WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 19 September 2016

HOME REMEDY - PERMANENT SOLUTION TO REMOVE PIMPLES AND BLACK SPOTS ON YOUR BEAUTIFUL SKIN


మొటిమల మచ్చలుకి టాటా!

మొటిమలు వచ్చి తగ్గాక వాటి తాలూకు మచ్చలు ఇబ్బందిపెడుతుంటాయి. అలాంటివాటిని కనిపించకుండా చేయడానికి అదేపనిగా క్రీంలే రాయాలని లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే పరిష్కారం సాధించవచ్చు.

* ఓ టొమాటో తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. టేబుల్‌స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి మర్దన చేయాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.

* కలబంద గుజ్జును తీసుకుని ఓ ఐదునిమిషాలు ఎండలో ఉంచాలి. అందులో కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* రెండు పెద్ద చెంచాల గంధంపొడిలో కొన్నిచుక్కల గులాబీనీరు కలిపి మచ్చలున్న చోట రాయండి. పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. మచ్చల ప్రభావం తగ్గడమే కాదు.. ముఖం కూడా మృదువుగా మారుతుంది.

* చిన్న బంగాళాదుంప ముక్కను తీసుకుని తురమాలి. అందులో కొద్దిగా తేనె కలిపి మచ్చలపై రాయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేసుకుంటే సరిపోతుంది. బంగాళాదుంప తురమడం కష్టం అనుకుంటే.. ఆ ముక్కలు రెండు తీసుకుని మచ్చలున్న చోట నెమ్మదిగా రుద్దాలి.

* నిమ్మలో విటమిన్‌ ‘సి’తోపాటూ యాస్ట్రింజెంట్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాదు.. మచ్చల్నీ నివారిస్తాయి. కాబట్టి నిమ్మకాయ ముక్కను తీసుకుని ముఖంపై రుద్దుకోవాలి. నిమ్మరసంలో దూదిని ముంచి.. ముఖంపై రాసుకున్నా సరిపోతుంది.

* కీరదోస తురుములో కాసిని పాలూ, నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. మచ్చలున్న చోట రాయాలి. కొంతసేపయ్యాక కడిగేస్తే మచ్చలు తగ్గుతాయి.

No comments:

Post a Comment