పదహారణాల తెలుగమ్మాయి అంటే..!?
అది తెలుసుకోవాలంటే ముందు పదహారణాలు అంటే ఏంటో పరిశీలిద్దాం.
భారత దేశంలో ఒకప్పుడు అణాలు ఉండేవి అని మన అందరికి తెలుసు. ఆ తరువాతి కాలంలో రూపాయి ప్రవేశపెట్టబడింది. రూపాయి అంటే వంద పైసలు. మరి అణాలను పైసలుగా, పైసలను అణాలుగా మార్చలంటే ఒక భాజకం ఉండాలి కదా, అది ఒక అణా = 6.25 పైసలు.
మనలో చాలా మందికి తెలిసిన కొన్ని పదాలు పరిశీలిస్తే. (భావితరాలకు తెలిసే అవకాశంలేదు, ఎందుకంటే అవి వాడుకలోంచి వెళ్ళిపోయాయి)
చారాణా (చార్, అణా) = 4 * 6.25 =25 పైసలు
ఆటాణా (ఆట్, అణా) = 8 * 6.25 = 50 పైసలు
బారాణా (బారహ్, అణా) = 12 * 6.25 = 75 పైసలు
లెక్క సరిపోయింది కదా. ఇక పదహారణాలు అంటే 16 * 6.25 = 100 పైసలు.
అంటే నిండు రూపాయి. లేదా నూటికి నూరు శాతం (100%). 99.9999..% కూడా 100% కి సమానం కాదు.
ఇక పదహారణాల తెలుగమ్మాయంటే నూటికి నూరుశాతం తెలుగమ్మాయి, నిండైన తెలుగమ్మాయి, సంపూర్ణమైన తెలుగమ్మాయి అని చెప్పుకోవచ్చు. తన భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్ర ధారణలొ, ఇలా ప్రతివిషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయి మాతమే పదహారణాల తెలుగమ్మాయి అనడానికి అర్హత కలిగిన అమ్మాయి. ఏ ఒక్క విషయంలో తెలుగుదనం లేకున్నా తనకు పదహారణాలు తెలుగమ్మయి అని పిలవబడటానికి అర్హత లేదు.
No comments:
Post a Comment