పాలిచ్చే తల్లులకు డి-విటమిన్!
ఇటీవల చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిలో డి-విటమిన్ లోపంతోనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నది తెలిసిందే. దాంతో పాలిచ్చే తల్లులు విటమిన్-డి సప్లిమెంట్లను వాడటంవల్ల పిల్లల్లో ఆ విటమిన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఎముక కణజాలం కాల్షియంను శోషించుకునేందుకు విటమిన్-డి ఎంతో అవసరం. సాధారణంగా ఇది సూర్యరశ్మి ద్వారానే శరీరంలోకి చేరుతుంది. ఆహారం, తల్లిపాల ద్వారా కొంతవరకూ మాత్రమే పిల్లలకు అందుతుంది. దాంతో డి-విటమిన్ లోపం ఉన్న పసిపిల్లలో రికెట్స్... లాంటి ఎముక సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే పాలిచ్చే తల్లులు విటమిన్ -డి సప్లిమెంట్లను తీసుకుంటే పిల్లలో అది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, ఇందుకోసం 90 మంది పాలిచ్చే తల్లుల్ని ఎంపికచేసి రెండు విభాగాలుగా చేశారు. బిడ్డపుట్టిన నాలుగువారాలపాటు ఒక విభాగానికి 1.25 మి.గ్రా. డోసునీ, మరో విభాగానికి 2.5 మి.గ్రా. మోతాదునీ ట్యాబ్లెట్ల రూపంలో ఇచ్చారట. రక్తపరీక్షలద్వారా పిల్లల్లో ఆ విటమిన్ శాతాన్ని పరిశీలించగా అధిక మోతాదు ఇచ్చిన తల్లుల పిల్లలో డి-విటమిన్ లోపం పెద్దగా కనిపించలేదనీ తక్కువ మోతాదు తీసుకున్నవాళ్లలో ఇది లోపించిందనీ గుర్తించారు. కాబట్టి తల్లులు డి-విటమిన్ సప్లిమెంట్లను వాడటం మంచిదని వాళ్లు విశ్లేషిస్తున్నారు.

No comments:
Post a Comment