WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 20 December 2014

LOVE AND RELATIONS POETRY IN TELUGU


అర్చింపచేసుకోవాలని 
ఏనాడైనా అనుకున్నానా..
వెలకట్టలేని ఈ ఆభుషితాలు 
కావాలని అడిగానా..
అవేవీ కూడా 
నా మనసును చేరలేవు
అవన్నీ ఒట్టి ఆకర్షణలే!

రాళ్ళతో ఆడుతున్నానని
ఆ రాళ్ళపై- రాళ్ళే కదాని
ఎంతటి చిన్న చూపు నీకు
వాటిని నీ వెలకట్టలేని
అభూషితాలతో పోల్చి
హేళన చేస్తావు కదా...
నీవులేని సమయాన
అవే నాకు తోడుమరి!

ఇలను పూచిన పూవులతో
చెలిమి చేసేదానను..
నువ్వు తెచ్చిన నెలవంకను కాదని
ఆ పూలతో చెలిమి చేస్తున్నా
అనే కదా వాటిపై నీకింత కినుక
అలనాడు...
అలసిన నన్ను పోల్చింది ఆ
సంధ్యకు వాడిన పూవుతోనే కదా..
ఇంతలోనే ఎంత చిన్న చూపు
ఆ పూవుపై నీకు!

అర్థంలేని పొగడ్తల అగడ్తలలో నన్ను నేను
వెతుక్కునేలా చేసింది ఎవరు?
కమనీయ కల్పనల కవనసీమని
చూపిన నూవ్వే నన్ను వదిలి
పోయావు అర్ధం లేని
అర్ధశాస్త్ర కోవిదానికి
ఆ ధనం నవ్వుతున్నట్లుంటుంది
నువ్వు లేని నన్ను చూసి!

అనురాగమయిని చేసిన నువ్వే_
ఆటలాడుతున్నా అంటున్నావు..
కరడుగట్టిన నీ హృదిలో
కరుణ రేపిన "కల" ను
ఊసులాడాలని చెప్పి,
కడలి అడుగుకీ, ఆకాశం అంచులకీ
వెళ్ళటం ఏమార్చడమేగా..
నన్ను వదిలి నాకోసం వెళ్ళటం
"మనకోసమా"? ...

బంధాలు సంకెళ్ళని
బలహీనం చెసుకుంటున్నది నీవు..
బాధ్యతా,బరువులు తో
నన్ను మరచిన నేను
ఇహలోకాన్ని వీడి,
ఆకసపుటంచులకి ఏగటం అవసరమంటావా
ఇహంలో ఒకరికొకరం అన్న త్రుప్తి మిగుల్చుకోలేని
మనకి ఎందుకీ అర్భాటపు జీవితాలు!

బీడుభూమైనా, గడ్డిపూవైనా,గులకరాళ్ళయినా
ఇలలోని ఆనందంనందనందనమే
మనసుకి ఇష్టం.
అర్ధంలోనే బ్రతుకు అర్ధమున్నదని
అనుకుంటే..
మన మధ్య వున్న బంధానికి సయితం విలువలేదుగా..
ఈ బంధాలు అనుబంధాల మద్య
ఏమున్నదో తెలియదా నీకు -
మన "అనురాగం" ఈనాటిది కాదని
ఎన్నటికీ వుండాలని
అది "ఆత్మబంధమై" వుండాలన్నదే
కదా నా కోరిక.. @తులసి

No comments:

Post a Comment