సుఖ నిద్రాయోగం
అలిసిన శరీరానికి, బరువెక్కిన మనసుకు నిద్ర ను మించిన సుఖమేముంది.? కాని కొందరికి నిద్ర మాత్రలు వేసుకుంటే తప్ప నిద్ర పట్టని స్థితి ఉంటుంది. అలాంటి వారు ఈ కింది ఆహార పానీయాలు తీసుకుంటే సుఖంగా నిద్రించవచ్చు.
• బాదం
వీటిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల కండరాలు ఉపశమనానికి గురై, హాయిగా నిద్ర పడుతుంది. ఇందులోని గ్లూకోస్‌తో శరీరం శక్తివంతమై నిద్ర లేవగానే ఉత్సాహంగా ఉంటుంది.
• పాలు
పాలల్లో ఉండే కాల్షియంలో నిద్రను క్రమబద్ధం చేసే గుణం ఉంది. ఇది శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. పైగా పాలల్లో ట్రిప్టోటిన్ అనే అమినో ఆసిడ్ ఉంటుంది. ఇది సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్ మీటర్‌ను బ్రేక్ చేస్తుంది. ఈ ట్రాన్స్‌మీటర్‌కు మనసును ప్రశాంత పరిచే గుణం ఉంది. ఇది శరీరం విరామం పొందడానికి నిద్రలోకి వెళ్లడానికి తోడ్పడుతుంది.
• వాల్నట్స్
నిద్ర, మెలకువల్ని నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఈ వాల్నట్స్‌లో ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు వాల్నట్లు తింటే సరిపోతుంది.
• వెన్న
కాల్షియం ఎక్కువగా ఉండే వెన్నలో కూడా నిద్రను క్రమబద్ధం చేసే మెలటోనిన్ హార్మోన్ ఉంది. ఇష్టమైన స్నాక్స్ మీద వెన్న రాసుకుని తినేస్తే బాగా నిద్ర పడుతుంది.
• జాస్మన్ రైస్
నిద్రలేమికి గొప్ప ఔషధం జాస్మన్ రైస్. ఇది శరీరంలోని ట్రిప్టోఫాన్ నిలువల్ని పెంచుతుంది. ఇది కూడా సెరటోనిన్ అనే హార్మోన్‌ను బ్రేక్ చే స్తుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.
• అరటి పండ్లు
అరటి పండ్లల్లో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటికీ కండరాలకు ఉపశమనం కలిగించే గుణం ఉంది. ఫలితంగా ఒక గాఢమైన నిద్ర కలుగుతుంది.
• తేనె
తేనెలో ఇన్సులిన్‌ను పెంచే గుణం ఉంది. ఇన్సులిన్‌కు సహజంగానే ట్రిప్టోఫాన్ నిలువల్ని పెంచి మనసును ప్రశాంత పరిచే తత్వం ఉంది. ఫలితంగా నిద్రకు మార్గం సుగమం అవుతుంది.
• చెర్రీలు
వీటిలో నిద్రను క్రమబద్ధం చేసే మెలటోనిన్ ఉంటుంది మీరు నిద్రలేమితో బాధపడుతూ ఉంటే నిద్రా వేళకు గంట ముందు కొన్ని చెర్రీలు తినేస్తే చాలు....హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు.
No comments:
Post a Comment