WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Ancient Indian History / Mythology. Show all posts
Showing posts with label Ancient Indian History / Mythology. Show all posts

Saturday, 23 April 2016

BRIEF INFORMATION ABOUT WORLD FAMOUS ANDHRAs KOHINOOR DIAMOND IN TELUGU


 కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపద

కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము (కోహ్=పర్వతం, నూర్=కాంతి).

* ఉపోద్ఘాతము

కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది. 1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది. అన్ని ప్రఖ్యాత వజ్రాలవలె కోహినూరు వజ్రము చుట్టూ పలు కథలు, కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది.

* చరిత్ర

భారతదేశంలో
భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు. కోహినూరు వజ్రం తెలుగునాట కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాతమైన వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ ‌దేవ్‌ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన చేతిలో క్రీ.శ.1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీ.శ.1305లో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని దాదాపు వేయి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లాఉద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరును కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.

ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు.

ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.
బాబర్ తన కుమారుడు, సామ్రాజ్యవారసుడూ అయిన హుమాయున్‌కి ఇచ్చారు. హుమాయున్ దానిని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయున్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షేర్షా తిరుగుబాటు వల్ల 1539-40 నవంబరు నెలలో రెండుమార్లు యుద్ధం చేసినా హుమాయున్ అతనిపై ఓటమిచెందారు. హుమాయున్ రాజ్యాన్ని పరిమితం చేసుకని, ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు.

అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవు రాజ్యం దగ్గరలో హుమయూన్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు. అందుకోసం బాబర్‌ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు. తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్‌ వశమై 'బాబర్‌ వజ్రం'గా పేరు పొందింది. మొఘల్‌ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు.

మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్‌ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్‌ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్‌షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్‌ - ఇ- నూర్‌ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.

* భారతదేశం నుంచి ఇంగ్లాండ్‌కు

చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.

తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.

* వెలుగులకొండ విశేషాలు

01. బ్రిటిష్‌రాణి కిరీటంలో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్‌ వజ్రాన్ని, సుల్తాన్‌గంజ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇవ్వాలంటూ భారత్‌ చేసిన ప్రతిపాదనను బ్రిటన్‌ తోసిపుచ్చింది.

02. కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు.
బ్రిటిష్‌ రాజకుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది.

03. బాబర్‌ చక్రవర్తి నూట ఎనభైఆరు క్యారెట్ల బరువైన ఆ వజ్రం ఖరీదు 'ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత' అన్నాడట.

04. ఆల్బర్ట్‌ యువరాజు దానిని సానబట్టిస్తే రెండువేల వజ్రాలు అరిగిపోయాయి. బరువు నూటఅయిదు క్యారెట్లకు పడిపోయింది.

BRIEF HISTORY OF ACHARYA NAGARJUNA


ఆచార్య నాగార్జునుడు

'ఆచార్య నాగార్జునుడు (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. కనిష్క చక్రవర్తి సమకాలికుడైన అశ్వఘోషుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశమునకు మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు . ప్రజ్ఞాపరమిత సూత్రములు కూడ నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడ అంటారు.

* జీవితం

నాగార్జునుని జీవితము గురించి మనకు చాల తక్కువగా తెలియవచ్చింది. ఛైనా, టిబెటన్ భాషలలో నాగార్జునుని జీవిత చరిత్ర ఆతని మరణము తరువాత పలు శతాబ్దములు గడచిన పిదప వ్రాయబడింది. కొన్ని ఆధారములను బట్టి ఈతడు అంధ్ర దేశమునకు చెందిన వైదీక బ్రాహ్మణుడు. నాగార్జునుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. నాగార్జునుడు విదర్భకు చెందినవాడని మరియొక అభిప్రాయము. వేదశాస్త్రములలో పాండిత్యము సంపాదించి హిమాలయములలో విస్తృతముగా పర్యటించి బౌద్ధము పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికము చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. పిదప కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతము చేరి స్థిరపడ్డాడు. దగ్గరలోని ధాన్యకటకములోని విశ్వవిద్యాలములో ముఖ్య అచార్యునిగా బోధలు చేశాడు.

నాగార్జునుని అభిప్రాయము ప్రకారము బుద్ధ భగవానుడే మాధ్యమిక పద్ధతికి కారణభూతుడు. కలుపహణ అభిప్రాయమును బట్టి నాగార్జునుడు మొగ్గలిపుత్త తిస్స వారసుడు, మాధ్యమిక పద్ధతిలో బుద్ధుని మౌలిక బోధలను పునరుజ్జీవనము చేసిన మహనీయుడు.

* ఆంధ్ర దేశంతో అనుబంధం

ఈయన చేత ప్రభావితుడైన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీ పర్వతం (నాగార్జున కొండ) పై ఒక బౌద్ధ విద్యాలయమును కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించాడు. ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందింది. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు.

* నాగార్జునుని రచనలు

నాగార్జునుడు వ్రాసిన ముఖ్య గ్రంథాలు:

01. మూలమాధ్యమికకారిక
02. మహాప్రజ్ఞానపరమితశాస్త్ర
03. ద్వాదశనికాయశాస్త్ర
04. దశభూమివిభాసశాస్త్ర
05. శూన్యతాసప్తతి
06. యుక్తిసస్తిక
07. విగ్రహ వ్యవర్తని
08. సుహ్రిల్లేఖ
09. రత్నావళి

వీటిలో 1 మరియు 7 మూల సంస్కృతములో దొరికాయి. 2 మరియు 3 చైనీస్ అనువాదాలుగా లభించాయి. 2 మరియు 3 తప్ప మిగిలినవన్నీ టిబెటన్ అనువాదాలుగా ఉన్నాయి. నాగార్జునుడు తొలుత సంస్కృతము, పిదప పాళీ భాషలలో వ్రాశాడు. రచనలలో నికాయ సిద్ధాంత ప్రభావము గలదు.

