WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 18 September 2014

SUCCESS AND FAILURE - TELUGU POETRY


రాలే తారల సవ్వడిలో
మధురమైన రాగాలు వినపడుతాయి
బండరాయి గుండెలపై 
జీవం అంకురార్పణ సాధ్యపాడుతుంది
పసుప్ప్పచ్చటి ఆకుల మధ్య
కాటుక పులుంకున్న రాతిరి నడుమ
వసంతపు హరిత కువకువలు
ఎర్రెర్రని అరుణిమలూ కనపదుతాయి
కరిగిపోయిన కలల వ్యధల రోధనలు
మదిని చీల్చి కళ్ళలో నీరై నాట్యమాడుతున్నా
ఓటమి లేదు, నిరాశ లేదు
నిస్పృహ లేనే లేదు
ఓటమి ఓడేది ఓటమిని అంగీకరించనపుడే
అసాధ్యం సాధ్యమయ్యేది అలోచనతోనే
కాలం నుదిటిపై రాతలురాయాలి
ఓటమి గెలుపు అన్నీ మన అంగీకారంలోనే .

No comments:

Post a Comment