WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 11 September 2014

DURGA MATHA PRAYER IN TELUGU


శిలల తెచ్చి ఉలుల మలచి అమ్మ యందునా?
వెన్నవంటి మనసు మాట తలపకుందునా
వెలుగులీను దీప శిఖల అమ్మ యందునా
వెల్లివిరియు చల్లదనము వదలు కొందునా!
అంతు లేని నింగి చూచి అమ్మ యందునా
లేనిదాని కున్న దనము నిచ్చు కొందునా!
మంత్ర తతుల నాదగతులనమ్మ యందునా
అమ్మలోని శాశ్వతత్త్వ మెన్నకుందునా!
మంచుకొండ ముద్దుపట్టి అమ్మ యందునా
ఆమె అఖిలమాత యనుట పలుకకుందునా!
శివుని మేన అర్ధ భాగమమ్మ యందునా
నిత్య పూర్ణశక్తినిట్లు చీల్చు కొందునా!

No comments:

Post a Comment