నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి....!
నీళ్లు బాగా తాగు అని అమ్మ చెబితే విసుక్కుంటుంటాం. కానీ నీరు శరీరానికి దివ్యౌషధమని తెలుసా? శరీరంలో నీటి శాతాన్ని బట్టి శరీరారోగ్యం ఆధారపడి ఉంటుంది. అనారోగ్యం దరి చేరదు..!
మన శరీరంలో 75 శాతం, మెదడులో 85 శాతం నీరుంటుంది. ఆహారం కన్నా కూడా నీటి ద్వారా శరీరానికి అందే పోషకాలు ఎక్కువ. ఇవి శరీరాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే నీరు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా, శరీర భాగాలు సరిగా పనిచేయాలన్నా నీరు ఎంతో అవసరం.
* నీరు ఆహారాన్ని అరిగేట్టు చేస్తుంది. తిన్న తిండిలోని పోషకాలను అందేలా చేస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త కణాలకు కావాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలను అందజేయడంలో ఎంతో సహకరిస్తుంది. శరీరంలోని రకరకాల మలినాలను బయటకు పంపిస్తుంది. ఇవేకాదు జాయింట్స్ కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. టిష్యూలను పరిరక్షిస్తుంది. అన్నింటికన్నా మెటబాలిజ ం సరిగా పనిచేయడంలో తోడ్పడుతుంది. నీరు తరచూ తాగుతుండడం వల్ల శరీరాన్ని డీ-హైడ్రేషన్ నుంచి రక్షించవచ్చు.
* రోజుకు ఒకటిన్నర లీటరు నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. మనిషి ఫిజికల్ యాక్టివిటీకి అనుగుణంగా నీరు తాగాలి. బాగా యాక్టివ్‌గా ఉండేవాళ్లు నీటిని ఎక్కువ తాగాలి. రోజూ నీరు బాగా తాగుతున్నారా లేదా అనే విషయాన్ని మూత్రం రంగును చూసి చెప్పొచ్చు. మూత్రం పసుపుపచ్చగా వస్తుంటే మీరు నీటిని తక్కువ తీసుకుంటున్నారని అర్థం.
నీటి శాతాన్ని పెంచాలి.. ..!
* నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగాలి. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత, అలాగే నిద్రపోయే ముందర నీటిని బాగా తాగాలి.
- నడకలాంటి వ్యాయామాలు చేసేముందర కూడా నీళ్లు తాగాలి.
- పనిచేస్తున్న సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుండాలి.
- అన్నం తినేముందర నీటిని తాగాలి.
- బయటకెళ్లినప్పుడు దారిలో కూడా కొద్ది కొద్దిగా మంచినీళ్లు తాగుతుండాలి.
- కాఫీ, టీలకు బదులు మంచినీళ్లు తాగడం మంచిది.
- మంచినీళ్లు నోటికి రుచిగా లేవనిపిస్తే నిమ్మకాయనీళ్లు తాగండి. ఇది శరీరానికి ఎనర్జీ నిస్తుంది.
No comments:
Post a Comment