WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label General Articles. Show all posts
Showing posts with label General Articles. Show all posts

Thursday, 28 April 2016

DR KALAM'S SPEECH IN TELUGU ABOUT UNIVERSAL WATER CRISIS AND HOW TO SAVE WATER ON EARTH PLANET



నీటి కరువు గురించి అబ్దుల్ కలాం గారి ప్రెజంటేషన్

ఈ రోజు ప్రపంచం ఎదురుకుంటున్న అనేక సమస్యల్లో ఒకటి నీటిఎద్దడి. 
అబ్దుల్ కలాం గారు నీటి కరువు గురించి ఒక ప్రెజంటేషన్ ఇచ్చారు. 
అది 2002 లో ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురితమైంది. 
వారు భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించి, ఒక వ్యక్తి 2070 లో లేఖ రాస్తున్నట్టుగా చిత్రీకరించారు.
'ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను..... త్రాగలేను, అంత నీరు ఇప్పుడు అంబాటులో లేదు.
నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం. ఇప్పుడున సమాజంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని.
నాకు గుర్తుంది, అప్పుడు నాకు 5 ఏళ్ళు, అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది. ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి, ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి, దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక. అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాము. స్నానం చేయడమనేది అసలు లేనేలేదు. రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు.
ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది. కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడనికి అందరూ రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు. అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు. ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే, అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడంలేదు.
నాకు గుర్తుంది, నీటిని కాపాడండి, సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి, రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటి తరగని వనరని మాకు భావన ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు, డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి, లేదా పూర్తిగా కలుషితమయ్యాయి.
పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి. వాటిలో పని చేసే కార్మీకులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు. నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది.
రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి, ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి. నీటిబాటిల్ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు. 80% ఆహారం అంతా కృతిమమే. నీరు లేకపోతే ఏం పండుతుంది?
గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు. ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే 'అవకాశం' మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు.
ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాము. ఇంతకముందు వలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి. అటువంటి బట్టలు ధరించినా, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా.
ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము. ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం.
జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది. ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి, అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి, ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు. చర్మక్యాన్సర్, వాతప్రకోపిత రోగాలు, మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు.
చర్మం అధికంగా పొడిబారడం వలన 20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు. నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గిన కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది. ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది.
పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి. ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు.
గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది. 137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది. ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడో చెడిపోయాయి, అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు, వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు. డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు. అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు, కానీ ఏదో పూటగడుస్తుందంతే.
కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి. కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది. నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది, బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది.
నేనుడే చోట వృక్షాలు అసలే లేవు, ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు. ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది. 20 వ శతాబ్దంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం, అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది. అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు, కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు.
నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి, వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి, చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను.
అప్పుడు వాడు 'నాన్నా! ఇప్పుడు నీళ్ళెందుకు లేవు?' అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను. ఎందుకంటే నా తరమే పర్యావరణవినాశనానికి దోహదపడింది, ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది. ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు. పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు.
కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది. ఈ భూమాతను కాపాడటానికి ఇంకా మనకు సమయం మిగిలే ఉందని. కానీ అదెలా సాధ్యం.
మీ అబ్దుల్ కలాం
ఇంకా సమయం మిగిలే ఉంది, భూమాతను, ప్రకృతిని కాపాడటానికి. రండి చేయి, చేయి కలుపుదాం. 


