WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label General Health Articles. Show all posts
Showing posts with label General Health Articles. Show all posts

Monday, 16 May 2016

MICRO PROTEINS AND VITAMINS REQUIRED FOR HUMANS FOR HEALTHY GROWTH


సూక్ష్మపోషకాలు అంతే ముఖ్యం 

పోషకాలు అనగానే చాలా మంది ప్రొటీన్‌, కాల్షియం, ఐరన్‌ ఇవే సమస్తం అనుకుంటారు. కానీ, శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, జీవక్రియలు సజావుగా సాగడానికి మరెన్నో సూక్ష్మ పోషకాలు కూడా అవసరమవుతాయి. వాటిలో క్లోరైడ్‌, మాంగనీస్‌, పాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, సల్ఫర్‌ ఎంతో కీలకమైనవి. వీటితో పాటు క్రోమియం, కాపర్‌, ఫ్లోరైడ్‌, అయోడిన్‌, మాంగనీస్‌, మాడిబ్‌డెనిమ్‌, సెలీనియం, జింక్‌ అత్యంత ఆవశ్యమైనవి. ఎవరైనా ప్రొటీన్‌, కాల్షియం, ఐరన్‌లు బావుంటే అన్నీ బావున్నట్టే అనుకుంటే ఏ క్షణాన్నయినా తీవ్రంగా వ్యాఽధిగ్రస్తం కావచ్చు. ఉన్నట్లుండి మంచానపడొచ్చు. శరీరంలో సోడియం నిలువలు బాగా పడిపోతే కొందరు మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడతారు. అసలు విషయం తెలియక వాళ్లను మనం పిచ్చాసుపత్రికి తీసుకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే మన శరీరంలో సమస్త పోషకాలు సరియైున పాళ్లల్లో ఉన్నాయో లేవో ఎలకా్ట్రల్‌ పరీక్షల ద్వారా తరుచూ తెలుసుకుంటూ ఉండాలి. విటమిన్లు, లవణాల్లో ఎక్కడ కాస్త లోపం క నిపించినా వాటిని వెంటనే పూరించుకునే ప్రయత్నం విధిగా చేయాలి.


Wednesday, 3 February 2016

TIPS TO REMAIN FIT PHYSICALLY AND MENTALLY - EXPERTS ANALYSIS AND FOOD HEALTH TIPS TO REMAIN FIT ROUND THE CLOCK


శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండాలంటే 

మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు. కాని ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చును . థైరాయిడ్‌ వచ్చినపుడు నిపుణులతోస్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు గొంతు రావచ్చు.

శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉన్నప్పుడే చకచకా పనులు చేసుకోగలం. అదే థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే అది సాధ్యం కాదు. నిలువునా నిస్సత్తువ ఆవరించి.. పనిమీద దృష్టి నిలపలేం. థైరాయిడ్‌లో రెండు రకాల సమస్యలుంటాయి. అవి హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజమ్‌. వారి వారి సమస్యను బట్టి ప్రత్యేక పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య హైపర్‌థైరాయిడిజమ్‌. థైరాయిడ్‌ గ్రంథి మోతాదుకు మించి విడుదల చేసే థైరాక్సిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమం లేని నెలసరి. ప్రతి రెండు వేల మంది గర్భిణుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భదారణ సమయంలో తగిన రక్తపరీక్షల సాయంతో సమస్యని కనిపెట్టవచ్చు.

పోషకాహారంతో ఈ సమస్యకి చెక్‌పెట్టవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అయితే ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమస్య ఉన్నవారు త్వరగా బరువు కోల్పోతారు. కాబట్టి తగినన్ని మాంసకృత్తులు, విటమిన్లు తీసుకొంటూ సంపూర్ణ పోషకాహారంపై దృష్టి సారించాలి. బి విటమిన్లని పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగిజావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఇందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్‌, ఖర్జూరం, అంజీర పండ్లని తినాలి.

