WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 11 December 2013

HOW TO MAINTAIN YOUR BEAUTIFUL LEGS SHINE AND HEALTHY - WINTER SEASON BEAUTY TIPS


వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యూటికల్‌ క్రీము లేదా రెండుచెంచాల ఆలివ్‌ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిస్‌ బాగా కలిపి చేతులకు పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్‌ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాల మీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది.
పాదాలను నీళ్ళలోనే ఉంచి ప్యూమిక్‌స్టోన్‌తో పాదాల మీద మడమల మీద పగుళ్ళను మూడు- నాలుగు నిమిషాల పాటు రుద్దండి. దీనివలన పాదాలపై పేరుకున్న మట్టి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి.
రోజూ రాత్రిపూట హేండ్‌క్రీమ్‌ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలిమడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే నైట్‌ పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సు ధరించి నిద్రించడం మంచిది. కాలివేళ్ళగోళ్ళు వీలయినంతగా కత్తిరించడం మంచిది

No comments:

Post a Comment