నిద్రలేమి, పని ఒత్తిడి ఇతరత్రా కారణాల వల్ల కళ్లు తొందరగా అలసటకు గురవుతుంటాయి. ఒక్కోసారి నీళ్లు కారడం, ఎర్రగా మార డం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటికి దూరంగా ఉండాలం టే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఇతర ఇబ్బందులూ దూరమవుతాయి. దీనికి చేయాల్సిందల్లా ఆకుకూరలతో పాటు బొప్పాయి, చేపలు, పాలు, గుడ్లు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు కూడా కళ్లు తొందరగా అల సటకు గురవుతుంటాయి. నీటిని అధికంగా తీసుకోవడం, ఆహారంలో ఉప్పుని తగ్గించడం వల్ల కొంతవరకూ ఈ ఇబ్బందికి దూరంగా ఉండవచ్చు.మానసిక ఆందోళనతో సతమతమవుతున్నప్పుడు నిద్రలేమి బాధిస్తుంది. ఫలితంగా కంటికింద వలయాలు, నల్లగా మారడంతో పాటు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అలాంటప్పుడు దీనికి తక్షణ పరిష్కారం తగినంత నిద్రపోవడమే. తరువాతే మిగిలిన పరిష్కారాలున్న విషయం మరువకూడదు.
తీసుకున్న ఆహారానికి తగినట్లుగా శరీరానికి తగిన శ్రమ లేకపోతే అనారోగ్యాలు చుట్టుముడతాయి. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే మలినాలు బయటకుపోతాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కళ్లకింద వాపు, తిత్తులు ఏర్పడటం వంటి సమస్యలు దూరమవుతాయి.
కొందరు మస్కారా, ఐలైనర్ వంటి మేకప్‌తోనే నిద్రపోతుంటారు.
ఇలా ఎక్కువకాలం కొనసాగితే కంటికి రక్షణగా నిలిచే కనురెప్పల వెంట్రుకలు రాలిపోతాయి. అలా కాకుండా పడుకోబోయే ముందు తప్పనిసరిగా గోరువెచ్చని కొబ్బరినూనె లేదా చల్లటిపాలల్లో ముంచి దూదితో శుభ్రపరుచుకోవాలి.
నిద్రపోయేటప్పుడు తలకింద ఎత్తయిన దిండ్లను ఉంచుకుంటారు. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరగకపోగా శరీరంలోని ఉండే నీటిని కోల్పోవలసి వస్తుంది. దీంతో కళ్లకింద ఉబ్బినట్లుగా తిత్తులు ఏర్పడ తాయి. వీలైనంత వరకూ దిండు లేకుండా నిద్రపోవడం మేలు. అలానే మెడను నెమ్మదిగా అటూఇటూ కదిలిస్తూ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. ఇక ఉద్యోగరీత్యా బయట ఎక్కువసేపు తిరిగేవారు, కంప్యూటర్‌పై అధిక సమయం పనిచేసేవారు ప్రతి అరగంటకోసారి చల్లటినీటితో కళ్లను కడుక్కొంటూ ఉండాలి. రేడియేషన్‌తో పాటు దుమ్ము, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. అలర్జీల వంటి సమస్యలు దరిచేరవు. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసేవారిలో కంటి సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం తెరను తీక్షణంగా చూడటమే. ప్రతి పదినిమిషాలకోసారి కళ్లు మూసి తెరిస్తే త్వరగా అలసిపోవు.
No comments:
Post a Comment