థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోను గర్భిణులకు ఎంతగానో ఉపయోగిస్తుంది. గర్భస్థ శిశువు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. శిశువు శరీరంలో మెదడు, ఎముకలు, ఇతర అవయవాలు చక్కగా నిర్మాణం అవటానికి థైరాక్సిన్ సాయపడుతుంది. అంతేకాకుండా శిశువు ఎదుగుదలకు, గర్భిణులలో ఉండే హార్మోను ఎంతో అవసరమవుతుంది. థైరాయిడ్ గ్రంథి ఆనారోగ్యం పాలయినా, థైరాయిడ్ హార్మోను ఉత్పత్తిలో అస్తవ్యస్తత ఏర్పడినా, ఎక్కువ తక్కువలయినా స్త్రీలలో అనారోగ్యం ఏర్పడు తుంది. థైరాక్సిన్ హార్మోను ఎక్కువయితే హైపర్‌థైరాయిడ్ అని, తక్కువైతే హైపోథైరాయిడ్ అని వైద్యులు నిర్ధారిస్తారు. ఈ థైరాయిడ్‌గ్రంథి సమస్య అన్నది సాధారణంగా ఇరవై సంవత్సరాలు దాటిన వారిలో ఏర్పడే అవకాశం ఉంటుంది. వయసు పెరుగుతూంటే థైరాయిడ్ అనారోగ్యం క్రమక్రమంగా బయటపడుతుంది. మెనోపాజ్ స్థితికి చేరుకున్నప్పుడు, నెలసరి రుతుకార్యక్రమం ఆగిపోయిన సమయంలో ఈ అనారోగ్యం స్త్రీలలో ఏర్పడవచ్చు. చిన్నపిల్లలలో కూడా థైరాయిడ్ సమస్య కొందరిలో రావచ్చు. ఆ పిల్లలలో శారీరక ఎదుగుదల సరిగా ఉండదు. బుద్ధిమాంద్యం కూడా ఏర్పడవచ్చు. మాట స్పష్టంగా పలకలేక పోవడం, తడబడటం లాంటి లక్షణాలు ఏర్పడ తాయి. పెద్దలు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, ఆ లక్షణాలు కనపడగానే థైరాయిడ్ పరీక్ష చేయించడం అవసరం. యుక్తవయసులో అమ్మాయిలలో నెలసరిలో కొంత మార్పులు వస్తాయి. అధిక రక్తస్రావం కావచ్చు లేదా రుతుక్రమంలో అస్తవ్యస్తత ఏర్పడవచ్చు. ఇటువంటి లక్షణాలకు కారణం థైరాయిడ్ ఆరోగ్యలోపం కావచ్చు. అందువల్ల డాక్టరుకు చూపించి, అవసరమయిన మందులను వాడాలి. వివాహితులకు థైరాయిడ్ అనారోగ్యం కలిగితే, సంతానం కలగటానికి అవరోధం ఏర్పడుతుంది. గర్భం ధరించినప్పటికీ గర్భవిచ్ఛిత్తి జరగడం లాంటివి థైరాయిడ్ అనారోగ్య సమస్యలు. ఇటువంటి ఇబ్బందులు గర్భవతుల్లో ఏర్పడు తున్నప్పుడు వైద్యపరీక్షలు చేయించడం ఎంతో అవసరం. తగిన చికిత్సను జరిపించకపోతే సంతానలేమి కలుగుతుంది. థైరాయిడ్‌గ్రంథికి అనారోగ్యం కలిగితే జ్ఞాపకశక్తి మందగిస్తుంది. వెంట్రుకలు అధికంగా రాలిపోతూ, జుట్టు పలచ బడుతుంది. స్థూలకాయం ఏర్పడుతుంది. అకారణంగా బరువు తగ్గిపోతారు లేదా బరువు పెరుగుతారు. బాగా చిక్కిపోతారు.
థైరాయిడ్ అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు వైద్యులు పరీక్ష చేసి అది హైపో, హైపరా అని నిర్ధారణచేసి, ఆ తర్వాత చికిత్స జరిపిస్తారు. వైద్యసలహాతో మందులను వాడాలి. రక్తపరీక్ష చేయించుకుని, వారంతటవారే మందులు మార్చి వాడకూడదు. థైరాయిడ్ అనారోగ్యం హెచ్చినా, తగ్గినా ఆ విషయాన్ని డాక్టరుకు తెలిపి రిపోర్టు చూపించాలి. థైరాయిడ్ సమస్య వల్ల ఏర్పడే అనారోగ్యాలను నివారించటానికి, వైద్యసలహాతో యాంటీథైరాయిడ్ మాత్రలను వాడవలసి ఉం టుంది. డాక్టరు సూచించిన ప్రకారంగా అశ్రద్ధ చేయకుండా మందులను వాడాలి. థైరాయిడ్ అనారోగ్యం ఏర్పడినప్పుడు మందులు వాడక పోతే, ఇతర అనారోగ్యాలు మరికొన్ని ఏర్పడ తాయి. అందువల్ల థైరాయిడ్ అనారోగ్య లక్షణా లను గుర్తించి, డాక్టరు రాసిచ్చిన మందులను జీవితాంతం వాడవలసిఉంటుంది.
No comments:
Post a Comment