ఇంద్రుని వల్ల శాపగ్రస్తులైన అహల్య గాధ
ప్రాచీన కాలంలో వున్న అస్పరసల పాత్ర ఎంతో అద్వితీయమైనది. సౌందర్యానికే ప్రతీకగా వర్ణిస్తూ ఎన్నో రకాల కథలు ప్రచురించబడ్డాయి. కేవలం అందగత్తెలే కాకుండా మంచితనం కలిగినటువంటివారి జీవిత చరిత్రలు.. మట్టిబొమ్మలు ప్రాణం పోసుకున్నట్టు అపురూపంగా వుంటాయి. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్త్రీలకు ముగ్ధులయిపోయేవారు. అటువంటి మహోన్నత పాత్రలను కలిగిన స్త్రీలలో అహల్య ఒకటి. ఆమె మంచిగుణాల గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం...
పూర్వం చతుర్ముఖుడు, గౌతమ మహర్షికి నిత్యం సేవలను అందించేందుకు, ఆయన ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఒక అప్సరసను ఏర్పాటు చేశాడు. ఆమె పేరు అహల్య. ఈమె సుగుణాలతో కూడిన సౌందర్యవంతమైన ఒక అందాల రాశి. ఈమె ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో నిస్వార్థతతో, నిజాయితీగా నిత్యం గౌతమ మహిర్షికి సేవలను అందిస్తూ... ఎంతో అందంగా, సక్రమంగా నిర్వహించుకునేది. దాంతో ఈమె నిజాయితీని గమనించిన బ్రహ్మదేవుడు.. గౌతమునికి అహల్యే తగిన భార్య అని భావిస్తాడు.
అలా ఆలోచించిన మరుక్షణమే బ్రహ్మదేవుడు, ధ్యానం చేసుకుంటున్న గౌతమ మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు... ‘‘ఓ గౌతమా! నేను నీకు పెట్టిన అన్ని పరీక్షలలోనూ నువ్వు గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే.. భూప్రదక్షిణతో సమానమైన పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యంతోపాటు ఎన్నో పుణ్యకారాలను సంపాదించుకున్నావు. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను మనస్సుతో స్వీకరించి, ధన్యుడివి అవు’’ అని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా.. బ్రహ్మదేవుడే దగ్గరుండి వనదేవతల సమక్షంలో వీరిద్దరి వివాహాన్ని (గౌతమ మహర్షి, అహల్య) జరిపిస్తాడు.
ఇలా జరిగిన వీరి వివాహనంతరం కొంతకాలానికి వీరిద్దరికి శతానందుకు అనే ఒక కొడుకు పుడతాడు. ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కొన్నాళ్ల తరువాత గౌతమ మహర్షి తపో దీక్షను చేపడతాడు. ఆ దీక్ష ప్రభావం ఎంతగా వుంటుందంటే.. ఏకంగా స్వర్గాన్నే కదిలించేలా వుంటుంది. దాంతో స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు ఒక్కసారిగా భయానికి గురవుతాడు. ఎక్కడ తన పదవి పోతుందేమోనన్న భయంతో.. అతని దీక్షను భంగం కలిగించాలని ఒక పన్నాగం పన్నుతాడు. దానికి దేవతలందరి సహాయాన్ని కూడా కోరుకుంటాడు.
అయితే అహల్య అందానికి ముగ్ధుడైన దేవేంద్రుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు తన స్వర్గలోకాన్ని - దేవతలను కాపాడుకునేందుకు, మరోవైపు అహల్యను పొందాలనుకునేందుకు దేవేంద్రుడు ఒక తనదైన ఒక పన్నాగం పన్నుతాడు. దానిప్రకారం ఒకరోజు దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇంకా తెల్లవారుజాము కాకముందే కోడిరూపంలో వచ్చిన దేవేంద్రుడు గట్టిగా కూస్తాడు. దాంతో గౌతముడు ఒక్కసారిగా ఉలిక్కపడి లేచి, బ్రహ్మముహూర్తం సమీక్షించిందని అనుకుని, సూర్యభగవానుని అర్ఘ్యం ఇచ్చేందుకు బయటకు వెళతాడు. పవిత్ర నదీజలాన్ని తెచ్చుకునేందుకు నదివైపుగా వెళుతుండగా చుట్టుపక్కల కారు చీకటి కమ్మకుని వుంటుంది. అప్పుడు గౌతముడు తన మనసులో.. ‘‘కోడి కూసినప్పటికీ ఎక్కడా వెళుతురు జాడ కనిపించడం లేదు. ఇంకా తెల్లవారలేదులే’’ అని అర్థం చేసుకుని తిరిగి వెనక్కి ఆశ్రమానికి వెళతాడు.
గౌతముడు ఆశ్రమానికి చేరుకోగానే.. తన రూపంలో వున్న దేవేంద్రునిని అహల్యతో కలిసి వుండడాన్ని చూస్తాడు. దాంతో గౌతమ మహర్షికి ఎనలేని కోపం పొంగుకొని వస్తుంది. అవమానంతో కుంగిపోతున్న దేవేంద్రుడు, కోపంతో రగిలిపోతున్న మహర్షిని చూసి భయంతో తన అమరలోకానికి పరుగులు తీస్తాడు. అయితే ఇందులో అహల్య ఏ తప్పు లేకపోయినా.. ఇంద్రుని పక్కన వున్నందువల్ల గౌతమ మహర్షి కోపంతో ఆమెను శపిస్తాడు. ‘‘నువ్వు రాయిగా మారిపో’’ అంటూ క్షణికావేశంతో అంటాడు. అప్పుడు కూడా అహల్య తన భర్త మాటను శిరసావహిస్తూ ఏమీ అనుకోకుండా.. అతను విధించిన శాపాన్ని గౌరవంగా అంగీకరిస్తుంది.
ఇదంతా జరిగిపోయిన కొద్దిసేపటి తరువాత గౌతమ మహర్షి తన దివ్యదృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. అహల్య తప్పు ఏమీలేదని గ్రహిస్తాడు. దానికి ఎంతో పశ్చాత్తాపపడుతూ.. ‘‘రాయిగా వున్న నువ్వు రాముడి పాదాలు తాకినప్పుడు తిరిగి స్త్రీ రూపాన్ని పొందుతావు’’ అని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా రాయిగా మారిపోయిన అహల్య శాప విమోచన పొందేందుకు రాముని రాక కోసం ఎదురుచూస్తూ తన కాలాన్ని గడిపింది. చివరికి చాన్నాళ్ల తరువాత రాముని పాదాలతో పునీతురాలై.. మళ్లీ స్త్రీ రూపాన్ని పొందుతుంది.
అదీ అహల్య గాధ. అహల్య ఎంతో సాత్వికురాలు కాబట్టి.. తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లాపాలు ఆడినప్పుడు కూడా.. తన భర్తేనని అనుకుని మురిసిపోయింది. అంతేకాని.. ఆమెకు ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది అస్సలు వుండేది కాదు. తొందరపాటుతో భర్త శాపించినప్పటికీ దానిని అంగీకరిస్తూ తన భర్త మాటను దాటేయకుండా శిరసావహించింది. ఇదే అహల్య గొప్పతనం.

No comments:
Post a Comment