గుమ్మడి గింజలు.. శృంగార సామ్రాజ్యానికి సోపానాలు
మానవ మనుగడలో అతి కీలకపాత్ర పోషించేది శృంగారం. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో అది తన ప్రాధాన్యాన్ని కోల్పోతోంది. తీరిక లేకపోవడం ఒకవైపు, డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి పలురకాల వ్యాధులు మరోవైపు శృంగారాసక్తిని చంపేస్తున్నాయి. దాంతో ఏదో మొక్కుబడిగా పిల్లల కోసమే చాలా మంది సెక్స్ చేస్తున్నారు. చాలామందికి నడివయసుకొచ్చేసరికి శృంగార సామర్థ్యం తగ్గుతుంది. అయితే వారు ఆ విషయమై డాక్టర్లను కలవడానికి సంకోచిస్తున్నారు. డాక్టర్ల వద్దకు వెళ్లలేకపోయినా.. కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం కొంతవరకైనా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనవి గుమ్మడికాయ గింజలు.
గుమ్మడి పిక్కలు సెక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. ఈ పిక్కల్లో జింక్ పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది మగవారిలో టెస్టొస్టిరాన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుందని రుజువైంది. యాంటీ ఆక్సిడెంట్ సెలెనియంతో పాటు విటమిన్లు ఇ, సి, డి, కె, బి నిండి ఉన్న గుమ్మడి గింజలు శృంగార సామ్రాజ్యానికి సోపానాలు. వీర్యంలో కీలకమైన శుక్రకణాల వృద్ధికి ఈ గింజలు ఎంతో ఉపకరిస్తాయి. వీటిలోని మాంగనీస్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు మగతనాన్ని మెరుగుపరచడంలో ముందుంటాయి. శృంగార సామ్రాజ్యంలో పురుషులకు పోటీగా స్త్రీలకూ అదే స్థాయిలో గుమ్మడి గింజలు ప్రయోజనాలు అందజేస్తాయి.
సాధారణ ఆరోగ్యం విషయానికొస్తే.. మన శరీరంలో ధమనులకు దన్నుగా నిలుస్తాయి గుమ్మడి గింజలు. మూత్ర సంబంధ సమస్యల్ని నివారించడానికి శతాబ్ద కాలానికి ముందు నుంచే నాటి సంప్రదాయ వైద్యులు ఈ గింజల్ని ఉపయోగించేవారట. గుండె జబ్బుల నివారణ, కొవ్వుతో పాటుగా కిడ్నీలో రాళ్ళను కరగదీయడంలోను ఈ పిక్కల పనితీరే వేరు. ఈ గింజలను పచ్చిగా తినవచ్చు, కాస్తంత ఆలివ్ ఆయిల్‌లో వేయించుకుని కూడా తినవచ్చు.
No comments:
Post a Comment