ఎప్పటికప్పుడు నిస్సత్తువగా అయిపోయే శరీరానికి బలాన్నివ్వాలంటే ఒకేసారి కాకుండా రోజులో ఎక్కువ సార్లు ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి. పంచదార కలపని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. సముద్ర చేపల్లో ఉండే మాంసకృత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకొంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. ఇక ఆహార పదార్థాలు వండటానికి ఉపయోగించే వంట నూనెల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆలివ్‌, రైస్‌బ్రాన్‌, పల్లీ, నువ్వల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్నీ సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ట్రాన్స్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటికీ, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకీ దూరం పాటించాలి. టీ, కాఫీ, శీతల పానీయాలని పూర్తిగా మానేయాలి. ఇవి జీవక్రియలని ప్రభావితం చేస్తాయి.

విపరీతమైన ఆందోళన, చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, కీళ్లు.. కండరాలు పట్టేసినట్టు ఉండటం, బరువు పెరిగిపోవడం, నెలసరి సమయంలో అధిక రోజులు రక్తస్రావం.. ఇవన్నీ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు. థైరాక్సిన్‌ హార్మోన్‌ తక్కువ విడుదలవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గర్భం ధరించాలనుకొనే మహిళలు ముందుగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పాలు, చీజ్‌, మాంసం, చేపలు ఆప్రికాట్లు, ప్రూన్స్‌, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వల్ల ఐయోడిన్‌ పుష్కలంగా అందుతుంది. అలాగే అయొడిన్‌ తగు మోతాదులో ఉండే ఉప్పుని రోజూ అందేట్లు చూసుకోవాలి. శుద్ధిచేసిన ఆహార పదార్థాలకి బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్లు, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమయి అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతో పాటు కొవ్వునీ తగ్గిస్తాయి. ఇక శక్తిని పుంజుకోవడానికి నిత్యం పండ్లు, తాజా కాయగూరలు అధికంగా తీసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, చేపలు, మాంసం ఇవి మేలు రకం మాంసకృత్తులని అందిస్తాయి.

క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బ్రకోలీ, పాలకూర, పియర్స్‌, స్ట్రాబెర్రీలు.. వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ స్థాయులని మరింత ప్రభావితం చేస్తాయి. అలాగే పచ్చి వేరుసెనగలకీ దూరంగా ఉండాలి. ఉడకబెట్టినా, వండినా వాటి కొంత ప్రభావం తగ్గుతుంది. సోయాపదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకీ దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయొడిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొనే కంటే ఆరుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలని తినాలి. నీళ్లు అధికంగా తాగాలి. హైపోధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుంచీ అందుతుంది. ఇటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకొన్నట్టయితే సమస్యని పక్కకు నెట్టి హాయిగా ఉండొచ్చు.

Monday, 7 December 2015

INFECTION HEALTH TIPS IN TELUGU


శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందంటారు నిజమేనా?
.
పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం.
.
అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట చీముగా కనిపిస్తాయి.
.
నశించిన ఈ తెల్ల రక్తకణాల సైన్యం స్థానంలో కొత్త తెల్ల రక్తకణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కావాలి. ఈ రెండూ అమితంగా ఉన్న ఆహార పదార్థం పప్పు. బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు సరికదా పుండు తొందరగా మాని పోతుంది. పప్పు తినకుండా ఉంటేనే గాయానికి ప్రమాదం.

Friday, 12 December 2014

IMPORTANCE OF TULASI THIRDHAM GIVEN IN TEMPLES


తులసీ తీర్థం ప్రభావితమైనదా?

దేవాలయానికి వెళ్ళినపుడు అక్కడ మనం తీర్థాన్ని తీసుకుంటాం. తీర్థానికి తనకంటూ కొన్ని వైభవ గుణాలున్నాయి.

హిందూ కుటుంబాలలో తులసి మొక్కను నాటి, పెంచి పోషిస్తారు. పవిత్ర జలాన్ని తులసి ఆకులతో జోడించడం ద్వారా ఆ జాలం ఎంతో ప్రభావితమవుతుంది. ఆ జం ఔషద గుణాలను పోపొందుతుంది.


