WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 13 November 2015

KODALA KODALA KODUKU PELLAMA - TELUGU VILLAGE POETIC SONG


కోడలా కోడలా కొడుకు పెళ్ళామా!
(ఊరి భావి కాడ...అత్తాకోడళ్లు....శ్రీదామెర్లవారిచిత్రం..)

"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా 

పచ్చిపాల మీద మీగడలేవి?

వేడిపాల మీద వెన్నల్లు యేవి?

నూనెముంతల మీద నురగల్లుయేవు?"

"అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త

పచ్చిపాలమీద మీగడుంటుందా?

వేడిపాల మీద వెన్నలుంటాయా?

నూనె ముంతల మీద నురగలుంటాయా?"

"ఇరుగు పొరుగులార! ఓ చెలియలార

అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా?

పెత్తనం లాగేస్తే పేచీలుపోను

ఆరళ్ళ అత్తయిన సవతి పోరయిన

తల్లిల్లు దూరమైన భరియించలేము."

No comments:

Post a Comment