Thursday, 17 December 2015

BRIEF BIODATA ABOUT BHARATHA KOKILA SAROJINI DEVI


సరోజినీదేవి ఫిబ్రవరి-13, 1879న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తండ్రి అఘోరనాధ చటోపాధ్యాయ, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసేవారు. సరోజిని చిన్నప్పట్నుంచే చదువులో ఎంతో శ్రద్ధ కనపరచేది. 12 సంవత్సరాల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుంచీ మెట్రిక్యులేషన్‌ పరీక్షరాసి, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాల యింది. ఆమెకు చిన్నప్పట్నుంచే గ్రంథ పఠనం పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉండేది. పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించాలని, నూతన విషయాలను తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరేది సరోజిని. పుస్తకాలు చదివే ఆ తపన, ఆ ఆసక్తి, ఆమెచేత కలం పట్టించింది. సరోజినీదేవి చిన్నప్పుడే ఎన్నెన్నో కవితలు రాసింది. 13సంవత్సరాల ప్రాయంలోనే 'లేడీ ఆఫ్‌ ది లేక్‌' అనే కవితను రాసి ఎందరి ప్రశంసలనో అందుకున్నది. కవితలు రాయడమేకాక, భాషమీద ఎంతో పట్టుపొందింది. రాతల్లోనేకాక, మాటల్లో కూడా ఆమెదిట్ట. అనర్ఘళంగా ఉపన్యా సాలివ్వగలిగిన వక్త సరోజిని.
సరోజిని ఉన్నత విద్యలను అభ్యసించటానికి 16 సం||ల వయసులో, షిప్‌ మీద ప్రయా ణించి లండనుకు వెళ్ళింది. అక్కడ కింగ్స్‌ కాలేజీలో చేరింది. ఆ తర్వాత, కేంబ్రిడ్జిలోని గ్రిట్టన్‌ ఉమెన్స్‌ కాలేజీలో ప్రవేశించింది. ఇంగ్లాండులో ఉన్నప్పుడు సరోజినికి గోవిందరాజులు నాయుడిగారితో పరిచయం ఏర్పడి, అది స్నేహబంధంగా మారింది. ఆ తర్వాత, కేంబ్రిడ్జిలోని గ్రిట్టన్‌ ఉమెన్స్‌ కాలేజీలో ప్రవేశించింది. ఇంగ్లాండులో ఉన్నప్పుడు సరోజినికి గోవిందరాజులునాయుడుగారితో పరిచయం ఏర్పడి, అది స్నేహబంధంగా మారింది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించింది. తన చదువు పూర్తికాకుండానే, భారతదేశానికి వచ్చేసింది సరోజిని. తల్లిదండ్రులను ఒప్పించి, వారి అంగీకారంతో తను ప్రేమించిన గోవిందరాజులు నాయుడు గారినే పెళ్ళాడిందామె. సరోజినికి చిన్నప్పటినుంచీ దేశాభి మానం, దేశభక్తి అధికంగా ఉండేవి. మహిళా విద్యను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలను చేపట్టిందామె. సభలు సమావేశాల ద్వారా మహిళలు చదువుకోవలసిన ఆవశ్యకత ను గురించి మహిళ చదువుకుంటే కలిగే ఉపయోగాలేమిట న్నదీ తెలియపరచేదామె తన ఉపన్యాసాల ద్వారా. ఆమెకే గోపాలకృష్ణగోఖలేగారితో పరిచయం కలిగింది. ఆ పరిచయం తర్వాత ఆయనలోని దేశభక్తి, పట్టుదల, కృషిచూసి జాగృతి పొందిన సరోజినినాయుడు ఎంతో ఉత్సాహంతో, చెక్కుచెదరని ఆత్మధైర్యంతో స్వాతంత్య్రసమరంలోకి ప్రవేశించి, ఎందరో దేశనాయకులతో కలసి పనిచేసింది. హోంరూల్‌ ఉద్యమంలో ఆమె పాల్గొన్నది. జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన దౌర్జన్యం, మారణకాండను గురించి, గుండెధైర్యంతో బ్రిటీష్‌ నాయకులకు తెలియచెప్పే సాహసం చేశారామె. అదేవిధంగా ఖిలాఫత్‌ ఉద్యమంలో జరిగిన అన్యాయాలు, వేధింపులతోపాటు నిజానిజాలేమిటో ఎంతో నిజాయితీగా, గుండెనిబ్బరంతో బ్రిటీష్‌ వారికి తెలియచేసేందుకు ఎంతగానో శ్రమించింది సరోజినీనాయుడు.

