షుగర్, క్యాన్సర్‌లకు విరుగుడు అడవికాకర..
ఆగాకర, ఆకాకర, అడవి కాకర, బొంతు కాకర, బోడ కాకర... ఇలా ఈ కూరగాయకు చాలా పేర్లే ఉన్నాయి. కాకరకాయంత పొడవుగా ఉండదు, దానంత చేదు కూడా ఉండదు. కానీ ఆగాకరలో పోషకాలు మాత్రం ఎక్కువే ఉంటాయి. వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆగాకర కాయలు మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇన్సులిన్ లెవల్స్‌ను పెంచుతాయి.
మధుమేహం వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి.
2. ఆగాకర కాయల్లో పైటో న్యూట్రియంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌లను నయం చేస్తాయి. క్యాన్సర్ కణతులను పెరగనీయకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.
3. ఆగాకర కాయల్లో ఫొలేట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎంతగానో అవసరమైన ముఖ్యమైన పోషకం. దీంతో గర్భస్థ శిశువు చక్కగా ఎదుగుతుంది.
4. ఆగాకర కాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది.
5. ఆగాకర కాయల్లో ఫ్లేవనాయిడ్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. ఇందు వల్ల వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా దరి చేరవు.
6. ఆగాకరలో విటమిన్ ఎ కూడా బాగానే ఉంటుంది. ఇది దృష్టి సంబంధ సమస్యలను తొలగిస్తుంది.
7. మూత్రపిండాలు, మూత్రాశయ సంబంధ సమస్యలు ఉన్న వారు నిత్యం ఆగాకర కాయలను తింటుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
8. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తొలగించుకోవచ్చు.
No comments:
Post a Comment