Sunday, 24 January 2016

BRIEF ARTICLE ABOUT ANCIENT INDIAN MEDICAL HISTORY


వైద్యశాస్త్రంలో భారతీయుల ప్రతిభ వేల ఏళ్ల నాటిది.

ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స (Surgery) చేసినది సుశ్రుతులే.......

సుశ్రుతుల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన వారిగా ఆధునిక చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ,మన పురాణేతిహాసాల ప్రకారం ఆయన దాదాపుగా 5000 ఏళ్ల పూర్వం వారు. మనకు చరిత్రను రాసింది పాశ్చాత్యులు కావడం వలన, వాళ్లు బైబిలులో ఉన్నట్లుగా సృష్టి ఆవిర్భవించి ఆరు వేల ఏళ్లకంటే ఎక్కువ కాలేదని తీవ్రంగా నమ్మడం వలన, ఎవరినీ 3000 ఏళ్ల పూర్వం వాళ్లుగా అంగీకరించలేకపోయారు.

సుశ్రుతులు వేల ఏళ్ల క్రితమే వారణాసిలో జన్మించారు. ఆయుర్వేద వైద్య పితామహులుగా ఖ్యాతి గడించిన ధన్వంతరి వద్ద విద్యనభ్యసించారు. పాశ్చాత్య ప్రపంచం విజ్ఞాన పరంగా కళ్లు తెరవక ముందే ఆయన సర్జరీ చేసి చూపించారు.

1) పక్షుల ముక్కుల రూపురేఖలను అనుసరించి, దృఢమైన పట్టు ఉండే విధంగా, సుశ్రుతులు సర్జరీ పరికరాలను తయారు చేసి, వినియోగించినట్లుగా తెలుస్తోంది.

2) వైద్య నియమ సూత్రాలూ, శస్త్రచికిత్స, పురిటి విధులు, మందులు, ఔషధజ్ఞానం మానవశరీర నిర్మాణాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

3) కొన్ని ఉత్పాదకాలు, వనమూలికల మొక్కలు, పుష్ప, ఫలాల ఔషధ మొక్కల గుర్తింపు, లాంటి వృక్షాల్లో ఔషధగుణాల్ని ఆయన కనిపెట్టారు.

4) శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని విశదీకరించే సుశ్రుత సంహిత అనే అద్భుత గ్రంథాన్ని ఆయన సంస్కృతంలో రచించారు.

5) మెడ నుంచి ముఖం వైపు చర్మపు పొరల ప్రతిరూప చికిత్స, ప్రస్తుత అధునాతన ప్లాస్టిక్ సర్జరీ కి సుశ్రుతులు నాందీ పలకడంతోనే ఆయన ప్రజ్ఞ అర్థమవుతోంది.

6) తెగిపోయిన, మరియు కోతకు గురైన ముక్కుకు, ప్లాస్టిక్ సర్జరీని చేసి చూపించారు.

7) సుశ్రుతులు సర్జరీ సందర్భంలో రక్తస్రావాన్ని అరికట్టే విధానంలో చీమతలను బంధన సూత్రంగా వినియోగించే కొత్త పద్ధతి కనిపెట్టారు.

8) సుశ్రుత సంహిత ప్రకారం, సర్జన్ కు ఉండవలసిన లక్షణాలు, ధైర్యం, చురుకుదనం, తక్షణచర్య, పరికరాల పదును, చెమట వణుకు లేకపోవడం..

9) ప్రొస్టేట్ గ్రంధిని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్దతులను సుశ్రుతులు వేల సంవత్సరాల క్రితమే శోధించి, మానవజాతికి అందించారు.

10) ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నారు.

11) మూత్రనాళం లో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో, సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించారు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను, వారి శస్త్రచికిత్సా విధానం ద్వారా విజయవంతంగా తొలగించారు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.

12) పోస్ట్‌మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతులు.శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి, పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత, శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.

13) గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించారు సుశ్రుతులు.

14) నూతన మిలీనియం సందర్భంగా, 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ, ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో పాటుగా వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతులది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది

15) ఇలా చెప్పుకుంటూ పోతే సుశ్రుతుల ప్రతిభ అనంతమని తెలుస్తుంది.

16) అన్నీ పాశ్చాత్యులే కనిపెట్టారనీ, భారతీయులకు ఏమీ చేతకాదనీ, అన్నీ పాశ్చాత్యులు పెట్టిన భిక్షే అనీ, మనం ఆత్మన్యూనతకు లోను కాకుండా, వారిని ఆదర్శపురుషులుగా తీసుకుని, వారి మార్గంలో నడవడానికి సంకల్పిస్తే రేపటి రోజు మనదే కావచ్చు.

సుశ్రుతాయ నమః

Thursday, 26 December 2013

THE GREATNESS OF INDIAN SAINTS


హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.
ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి.
హనుమాన్ చాలీసాలో ...
"యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను"
హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు.
పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం.
భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది.
లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం.
యుగ -12000 సంవత్సరాలు
సహస్ర -1000
యోజనం- 8 మైళ్ళు
యుగ X సహస్ర X యోజనం
12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు
ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే....
ఒక మైలు =1.6 కి .మీ.
96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు.
ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి.
కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు.
హిందూమతం గొప్పతనం అది.