గ్యాస్ ట్రబుల్
గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనునది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి
వ్యాధి కారణాలు
గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనునది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి
వ్యాధి కారణాలు
కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
అధిక టీ/కాఫీ సేవనం
సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
ఒత్తిడి, అలసట
మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం
మానసిక ఆందోళన, దిగులు, కుంగుబాటుకు లోనుకావడం వంటి మానసిక కారణాలు
ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం
జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి
లక్షణాలు
కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
ఆకలి లేకపోవడం
పెద్ద శబ్దంతో తేంపులు రావడం
నివారణా చర్యలు
మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, టీ, కాఫీలు మానివేయాలి. నిల్వ ఉంచిన పచ్చళ్ళు తినడం మానేయాలి. కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే ఆహారపదార్థాలు తింటే కూడా కడుపులో గ్యాస్ పెరుగుతుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. జీవనశైలి, జీవనవిధానంలో మార్పు, ఆహార నియమాలు పాటించడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటి ఆటలు, క్రీడలలాంటి శారీరకశ్రమతో కూడిన వ్యాయామాలు, కడుపు నిండుగా ఒకేసారి ఆహారం తీసుకోకుండా ఉండటం చేయాలి. మనం రోజువారి తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచిది. తినేదాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని బాగా నమిలి మింగడం వల్ల ఈ ఇబ్బందిని అధిగమించొచ్చు. కార్బొనేటెడ్ కూల్‌డ్రిరక్స్, చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా కడుపులో గ్యాస్ పెరుగుతుంది.
No comments:
Post a Comment