విదేశాలలో ఓ విధమైన శుద్ధ జలాన్ని ‘క్లిస్ట్రర్డ్ వాటర్’ అని పిలుస్తారు. క్లిస్టర్డ్ వాటర్లో ప్రమాదకరమైనటు వంటి వ్యాపించి ఉన్న కాలుష్యం లేదని అమెరికాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జాలం ఎంతో శుద్దిచేయబడిన నట్టిదై మినరల్స్ కలిగి వాడిన వారిని ఆరోగ్యవంతంగా మరియు జాగృతంగా ఉంచుతుంది. ఒక గ్లాసెడు మామూలు నీటిలో రెండు చుక్కల క్లస్టర్డ్ వాటర్ కలిపినట్లయితే ఆ నీరంతా ఆరోగ్యప్రదమైన పానీయంగా మారుతుంది. తులసిని కలిపినా నీరు కూడా క్లస్టర్డ్ వాటర్ కలిపిన జలంలాంటి గుణం ఉందని కనుగొనడం జరిగింది.

తులసీ జలాన్ని త్రాగడానికి గుడికి వెళ్ళవలసిన అవసరంలేదు. దాని ఇంటివద్దనే తయారు చేసుకోవచ్చు. మన ఋషులకు తులసీ జాలం యొక్క గొప్పతనం తెలుసుకాబట్టే దాన్ని వాడమని మనకు తెలిపారు
.

Sunday, 27 July 2014

VITAMIN-D PUTS CHECK TO BREAST CANCER - ANALYSIS


ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదులక్షల మందికి పైగా మహిళలు రొమ్ముక్యాన్సర్‌ కారణంగా మరణిస్తున్నారు. గ్లోబకాన్‌ డాటా (క్యాన్సర్‌కు సంబంధించి అంతర్జాతీయ పరిశోధన ఏజెన్సీ) ప్రకారం రొమ్ము క్యాన్సర్‌ కారణంగానే 1.85 మిలియన్‌ సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితం నష్టపోతూ భారతదేశం ఈ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఉన్న 1,45,000 సరికొత్త రొమ్ముక్యాన్సర్‌ కేసులు మరో దశాబ్ధంన్నర నాటికి 2,14,000కు చేరుకునే అవకాశం ఉందని క్యాన్సర్‌ వైద్యుల అంచనా. ఇటీవల కాలంలో వెలువడిన పరిశోధనల ఫలితాల ప్రకారం విటమిన్‌ డి లోపం రొమ్ము క్యాన్సర్‌ వృద్ధికి ప్రధాన కారణంగా తేలింది. బ్రెస్ట్‌ టిషఉ్యలో విటమిన్‌ డి గ్రాహకాలు ఉంటాయి. విటమిన్‌ డి ని ఈ గ్రాహకాలు బంధిస్తాయి. దీనివల్ల క్యాన్సర్‌ జీన్స్‌ మరణించేలా చేయటం లేదా వృద్ధి చెందటం ఆపటం చేస్తాయి. దానితో పాటు క్యాన్సర్‌ సెల్స్‌ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా కూడా అడ్డుకుంటాయి. విటమిన్‌ డి రొమ్ము క్యాన్సర్‌ను అడ్డుకోవటంలో సహాయపడుతుందని యుఎస్‌ఎకు చెందిన విటమిన్‌ డి, ఆరోగ్యం, సూర్యకాంతి శరీరానికి తగలటం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ''విటమిన్‌ డి కౌన్సిల్‌'' తన అధ్యయనం ద్వారా తెలిపింది. దాని ప్రకారం ఇప్పటికే రొమ్ముక్యాన్సర్‌ కలిగిన మహిళలు లేదంటే గతంలో రొమ్ము క్యాన్సర్‌ కనుగొనబడిన మహిళలకు విటమిన్‌ డి ఎంతగానో సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్‌ రోగుల్లో విటమిన్‌ డి ప్రమాణాలతో కూడిన నివేదికలు పరిశీలించిన తరువాత ఈ శక్తివంతమైన ప్రో హార్మోన్‌ ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. చాలా పరిశోధనలను సమీక్షించిన తరువాత రొమ్ముక్యాన్సర్‌తో బాధపడే మహిళలు ఎవరికైతే తక్కువ పరిమాణంలో విటమిన్‌ డి నిలువలు ఉంటాయో వారికి క్యాన్సర్‌ మరలా వచ్చే అవకాశాలు రెట్టింపుగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు. విటమిన్‌ డి అధికరగా ఉన్న వారితో పోలిస్తే మరణాల సంఖ్య కూడా విటమిన్‌ డి తక్కువగా ఉన్నవారిలో కనిపిస్తుందని విటమిన్‌ డి కౌన్సిల్‌ వెల్లడించింది.


