు
శౌనకాదులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ-సాధ్య- కింపురుష-యక్ష-గంధర్వులు శివుని
సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు-మునులు-అగ్ని-
-వాయువు-వరుణుడు-సూర్యచంద్రులు-తారలు-గ్రహాలు-ప్రమదగణాలు-కుమారస్వామి-వినాయకుడు-వీరభద్రుడు-నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద
తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల-సాల-తమలా-వకుళ-నరికేళ-చందన-పనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ-పారిజాతాది పుష్పాదులతోను
మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి.. అట్టి ఆనందకోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త
శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి
అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలగాగల వంది
మాగాదులు శివునకు ప్రదక్షిణంచేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో
మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ! పరమార్ధ విదులగు
యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి
యాదండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది.
కైలాసమునువదలి శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి
గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిధి మర్యాదలొనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని
పార్వతిని ప్రశ్నించారు.
వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా
పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ
సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది
శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ
వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవావ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు.
వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులు
ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున
ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు
పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. మరియు ధాన్యరాశినిపోసి అందు పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి
పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి.
దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య-భోజ్య, నైవేద్యాదులు
కదళీప్జలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలదక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని
కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.
గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం
తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.

కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని
వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ
వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.
ఆతదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము
చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగలపాటివాడను కాను. మీరా ఆలోచనను
మానుకోండనిపలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞనియ్యవలసినదని కోరుకున్నారు.
వారిరువురు ఒక వటవృక్షంక్రింద కూర్చుని తోరముకట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా
వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు.
ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని
చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనదాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి
చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త
ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది.
ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్జించి తీసుకొని
రావలసిందని చెప్పిపంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా
మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు
వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడాసొమ్మును
తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి
కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను
తెలియచెప్పాడు.
అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి
పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త
మందీమార్భలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో
సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది.
ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము
పొందుదురు.