మేలు చేసే క్యాబేజి
క్యాబేజిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు క్యాబేజిలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి జీవక్రియ పనితీరును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాక, కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. కండరాల ధృడత్వానికి, రక్తాన్ని శుద్ధిచేయడానికి, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటానికి క్యాబేజి ఎంతో ఉపయోగం.క్యాబేజి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. మొటిమలు తగ్గాలంటే వారానికి రెండు సార్లు దీనిని ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
అయితే ఉడికించిన క్యాబేజిని తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఉడికించడం వల్ల కొవ్వు శాతం చాలా తగ్గుతుంది. జలుబు నుంచి ఉపశమనం లభించాలంటే క్యాబేజిని బాగా ఉడికించి ఆ రసాన్ని సేవిస్తే ఫలితం ఉంటుంది. క్యాబేజి రసంతో అధిక బరువును దూరం చేస్తుంది. క్యాబేజితో క్యారెట్ తరుము చేర్చి ఉప్పు లేకుండా ఉడికించి ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుందీ క్యాబేజి.

No comments:
Post a Comment