HEALTHY FOOD STUFF TIPS IN TELUGU



ఆహారం మనిషి ప్రాథమిక అవసరాల్లో తొలి స్థానంలో ఉంటుంది. అభివృద్ధిచెందిన ఆహారం మనిషి ఆలోచనలను, సామాజిక ప్రవర్తనను తీర్చిదిద్దింది.

ఖీ    ఆరోగ్యానికి, ఆలోచనలకు, పురోగమనానికి మనిషి స్వీకరించే ఆహారం తోడ్పడుతుంది. శ్రమను తట్టుకునే శక్తిని సమకూరుస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సమర్థవంతంగా పనిచేసే లక్షణాన్ని చేకూర్చిపెడుతుంది.

ఖీ ఆహారంతోటే బుద్ధివికాసం, కళానైపుణ్యం, శాస్త్రాభివృద్ధి సాధ్య మవుతున్నాయి. మనిషిని రాక్షస ప్రవృత్తినుండి మానవతా ధోరణిలోకి ఆహారం తీసుకురాగల్గింది.

ఖీ    భుజించిన ఆహారం మనిషి శరీరంలో మూడు భాగాలుగా విడిపోతుంది. కొంత విసర్జితం కాగా మరికొంత కండపుష్టిని కల్గిస్తుంది. మిగిలినది మేథను వృద్ధిచేసి ప్రజ్ఞాశీలిగా మారుస్తుంది.

ఖీ    అప్పుడేపుట్టిన శిశువునుండి, జీవితాను భవాల చరమాంకంలోవున్న వ్యక్తివరకు శారీరక స్థితిని అనుసరించి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. 

ఖీ మనిషి ఎదుగుదలకు కీలకమైన బాల్యవ్యవస్థలో సరియైన పోషకాహారం పటిష్టమైన పునాదులను ఏర్పరుస్తుంది. 

ఖీ పసివారి ప్రయోజన కరమైన ఎదుగుదలకు, పరిరక్షణకు, సంరక్షణకు విధిగా పోషకాహారాన్ని సమకూర్చాలి.

ఖీ ఆహారం కేవలం పసివారి మనుగడ కోసమే కాదు అభివృద్ధి కోసం కూడా అని మరువకూడదు.

ఏమి తినాలి? : శరీరానికి మొత్తం 50 పోషకాలు అవసరం అవుతాయి. పిండిపదార్థాలు, పీచు పదార్థాలు, నీరు, కొవ్వుపదార్థాలతోపాటు 10 అమైనో ఆమ్లాలు (ఇవి ప్రోటీన్ల తయారీకి కావాలి) 16 ఖనిజ లవణాలు, 13 విటమిన్లు శరీరానికి అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా వెల్లుల్లి, బ్రన్సెల్‌ స్ప్రౌట్స్‌, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌...వంటి కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తాయి. పైగా క్యాన్సర్‌, గుండెజబ్బుల నివారణ కు దోహద పడతాయి.

ఖీ నారింజరంగులో ఉన్న పళ్లు, కూర గాయలు, క్యారట్‌, చిలగడదుంప, టమాటోల్లో బీటా-కెరోటిన్‌ (ఎ-విటమిన్‌) బాగా లభిస్తుంది.

