WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 7 November 2015

USE TURMERIC - PASUPU TO REMOVE BLACK HEADS - BEAUTY TIPS WITH TURMERIC


పసుపుతో బ్లాక్‌హెడ్స్ మాయం

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.

• చెంచా దాల్చినచెక్క పొడీ, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, ఆ ప్రాంతంపై దూది ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ దూదిని తొలగించి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. చెంచా వంటసోడా, అరచెంచా నీళ్లూ కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచిది.

• ఓట్స్ మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. చెంచా ఓట్స్‌ని రెండు చెంచా నీళ్లలో ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌పై రాసి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

• గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment