సూక్ష్మపోషకాలు అంతే ముఖ్యం
పోషకాలు అనగానే చాలా మంది ప్రొటీన్, కాల్షియం, ఐరన్ ఇవే సమస్తం అనుకుంటారు. కానీ, శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, జీవక్రియలు సజావుగా సాగడానికి మరెన్నో సూక్ష్మ పోషకాలు కూడా అవసరమవుతాయి. వాటిలో క్లోరైడ్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సోడియం, సల్ఫర్ ఎంతో కీలకమైనవి. వీటితో పాటు క్రోమియం, కాపర్, ఫ్లోరైడ్, అయోడిన్, మాంగనీస్, మాడిబ్‌డెనిమ్, సెలీనియం, జింక్ అత్యంత ఆవశ్యమైనవి. ఎవరైనా ప్రొటీన్, కాల్షియం, ఐరన్‌లు బావుంటే అన్నీ బావున్నట్టే అనుకుంటే ఏ క్షణాన్నయినా తీవ్రంగా వ్యాఽధిగ్రస్తం కావచ్చు. ఉన్నట్లుండి మంచానపడొచ్చు. శరీరంలో సోడియం నిలువలు బాగా పడిపోతే కొందరు మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడతారు. అసలు విషయం తెలియక వాళ్లను మనం పిచ్చాసుపత్రికి తీసుకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే మన శరీరంలో సమస్త పోషకాలు సరియైున పాళ్లల్లో ఉన్నాయో లేవో ఎలకా్ట్రల్ పరీక్షల ద్వారా తరుచూ తెలుసుకుంటూ ఉండాలి. విటమిన్లు, లవణాల్లో ఎక్కడ కాస్త లోపం క నిపించినా వాటిని వెంటనే పూరించుకునే ప్రయత్నం విధిగా చేయాలి.
No comments:
Post a Comment