ఖీ శరీరానికి ఎనిమిదిగంటలు ఏ ఆహారం అందించక పోతే దానికి కావలసిన పోషక పదార్థాలు వెంటనే అందించాల్సి ఉంటుంది. 

ఖీ ఉదయంపూట తప్పనిసరిగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఫిష్‌, కర్రీపఫ్‌ లాంటివయితే వారానికి ఒకసారితింటే చాలు. 

ఖీ క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్టు తీసుకున్నవారే దానిని తినని వారికంటే నాజూగ్గా ఉంటారు.ఖీ డైటింగ్‌చేయడంవల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పూర్తిగా నిద్రలేవని సమయంలో అర్థరాత్రి సమయాల్లో భోజనం చేయడం శరీరానికి అంతమంచిది కాదు. 

ఖీ వేయించిన పదార్థాలకన్నా ఉడికించిన పదార్థా లు తినడం మంచిది. ఖీ సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సప్లిమెంటుపదార్థాలు తినా ల్సిన అవసరంఉండదు. 

ఖీ ఎక్కువగా ధూమపానం చేసేవారు, గర్భిణీలు, వృద్ధులు ఆకలికోల్పోయిన వారు సప్లిమెంట్లను వాడాల్సి ఉంటుంది. ఖీ గుండె జబ్బులున్నవారు వారానికి రెండుసార్లు మాక్రెల్‌, సాల్మన్‌ చేపల్ని తినడం మంచిది.

ఖీ ఆయిలీఫిష్‌లో విటమిన్‌-డి సమృద్ధిగా ఉంటుంది. వెజిటబుల్‌ ఆయిల్స్‌లో విటమిన్‌-ఇ ఎక్కువగా ఉంటుంది.

ఖీ    ఈ రెండూ కూడా గుండెజబ్బుల్ని నివారి స్తాయి. ఖీ మన శరీరం రోజుకి ఒకటిన్నర లీటర్ల నీటిని కోల్పోతుంది. కావున అనుదినం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం అవసరం.
గుర్తుంచుకోండి! : కౌమార దశలోవున్న బాలికలు రాగుల్ని రొట్టె, సంకటి, మాల్ట్‌ ఎక్కువగా తీసు కోవడంవల్ల ఐరన్‌లోపాన్ని అరికట్టవచ్చు.

ఖీ 6-9 నెలలవయసుగల పిల్లల ఆహారవిషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో వారికి పెట్టే ఆహారం వారి మానసిక, శారీరక పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది.

ఖీ పిల్లలకు ఒకేసారి ఎక్కువ ఆహారం ఇవ్వకూడదు. మొత్తం ఆహారాన్ని రోజు మొత్తంమీద అయిదారుసార్లు విభజించి పెట్టాలి.

ఖీ    బాల్యస్థితిలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుని ఉండకపోతే కౌమారదశలో తీసుకోవాలి. ఖీ అను దినం అన్నం, పప్పు లేదా రొట్టె, పప్పు, ఆకుకూర లు, కాయగూరలు విధిగా తీసుకోవాలి.

ఖీ    భోజనం తరువాత సి-విటమిన్‌ కలిగిన ఏదో ఒక పండును కనీసం జామపండునైనా తినాలి. దీనివలన రక్తహీనత సమస్య తలెత్తదు.

ఖీ    భోజనానంతరం కనీసం రెండుగంటల వరకు కాఫీ, టీలు సేవించకూడదు. 

ఖీ 45 ఏళ్లు దాటిన వారు మితంగా ఆహారం తీసుకోవడం అలవరచు కోవాలి. 

ఖీ     వృద్ధాప్యంలో ఆకలి మందగిస్తుంది కాబట్టి పండ్లు ఎక్కువగాతినడం ఉత్తమం.ఖీ రెడీ మేడ్‌ పోషక ఆహార పదార్థాలపట్ల అప్రమత్తంగా ఉండాలి. 

