ఆర్గాన్ నూనెతో అందం... ఆరోగ్యం..!
అందానికీ ఆరోగ్యానికీ ఆలివ్ నూనె ఎంతో మంచిదన్నది తెలిసిందే. కానీ ఆర్గాన్ నూనె దానికన్నా అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాయి తాజా పరిశోధనలు. మొరాకోలో ఎక్కువగా పెరిగే ఆర్గాన్ చెట్ల నుంచి తీసే ఈ నూనెను అంతా ‘మొరాకో బంగారం’ అని పిలుస్తారు. ఎందుకంటే విటమిన్-ఇ, విటమిన్-ఎలు సమృద్ధిగా ఉన్న ఆ నూనె అందానికీ ఆరోగ్యానికీ పెట్టింది పేరు. ఆలివ్‌నూనె(కిలోకి 320 మి.గ్రా.)లోకన్నా ఆర్గాన్ నూనె (కిలోకి 620 మి.గ్రా.)లో టోకోఫెరాల్ (విటమిన్-ఇ) రెట్టింపు ఉంటుంది. ఈ టోకోఫెరాల్ సహజ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తూ కణాల్లోకి చేరి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఎనాలజెసిక్ గుణాలు ఈ నూనెలో మెండుగా ఉన్నాయట. అందుకే ఇది అద్భుత ఔషధంగానూ అంతకుమించిన సౌందర్యలేపనంగానూ పనిచేస్తుంది.
* ఈ నూనెలో మోనో అన్‌శాచ్యురేటెడ్, పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఆమ్లాలు ఎక్కువగా ఉండటంతో గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ఓలియాక్, లినోలిక్ ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఫలితంగా హృద్రోగ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అనేక పరిశోధనల్లో తేలింది.
* ఇందులో పాలీఫినాల్స్‌తోబాటు రక్తనాళాల్లో గడ్డలు కట్టకుండా నిరోధించే స్టెరాల్సూ ఎక్కువగా ఉండటంవల్ల క్యాన్సర్లు వంటివి వచ్చే అవకాశం కూడా తక్కువట. పైగా ఇది బీపీనీ తగ్గిస్తుందని ఎలుకల్లో చేసిన పరిశీలనల ద్వారా తెలుస్తోంది.
* ఇది కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుందట. సంప్రదాయ వైద్యంలో భాగంగా మొరాకన్లు ఈ నూనెను అనేక చర్మసంబంధ వ్యాధుల్లోనూ వాడుతుంటారు.
* మొహంమీద మొటిమలూ చికెన్‌పాక్స్ మచ్చలూ వంటి వాటిని తొలగించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే దీన్ని అక్కడివాళ్లు బంగారంతో సమానంగా భావిస్తారు. ఇది మేనిమెరుపుని కాపాడడంతోపాటు శిరోజాలు ఆరోగ్యంగా పెరిగేందుకూ దోహదపడుతుందట. దాంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంటోంది.

Argan oil is a plant oil produced from the kernels of the argan tree that is endemic to Morocco. In Morocco, argan oil is used to dip bread in at breakfast or to drizzle on couscous or pasta. It is also used for cosmetic purposes.
No comments:
Post a Comment