జలుబుకు ఇంటి ఔషధాలు
పిల్లలు త్వరగా జలుబు బారినపడుతుంటారు. వాతావరణం మారినపుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా జలుబు, దగ్గు దరిచేరకుండా ఉండేలా చేయవచ్చు. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇలా చేయండి..
* ఆవిరిపట్టడం :
పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఆవిరిపట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెడికల్ షాపుల్లో స్టీమ్‌మిషన్ లభిస్తుంది. ఇంట్లో సైతం ఒక పాత్రలో నీళ్లు వేడి చేసి ఆవిరిపట్టవచ్చు. నీటిలో యూకలిప్టస్ ఆయిల్ రెండు చుక్కలు వేసుకుని ఆవిరి పట్టిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.
* తేనె :
జలుబుతో బాధపడుతున్న పిల్లలకు తేనెను నాకించిడం వల్ల ఫలితం ఉంటుంది. రోజులో రెండు, మూడుసార్లు పిల్లలకు తేనె ఇవ్వవచ్చు. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
* ఓమ :
ఒక కప్పునీళ్లు తీసుకుని చిటికెడు ఓమ, కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని తాగడం వల్ల దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. చాతీ పట్టేసిట్లుగా ఉండటం తగ్గిపోతుంది.
* మసాజ్ :
రెండేళ్ల లోపు పిల్లలకు మసాజ్ బాగా పనిచేస్తుంది. కొంచెం ఆవాల నూనె తీసుకుని అందులో వెల్లుల్లి కలిపి బేబీ చెస్ట్, వీపు, మెడ భాగంలో బాగా మసాజ్ చేయాలి. అరచేతులు, పాదాలు కూడా మసాజ్ చేయాలి. దీనివల్ల పిల్లలకు క్విక్ రిలీఫ్ లభిస్తుంది.
* నీళ్లు ఎక్కువగా తాగించాలి : ముక్కు నుంచి నీరు కారుతున్నప్పుడు పిల్లలకు ఎక్కువ నీళ్లు తాగించాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గొంతులో నొప్పి తగ్గడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు బయటకు పంపబడతాయి. జ్యూస్, గోరువెచ్చని సూప్‌లు ఇవ్వడం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి.
* ఉప్పు నీరు పుక్కిలించడం :
ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో టీస్పూన్ ఉప్పు వేసి పుక్కించాలి. దీనివల్ల గొంతునొప్పి, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. రోజులో రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* పసుపు పాలు :
పసుపులో యాంటిసెప్టిక్ గుణాలుంటాయి. జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి పాలలో కొంచెం పసుపు వేసి పిల్లలకు తాగించాలి. ముక్కు కారే సమస్యకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. పిల్లలకు తగినంత కాల్షియం, శక్తి లభిస్తుంది.
No comments:
Post a Comment