WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 7 November 2015

THREE GREAT POETS OF TLEUGU POETRY - BRIEF INFORMATION IN TELUGU


మన కవి త్రయం.
.
నన్నయ తెలుగువారి ఆదికవి,వేదాధ్యాయ సంపన్నుడు,శబ్దశాసనుడు,,వేదవేదాంగివిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగమశాసనుడు .
.
ఆదికవి నన్నయ్య గారి ముందు నూయ్య వెనుక గోయ్యా పోలు పద్యం..
చంపకమాల:
"ఇది ప్రళయాగ్నివోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫులింగముల్:
వదలక వాయుసారథి జవంబున దా నిట వచ్చె నేమిసే:
యుదు సుతులార యీబిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ:
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండగన్:."
అర్థము:
ఓ పుత్రులార| ఈ కార్చిచ్చు అన్ని దిక్కుల నుండి క్రమ్ముకు వస్తుంది, ప్రళయ కాలంలో చెలరేగే విధంగా వాయువునే సారధిగా కలిగిన ఆ అగ్నిదేవుడు మనను కబళించడానికి వస్తున్నాడు
. ఈ అగ్ని బారినుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ బిలము నందు దూరండి, నేను దానిని దట్టమైన ధూళి సమూహముచేత కప్పివేస్తాను
..
తేటగీతి
" బిలము సొచ్చితిమేని నందెలుక చంపు:
నింద యుండితిమేనిఁ దా నేర్చు నగ్ని:
యెలుకచే జచ్చుకంటె నీ జ్వలనశిఖలఁ:
గ్రాగి పుణ్యలోకంబులఁ గాంతు మేము:."
అర్థము: బిలములో దూరితే అందుగల ఎలుక చేతిలో చచ్చెదము, ఇక్కడే వుంటె అగ్నిలో మాడిపోయెదము. ఎలుక చేతిలో చచ్చే కన్న అగ్నిలో ఆహుతి కావడం వలన పుణ్యలోకాలనైన పొందెదము..
.
తిక్కన జీవిత కాలం 1205 - 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు. తిక్కన నిర్వచనోత్తరరామాయాణాన్ని రచించి మనుమసిధ్దికి అంకితమిచ్చారు.
.
భారత రచన
మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. వ్యాస మహర్షి భారత రచన చేసేసమయంలో గణపతి లేఖకుడు. అదే విధంగా తిక్కన సోమయాజికి గురునాధుడు లేఖకుడు. శైలి అలతి అలతి పదముల అనల్పార్థ రచన కావించిన మహాకవి తిక్కన. తాను రచించిన 15 పర్వాల భారతాన్ని ప్రబంధమండలిగా పేర్కొని, నాటకీయ శైలిలో , నానారసాభ్యుదయోల్లాసిగా రచించాడు. కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.
.
తిక్కన్న పద్యాలు
ద్రౌపది కీచకునితో
"దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా"
ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుడు
.
:సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్"

No comments:

Post a Comment