అందం
చిన్న వయసులోనే కొందరికి ముఖంపై చర్మం ముడతలు పడుతుంది. అవి పోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి.
మామిడి ఆకులను పొడి చేయాలి. ఇందులో మినప పొడి, ముల్తాన్
మిట్టీలను సమాన పాళ్లలో కలిపి, ఓ డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, పాలతో కలిపి పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముడతలు మాయమవుతాయి.
అది మాత్రమే కాదు. బంగాళదుంప గుజ్జు, టొమాటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముడతలు పోయేలా చేస్తాయి.
క్యారెస్ రసంలో పాలు, బాదం పప్పు పేస్ట్ కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
కొన్నాళ్లపాటు వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.
బాదం నూనెతో మర్దనా చేసినా కూడా ముడతలు పోతాయి.

No comments:
Post a Comment