1925 వ సంవత్సరంలో కాంగ్రెసు మహాసభలు జరిగినప్పుడు శ్రీమతి సరోజినీనాయుడు అధ్యక్షత వహించింది. తాను అనుకున్నది, న్యాయసమ్మతమయినదిగా భావిస్తే, ఆచరణలో పెట్టగలిగిన వ్యక్తిత్వం ఆమెది. రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్సులో ఎంతో ఆవేశంగా ఉత్తేజంగా ప్రసంగించిన ధీశాలి సరోజినీనాయుడు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆమెకు 'కైజార్‌- ఎ- హింద్‌' స్వర్ణపతకాన్ని బహుమతి ప్రదానం చేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్‌కు గవర్నరుగా బాధ్యతలను స్వీకరించింది. మార్చి-22న, 1949లో ఆమె స్వర్గస్థురాలయింది. సరోజినీనాయుడు దేశభక్తురాలు, వక్త, సంఘసేవకురాలు, కవయిత్రి, ఉదాత్తమయిన వ్యక్తిత్వం, దేశంకోసం పలుమార్లు ఆమె జైలుకు వెళ్ళవలసి వచ్చింది. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, గుండెధైర్యం కలిగిన ఉత్తమ నాయకురాలామె. ఆమె రచించిన 'ది గోల్డెన్‌ త్రెషోల్డ్‌' కవితా సంపుటి భారతదేశంలోనేకాక, విదేశాలలో కూడా ప్రఖ్యాతి చెందింది. హైదరాబాద్‌లో ఆమె నివసించిన భవనానికి, 'ది గోల్డెన్‌ త్రెషోల్డ్‌' అని పేరుపెట్టిందామె. అయితే, ఆమె స్వర్గస్థురాలయిన తర్వాత ఆ భవనాన్ని ఆమె వారసులు ఆమె గుర్తుగా కానుకగా ఇచ్చేశారు. 'ది బర్డ్‌ ఆఫ్‌ టైం' 'ది ఫాదర్‌ ఆఫ్‌ ఉమన్‌' 'ది బ్రోకెన్‌ వింగ్‌' అనే ఆమె రచనలు ఎంతో పేరు సంపాదించుకున్నాయి. దేశవిదేశాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందాయి. 'నైటింగేల్‌ ఇండియాగా' ఆమె కీర్తిని పొందింది.

Wednesday, 16 December 2015

THE POWER OF ANIMALS COMPARES TO HUMANS


మనకు లేని శక్తిసామర్ధ్యాలు జంతువులో ఉన్నాయి. వాటి నుండి నేర్చుకోవలసినది, గ్రహించ వలసింది ఎన్నో ఉన్నాయి అంటున్నారు శాస్త్ర వేత్తలు. జంతువుల కదలికలు, గెంతులు, అడుగులు, పరుగులు ఇవన్నీ శాస్త్రవేత్తలకు పరి శోధనాంశాలుగా తయారయ్యాయి. మన శరీరం లో కండలలోకి చేరిన ఆక్సిజన్‌ ఆ తరువాత శక్తి గా మారుతుంది.ఆక్సిజన్‌ వినియోగాన్ని విశ్లేషిస్తే సామాన్యుడికి, క్రీడాకారుడికి మధ్య ఆక్సిజన్‌ వినియోగంలో అయిదారు శాతానికి మించి తేడా కన్పించదు. జంతువుల శక్తి కేవలం ఆక్సిజన్‌ వినియోగం మీద మాత్రమే ఆధారపడదు. అవయ వాల పొడవు పై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పరుగులు పెట్టే మానవులకు లేని శక్తి గుర్రాలకు ఉంది. గుర్రం పరుగు తీసేటప్పుడు దాని కడుపులోని బల్ల సంకోచిస్తుంది. ఫలితంగా ఎర్రరక్తకణాల సంఖ్య అధికమయి దానికి మరింత శక్తిని సమకూరుస్తాయి. మనిషి ఇలా అధికంగా శక్తి పొందాలంటే శరీరంలోని ఎర్రరక్తకణాలను ఎక్కించుకోవాలి. కొంతమంది క్రీడాకారులు ఈ పనిచేస్తూఉంటారు. దీనినే బ్లడ్‌డోపింగ్‌ అంటారు. అయితే ఈ పని చట్టవిరుద్ధం.

