WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 11 December 2013

WINTER SEASON LIPS CARE TIPS BY EXPERTS


ఈ ఆధునిక కాలంలో పురుషులకు సమా నంగా పలు రంగాల్లో మహి ళలు దీటుగా రాణి స్తున్న నేపథ్యంలో, కీలక పదవుల్లో ఉన్న మహిళలు మేకప్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తు న్నారు. ముఖ్యంగా పెదవుల మేకప్‌ విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే కొందరు మహిళలు ఏదో లిప్‌స్టిక్స్‌ వేసేసుకుని ఆఫీసులకు పరుగులు తీస్తుంటారు. అలాంటి మహిళలకు కొన్ని చిట్కాలు.ముందుగా లిప్‌లైనర్‌ వేసుకోవాలి.
పెన్సిల్‌ తరహాలో ఉన్న లిప్‌ లైనర్‌తో అవుట్‌లైన్‌ వేసుకుని లైనప్‌లోపలి నుంచే లిప్‌స్టిక్‌ వేసుకోవాలి. అప్పుడే ఇతరు లకు ఆకట్టుకునే విధంగా మీ పెదవులు ఉంటాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే లిప్‌స్టిక్స్‌కు తగిన రంగుకు తగ్గట్టు లిప్‌లైనర్‌ ఉండేలా చూసుకోవాలి. ఇంకా మాయిశ్చరైజర్‌ లేని లిప్‌లైనర్‌లను పెదవులకు ఉపయోగించేటప్పుడు కాస్త క్రీమ్‌ను రాసుకోవడం మంచిది.
ఇలా క్రీమ్‌ రాయడం ద్వారా పెదవులు ఎండి పోకుండా ఉంటాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment