శ్రీ మత్సగిరి లక్ష్మినరసింహస్వామి క్షేత్రం
తెలంగాణా ఎర్రమట్టి మాగాణాల్లో పరుచుకున్న తంగేడు;గూనుగు;మోదుగు పూల వనాలలో పచ్చని ప్రకృతి ఒడిలో వెలిసిన దివ్యక్షేత్రం.చుట్టూ" కాశ"గడ్డి భూములు...ఆ గడ్డిపై నుండి వచ్ఛే స్వచ్చమైన గాలి పరిమళాలు... ఆకాశాన్ని అంటేలా మహోన్నతంగా నిల్చున్న కొండలు.ఆ కొండలలో పచ్చని ప్రకృతి కాంతను ఒడిలో కూర్చుండబెట్టుకున్న కొండ 'వేములకొండ'.ఆ కొండపై చక్కటి గుండం(పుష్కరిణి).దానిలో మత్స్యాలు(చేపలు)....ఆ గుండం ఒడ్డునే మనకు మత్స్యావతారంలో నరసింహ స్వామి దర్శనమిస్తాడు.ఈ గుండంలోని చేపలు సాక్షాత్ భగస్వరూపాలు..వాటిలో కొన్ని విష్ణు నామాలతో దర్శనమిస్తాయి.అలా "త్రి"నామాలతో ఎవరికైతే దర్శనమిస్తాయో వారికి సాక్షాత్ భగవంతుడే దర్శణం అయినట్లు ప్రతీతి.అంతేకాదు గుండంలోని నీరు సైతం మహిమాన్వితమే...ఆ నీటిని పంటపొలాలొ చల్లితే పంటలు పుష్కలం పండుతాయని బలమైన నమ్మకం.పుష్కరినిలో స్నానం చేసి తడిబట్టలతో గర్భగుడి చుట్టూ మూడుప్రదక్షిణలు జేసి స్వామివారిని దర్శించుకొన్నట్లైతే పాపహరణం జరిగి పునీతులౌతారని పురాణాల ద్వారా తెలుస్తుంది.పూర్వకాలంలో మునులు ఈ కొండపై తపస్సు అచారించి భగవంతున్ని అవాహన చేసుకునేవారు.ఇంతటి మహిమాన్విత క్షేత్రం కాబట్టే సుదూర ప్రాంతాలనుండి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులౌతున్నారు.
ఈ క్షేత్రం నల్లగొండజిల్లా వలిగొండ మండలంలో మండల కేంద్రానికి 8 కి.మి దూరంలో కలదు.హైద్రాబాద్ నుండి ట్రైన్ మరియు బస్ సౌకర్యం కలదు.
No comments:
Post a Comment