మనిషి తన శక్తిని పెంచుకునేందుకు వీలు లేకుండా అడ్డంగానిలచేది 'ఊపిరితిత్తులు'. వ్యాయామం, శిక్షణలతో గుండె వైశాల్యం పెంచు కోగలం. తద్వారా శరీరంలోకి చేరే రక్తాన్ని పెంచు కోగలం. శరీరంలో రక్తంపెరిగే కొలది అది ఊపిరి తిత్తుల నుండి బోలెడంత ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. కొంచెం శ్రమిస్తే కండలకు రక్తాన్ని చేర్చే సూక్ష్మ రక్తనాళాలను కూడా పెంచుకోగలం. ఊపిరి తిత్తులను మనం ఏ విధంగాను పెంచు కోలేము. గుర్రం వేగంగా పరుగెత్తుతూ ముక్కును ముందుకు జాపి, కళ్ళను పొడుచుకుంటున్న రీతిలో ఉంటుం ది. గుర్రం మరీ వేగం పెంచి పరుగెత్తిందంటే దాని ఊపిరితిత్తుల్లో రక్తం కారి చచ్చిపోతుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు మానవ శరీర నిర్మాణంలోని గుండె, ఊపితిత్తుల పనితీరు జంతువుల వాటితో సరిపోల్చి పరిశోధనలు చేస్తున్నారు. ఇవిఫలిస్తే వీటికి సంబంధించిన వైద్య చికిత్సా రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మనుషుల కన్నా పక్షులు, జంతువులకు ఆలోచనాజ్ఞానం అమోఘంగా ఉంటుందని పరిశోధకులు అభిప్రా యపడుతున్నారు. మనిషి ఏ పనులు చేస్తే చింపాంజీ ఆ పనులు చేయగలదు. చిన్నపిల్లలకు మనం మాటలు, ప్రవర్తనా నేర్పినట్లే చింపాంజీ లకు నేర్పవచ్చు. 

