WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 7 November 2015

SRI KALAHASTHESWARA SATAKAM AND MEANING


శ్రీ కాళహస్తీశ్వర.!
.
మును నేపుట్టిన పుట్టులెన్నిగలవో మోహంబుచే నందు చే
సిన కర్మంబుల ప్రోవు లెన్నిగలవో చింతించినంగాని, యీ
జననంబేయని యున్నవాడ నిదిటే చాలింపవే నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళహస్తీశ్వరా!
.
శ్రీ కాళహస్తీశ్వరా!నేనిప్పటికి ఎన్ని జన్మలెత్తినానో,
వాటిలో అజ్ఞానముచే ఎన్ని దుష్టకృత్యములు చేసితినో నాకు తెలియదు
.ఇదియే నాకు చివరి జన్మ అని భావిస్తున్నాను.
ఈ జన్మలో నిన్ను సేవించిన పుణ్యముతో
పూర్వపు జన్మలలో చేసిన పాపములన్నియునూ
తొలగిపోవునట్లు నన్ను అనుగ్రహించుము.

No comments:

Post a Comment