WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 5 September 2016

HEALTH BENEFITS WITH EATING BRINJALS - VANKAYA - REGULARLY


వంకాయల్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయల్ని వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది. వంకాయలోని పొటాషియం రక్తంలో చేరే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. వంకాయలోని పీచు ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు పెరగడానికి బ్రేక్ వేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వంకాయలో క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. వంకాయను ఉడికించి దానితో తేనె చేర్చి సాయంత్రం పూట తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. వంకాయను వంటల్లో చేర్చడం ద్వారా గుండె, రక్తనాళాల్లో ఏర్పడే వ్యాధులను నిరోధించవచ్చు. వంకాయలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి మేలు జరిగినట్లే. వంకాయలను తినడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా హైబీపీని వంకాయలు నియంత్రిస్తాయని వారు చెప్తున్నారు.

No comments:

Post a Comment