డాల్ఫిన్స్‌కు శిక్షణనిచ్చి వాటి చేత అద్భుత విన్యాసాలు చేయించడం మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. శబ్దాల తేడాలు కనుగొనేం దుకు కోతులపై వివిధ రకాల పరిశోధనలు చేశారు. కెన్యాకు సంబంధించిన కోతులు మూడు రకాల శబ్దాలను పసిగట్టగలవు. అలాగే ఆ శబ్దా లతో హెచ్చరించగలవు. ఒక హెచ్చరిక శబ్దం పాములు వస్తున్నట్లు తెలుపుతుంది. ఇంకొకటి గద్దలు వస్తున్నట్లు మరొకటి చిరుతపులి వస్తున్నట్లు శబ్దాలతో తెలుపుతుంది. ఈ శబ్దాలు విన్న ఇతర కోతులు తమపై ఏ శత్రువు దాడి చేయబోతున్నది ముందుగా తెలుసుకుని స్వీయరక్షణకు చర్యలు చేపడతాయి. ఎన్నో జంతువులు ఈ విధంగా తమ గ్రహణ శక్తిని వాడుకుంటూ శత్రువుల బారిన పడకుండాతమనుతాము రక్షించుకుంటున్నాయి. కుక్కలకు శిక్షణ ఇవ్వడంవల్ల అవి మనకు ఎన్నో పనులు చేసిపెడతాయి. లైట్లు వెలిగించగలవు. ఆర్పివేయగలవు. ఫ్రిజ్‌ నుండి కావలసిన పదార్ధాలు తెచ్చిపెట్టగలవు. పిల్లుల మానసిక శక్తి కూడా గొప్పదే. అవి ఎంత దూరం వెళ్ళినా తమ స్థావరాలను గుర్తించుకోగలవు. వీటికి పరిసరాల గ్రహణ శక్తి ఎక్కువ వాసన ఆధారంగా గుర్తుపడ తాయి. భూకంపాలను సైతం గుర్తించగల్గుతాయి. జంతువులు మాట్లాడలేవుకాని కొన్ని భావాలు వ్యక్త పరుస్తాయి. ఆవులు, ఎద్దులు, ఏనుగులుకన్నీళ్ళు కారుస్తాయి. కుక్కలు తమ స్నేహభావాన్ని వ్యక్త పరచడానికి తోక ఆడిస్తాయి. జంతువులకు కలలు వస్తాయా? అనే విషయం చెప్పడంకష్టం. మనిషికి రాత్రిపూట రేపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ సమయంలో కలలువస్తాయి. చాలా క్షీరదాలు, పక్షులు కూడా రేపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ నిద్రావస్థను అనుభవి స్తాయి. కుక్కలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు గొణుగు తున్నట్లు, ఏడుస్తున్నట్లు, గుర్రుపెడుతున్నట్లు శబ్దాలు చేస్తాయి. పరి శోధకులు జంతువులపై జరిపిన పరిశోధనలలో వాటికి కలలు వస్తాయని నిర్ధారణ చేశారు. ఈ సందర్భంగా ఒక విషయం చెబుతున్నారు. చేపలు కళ్ళు మూసుకోకుండా నిద్రపోతాయి. కళ్ళు మూసుకోలేదు కాబట్టి నిద్ర పోవడం లేదనుకోకూడదు. అదే విధంగా జంతువు లు నిద్రలో కలలు వస్తే వాటిని వివరించే శక్తి లేదు కాబట్టి వాటికి కలలు రావనుకుంటే ఎలా? అంటున్నారు.

Friday, 1 August 2014

ADVANTAGES OF USING RED SANDALWOOD


శృంగార సామర్థ్యాన్ని పెంచే ఎర్రచందనం

భారతీయ పురాతన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న ఎంతో విలువైన సమాచారాన్ని మనం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాము. భారతీయ పూరాతన వైద్యవిధానాలను, వనమూలికల ఔషద గుణాలను విదేశీయులు మనకంటే ఎక్కువగా వాడుకుంటున్నారు. అలాగే మనదేశంలో లభించే అత్యంత ఖరీదైనది ఎర్రచందనం శృంగార పురషులకు గొప్ప ఔషదంగా చైనీయులు, జపాన్ వారికి ఇప్పుడు విరివిగా వాడుతున్నారు. ఎందుకంటే భారతీయ ఎర్రచందనానికి ఔషద గుణాలతోపాటు శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్షణం కూడా ఉంది. ఈ విషయం తెలిసిన చాలా మంది విదేశీయులు తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎర్రచందనం పౌడర్ ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్ ను రోజుకు 5 గ్రాముల చొప్పున పాలల్లో గాని, తేనెలో గాని కలుపుకొని పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకొంటే శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి పెరుగి లైంగిక ప్రేరణను ఎక్కువగా కలగజేస్తుందట. ఎర్రచందనం గుణాలు తెలిసిన చైనా,జపాన్ వంటి విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఎన్ని కోట్ల రూపాయలైనా ఎర్రచందనం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. చైనా, జాపాన్ ల్లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం తప్పని సరిగా ఉండవలసిందేనట. ఈ రెండు దేశాలు ఏటా కనీసం 800 వందల టన్నుల ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి.