WORLD FLAG COUNTER

Flag Counter

Sunday, 7 September 2014

TIPS FOR WAKING UP EARLY ENERGIZED - HEALTHY WAKING TIPS IN TELUGU


తాజాగా రోజు నిద్ర లేవలంటే.....!

కొంతమందికి రాత్రి 10 కొట్టగానే కళ్లు మూతలుపడతాయి. ఇంకొంతమందికి అర్ధరాత్రి దాటినా నిద్రపట్టదు. అందరూ నిద్రపోయే సమయంలో వీళ్లు నిశాచర జీవుల్లా మేలుకుని ఉంటారు. ఇదంతా జీవన విధానం వల్ల బయలాజికల్‌ క్లాక్‌లో వచ్చిన మార్పు ప్రభావమే! ఈ క్లాక్‌ను తిరిగి రివర్స్‌ చేసే వీలుంది. 

రోజు మొత్తంలో ఉదయం వేళే ఎక్కువ హుషారుగా, చలాకీగా ఉంటాం. కానీ కొంతమంది విషయంలో సీన్‌ రివర్స్‌ అవుతుంది. వీళ్లు ఉదయంవేళ బద్ధకంగా, నీరసంగా కనిపిస్తారు. చీకటి పడేకొద్దీ చలాకీతనం పెరిగిపోతుంది. అలా రాత్రి రెండయ్యేవరకూ నిశాచర జీవుల్లా సంచరిస్తూ తెల్లవారేవేళకు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇదే రకమైన జీవన విధానాన్ని అనుసరించటంతో వీళ్ల బయలాజికల్‌ క్లాక్‌ ఆ టైమ్‌ టేబులకి తగ్గట్టు సెట్‌ అయిపోతుంది. ఇదే రకమైన లైఫ్‌ స్టయిల్‌ ఎక్కువకాలంపాటు కొనసాగితే ఆరోగ్య సమస్యలు దాడిచేస్తాయి. కాబట్టి త్వరగా నిద్రపోయి త్వరగా మేలుకునే అలవాటు అలవరచుకోవాలి.

ఒక గంటను కుదించండి...!

ఉదయమే నిద్రలేవాలంటే సాయంత్రం త్వరగా పని ముగించి పడుకోవాలి. ఇంకా చాలా సమయం ఉంది కదా అని సాయంత్రం వేళ పనులు తలకెత్తుకుంటే ముగించేవేళకి అర్థరాత్రవుతుంది. పనిని తగ్గించుకోవాలంటే ఎప్పటిలా లేట్‌నైట్‌ పడుకునే వేళకి కాకుండా ఓ గంట ముందుకి రోజుని లెక్కించాలి. ఆ సమయాన్ని మించిపోయే అవకాశం ఉన్న పనులను కల్పించుకోకూడదు. అలాంటి పనులకు నో చెప్పటానికి సందేహించకూడదు.