ఖీ ఖనిజ లవణాలతోను, మాంసకృత్తుల తోను, రకరకాల విటమిన్లతోను, ఇతర పోషకాలతో కూడుకున్న సమతుల ఆహారం మానసిక, శారీరక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఖీ ఈ ఆహారం వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. పౌష్టికా హారం తీసుకుంటే మందులఖర్చు చాలావరకు ఆదా అవుతుంది.

Wednesday, 18 December 2013

WHY SUDDENTLY MOOD CHANGES ? TIPS FOR FRESH MOOD IN DAILY LIFE



చాలామందికి హఠాత్తుగా మూడ్‌ మారిపోతుంటుంది. అసహనంగానూ, అంశాంతిగానూ, ఆందోళనగానూ ప్రవర్తిస్తారు. గతాన్ని తలచుకుని బాధపడడం, సమస్యలు ఎదుర్కొనే టప్పుడు సహనం, వివేకం కోల్పోవడం, సమస్యలకు తల్లడిల్లిపోతూ పరిష్కార దిశగా కాకుండా వ్యతిరేకంగా ఆలోచించడం, సన్నిహితుల ఎడబాటు, ఆప్తుల మరణం, ఆర్థిక పరమైన ఇబ్బందులు వారి మూడ్‌ను మార్చేస్తాయి. ఇతరుల మీద ఆగ్రహించడం, సరిగ్గా మాట్లాడక పోవడం లక్షణాలు ఏర్పడతాయి.అటువంటి వారికి తోటివారు దూరంగా వుంటారు. మూడ్‌ బాగాలేనట్లుంది అనుకుంటారు.

1.మూడ్‌ మారాలంటే... ఒక చాక్లెట్‌ను నోట్లో వేసుకుని చప్పరిస్తుండాలి.
2. చిక్కుడు, సోయాబీన్స్‌, అక్రూట్స్‌, బాదంపప్పు, ఓట్స్‌ లాంటివి ఆహార పదార్థాల్లో చేర్చాలి.
3.మితాహారం తీసుకోవడం మంచిది.
4. ప్రతి రోజు ఒక నిర్ణీత సమయంలోనే ఆహారాన్ని తీసుకోవాలి.
5.వ్యాయామం చేస్తే నూతన ఉత్సాహం కలిగి మంచి మూడ్‌లోకి వస్తారు.
6.విటమిన్‌-డి కి కూడా మూడ్‌ను మార్చేశక్తి ఉంది. అందువల్ల, సుప్ర భాత సమయంలో కానీ, సూర్యాస్తమయ సమయంలో కానీ, నీరెండలో గానీ నడవడం మంచిది. అప్పుడు, వారిలో చలాకీతనం హుషారు ఏర్పడుతుంది.
7.నెగిటివ్‌ థింకింగ్‌ను వదిలేసి పాజిటివ్‌గా ఆలోచించాలి.
8. మనస్సులో ఏర్పడే భావాలను అంటే దిగులు, బాధ, సమస్యలు లాంటివి అతి సన్నిహితులకు చెప్పుకుంటే మనస్సు తేలికయి మూడ్‌ మారుతుంది.
9.నిద్రలేమి కలిగితే శరీరంలో చురుకుతనం తగ్గుతుంది. చిరాకుగానూ నిరుత్సాహంగానూ, అశాంతిగానూ ఉంటుంది.
మూడ్‌ బాగా లేనప్పుడు కొంత సమయం నిద్రపోతే, ఆ తర్వాత సరైన మూడ్‌లోకి వస్తారు.
10. చేయవలసిన పనులు అధికమై, సమయం తక్కువగా
ఉంటే మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువవడం వల్ల చిరాకు, విసుగు కలుగుతాయి. అది ఏర్పడకుండా ఉండాలంటే ఇంటి పనులు విభజించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం పనులను చేసుకోవాలి. మానసిక ఒత్తిడి కలుగకుండా జాగ్రత్త పడాలి.
11.తోటపని చేయడం, పచ్చని చెట్ల మధ్య గడపడం ద్వారా ఆనందం కలుగుతుంది. చక్కని మూడ్‌లోకి రాగలుగుతారు.