WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 14 January 2014

ARTICLE ON GODDESS SARASWATHI


|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

ॐ సరస్వతి దేవికి హంస వాహనంగా ఉంటుంది ఎందుకు?

ॐ పాలు,నీరు కలిపి హంస ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలను మాత్రమే త్రాగుతుంది.మనలో కూడా ఎవరైతే సమాజంలో ఉన్న మంచి గ్రహించి చెడును విడిచిపెడతారో,అటువంటి వారిని అనుగ్రహిస్తుంది సరస్వతి దేవి. 

ॐ ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ..ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించడం, చెడును విసర్జించడం చేసే వారే సరస్వతి దేవికి అత్యంత ప్రియులని అర్ధం.

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

ॐ హంస అంటే ఊపిరి. మనం విడిచే గాలి(నిశ్వాసను) బయటకు "సః" అని వెలువడుతుంది. బయటనుంచి లోపలికి ప్రవశించే ప్రాణవాయువు(ఉచ్చ్వాశం) "అహం" అంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఈ ఉచ్చ్వాశ, నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు.సః అంటే అతడు, పరమాత్ముడు అని, అహం అంటే నేను అని అర్ధం. ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి అహం సః, అహం సః........ అంటూ హంసో హంసో హంససోహం హంసః అంటు బాగా గమనిస్తే సోహం అంటుంది వినిపిస్తుంది. అంటే అతడు, నేను అనేది అతడే నేను గా మారుతుంది. అతడు పరమాత్మ. నేను అంటే జీవాత్మ అంటే మనం. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అదే అసలైన విద్య. దానికి అధిదేవత మన సరస్వతి దేవి. అందుకే ఆవిడ హంస వాహన అయ్యింది.

No comments:

Post a Comment