హుషారైన ఉదయం కోసం ప్రొటీన్‌
రోజు మొత్తంలో తప్పక తీసుకోవలసిన అత్యంత ముఖ్యమైన ఆహారం బ్రేక్‌ఫాస్ట్‌. ఉదయం వేళ నిద్రమత్తు వదలించటానికి కప్పు కాఫీ ఒక్కటే సరిపోదు. రాత్రంతా నిద్రపోయి లేచేటప్పటికి శరీరంలోని సుగర్‌ లెవెల్స్‌ తక్కువ మోతాదుకు పడిపోయి ఉంటాయి కాబట్టి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. మాంసకృతులు, కూరగాయలు, పొట్టు తీయని గోధుమలతో చేసిన పదార్థాలు తినాలి. నిద్రమత్తు వదిలించటానికి కాల్షియం, ప్రొటీన్‌ సమృద్ధిగా దొరికే పాలు, సోయాపాలు తాగాలి.
మీకు మేరే రివార్డ్‌ ఇచ్చుకోండి
పెందలాగే నిద్ర మెలకువైతే బయలాజికల్‌ క్లాక్‌ సర్దుకున్నట్టే! త్వరగా నిద్రలేవగలిగినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకుని అదనంగా అందిన సమయాన్ని ఆనందాన్నిచ్చే మీకిష్టమైన పనులు చేయటానికి ఉపయోగించండి. ఆ పనులే మీకు మీరిచ్చుకునే రివార్డు. దినపత్రికలోని ఇష్టమైన కాలమ్‌ చదవటానికి, మార్నింగ్‌ న్యూస్‌ తెలుసుకోవటానికి, వ్యాయామానికి లేదా మెడిటేషన్‌కు ఆ అదనపు సమయాన్ని వినియోగించండి. గుడ్‌ స్టార్ట్‌ను అందించటానికి ఆ పనులెంత ఉపయోగపడ్డాయో అర్థం చేసుకుంటే ఉదయాన్నే నిద్ర లేవటంవల్ల పొందే ప్రయోజనాలు ఎంత విలువైనవో గ్రహించగులుగుతారు.
ఉదయం వేళ వ్యాయామమే మేలు
అల్పాహారం తిన్న తర్వాత చేసే వ్యాయామంలో కంటే సూర్యోదయానికి ముందు చేసే వ్యాయామం వల్ల ఎక్కువ కెలోరీలు ఖర్చవుతాయి. ఉదయం వేళ వ్యాయామం చేయటం వల్ల బాడీ టెంపరేచర్‌, ఎడ్రినలిన్‌ లెవెల్స్‌ పెరిగి వ్యాయామ ప్రభావం రోజులో ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి బాగా అలర్ట్‌గా ఉండే ఉదయం వేళల్లోనే వ్యాయామం చేయాలి.
పడుకునేముందే హెయిర్‌ ట్రీట్‌మెంట్‌
ఉదయం వేళ హడావిడి లేకుండా ఉండాలంటే రాత్రి పడుకునేముందే తలస్నానం చేయాలి. తలస్నానం చేసి వదులుగా జడ అల్లుకుని పడుకోవాలి. నిద్రలేచాక క్విక్‌ బ్లో డ్రై చేస్తే వెంట్రుకలు ఒత్తుగా తయారవుతాయి. లీవ్‌ ఇన్‌ కండిషనర్‌ అప్లైచేసి నీళ్లతో తడి చేసిన దువ్వెనతో దువ్వుకుంటే వెంట్రుకలు అదుపులో ఉండి చక్కగా సెట్‌ అవుతాయి.

జడల అల్లిక అవసరమే!

జడ కట్టు చూసి ఎప్పుడు నిద్ర లేచారో కనిపెట్టవచ్చు. కానీ అదే తలకట్టును కుదురుగా దువ్వుకుని జడతో కనిపిస్తే లేజీ పర్సన్‌కి బదులుగా మార్నింగ్‌ పర్సన్‌ అనే గుర్తింపు పొందే వీలుంది. అయినా జడలు ఫ్యాషన్‌లో భాగాలే! త్వరగా, తేలికగా దువ్వేసి అల్లుకునేవీలున్న జడలతో ఆఫీసులకు వెళ్లడంలో తప్పేముంది? అందుకే ఒకసారి వదులుగా జడ అల్లుకోవాలి. ఫ్రెంచ్‌ బ్రైడ్‌ వేసుకోవచ్చు. మరీ పొట్టి జుట్టు ఉన్నవాళ్లు క్లాత్‌ హెడ్‌బ్యాండ్‌ వేసుకోవచ్చు.

మేకప్‌ రొటీన్‌

లిక్విడ్‌ టు పౌడర్‌ ఫౌండేషన్‌ వాడటం వల్ల మేకప్‌ సెట్‌ చేసుకోవటానికి పౌడర్‌ ఉపయోగించాల్సిన పనుండదు. వేళ్లతో త్వరగా అప్లై చేయటానికి క్రీమ్‌ బ్లషెస్‌, ఐ షాడోస్‌ ఉపయోగించాలి. న్యాచురల్‌ లుక్‌ కోసం పై కనురెప్పకే మస్కారా, ఐలైనర్‌ అప్లై చేయాలి.

మంద్రమైన శబ్దం

సాయంత్రం వేళ టివీ, రేడియో, మ్యూజిక్‌ సిస్టమ్‌ల వాల్యూమ్‌లను తగ్గించాలి. నిద్ర మూడులోకి నెట్టే మంద్రమైన సంగీతానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి శబ్దాల వల్ల మానసికంగా నిద్రకు సన్నద్ధమవుతాం.

No comments:

Post a Comment