పిల్లల్లి పెంచడం ఒక కళ. మానసిక, ఆర్థిక, సాంఘిక ఒత్తిడులను తట్టుకోలేని తల్లిదండ్రులు తమ చికాకులను పిల్లలపై చూపిస్తూ ఉంటారు.
ఖీ పిల్లల్ని కొట్టడం, తిట్టడం చాలా ఇళ్లల్లో కన్పించే దృశ్యం. ఇలా చేయడం వల్ల పిల్లల గ్రహణశక్తిని, తెలివితేటలను దెబ్బతీస్తుంది. ఖీ తల్లిదండ్రుల చేతుల్లో దెబ్బలుతిన్న పిల్లలకంటే తినని పిల్లలు మేధాశక్తి పరీక్షల్లో ఎక్కువమార్కులు సాధిం చారు. ఖీ పిల్లలతో కాలక్షేపం చేయడం, వారిని దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడడం 'టైమ్‌వేస్టు' అని చాలామంది తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లలతో సన్నిహితంగా, ప్రేమ గా ఉండడంవల్ల వారిలోగ్రహణశక్తి పెరుగు తుంది. ఖీ రోజూ తన్నులుతినే పిల్లలు అబద్దాలుచెప్పడం, దొంగవేషాలు వేయడం, తలబిరుసుగా ప్రవర్తించడం, సామాన్లు పగలగొట్టడంవంటి నిరసనపూర్వక విధ్వం సకచర్యలకు అలవాటుపడతారు. ఖీ ఇటు వంటి పిల్లలు నీతినియమాలకు స్వస్తి చెప్పి తోటిపిల్లల్లో ఉండే అవలక్షణాలను మాత్రమే గ్రహిస్తు న్నారు. ఖీ పిల్లల్ని అతిగా చేయి చేసుకుంటే పాడైపోతారని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఖీ పిల్లల్లో ప్రవర్తనా పరమైన లోపాలు కనిపిస్తున్నాయంటే వారికి ఏ విషయంలోను తగిన ప్రోత్సాహం అందడంలేదు. ఈ తరహా పిల్లలు తమ అల్లరి చేష్టలతో విసుగు తెప్పిస్తూ ఉంటారు.
ఏమి చెయ్యాలి? ఖీ పెద్దవారు పిల్లలతో తమ భాష ద్వారా, ప్రవర్తనద్వారా ఆత్మవిశ్వాసం పెరిగేలా వారిపై వారికి నమ్మకం కలిగేలా ప్రవర్తిం చాలి. ఖీ పిల్లలతో నిత్యం పెద్దలు ప్రవర్తించే తీరు ద్వారా వారెన్నెన్నో విషయాలు నేర్చు కుని, తమదంటూ ఒక వ్యక్తిత్వం, స్వభావం ఏర్పరచుకుంటారు. ఖీ పెద్దలు పిల్లలతో వ్యవహారించే తీరునుబట్టి వారితో పెంచు కునే అనుబంధాన్ని బట్టి వారిలో మంచి లక్షణాలు పెంపొందుతాయి.
ఖీ ఆత్మగౌరవంతో ధైర్యంగా వ్యవహరించే పిల్లలు హుషారుగా, ఆనందంగా ఉంటారు. ఏ పనినైనా చేయగలమనే ధైర్యంతో ఉం టారు. దేనినయినా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఖీ పిల్లల్లో ఆత్మగౌరవం పెంపొం దించాలంటే వారి శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించాలి. వాస్తవాలు గ్రహించి మెలిగేలా పిల్లలకు బాధ్యతలు చెప్పాలి. ఖీ పిల్లలు స్వతంత్రంగా సమస్యా పరిష్కారం చేసుకునే తర్ఫీదు ఇవ్వాలి. ఖీ ప్రయత్నిస్తే అసాధ్య మనేది ఉండదనే దృక్పధం వారిలో పెంపొం దించాలి. ఖీ పిల్లలు విజయాలు సాధిస్తే వారిని అభినందించాలి. పెద్దలు తమ సమస్యలు ఏ విధంగా అధిగమించారో విజయ గాధలుగా పిల్లలకు చెప్పాలి.
ఖీ కుటుంబ సమస్యలను పిల్లలతో చర్చిం చాలి. వారి అభిప్రాయాలు తెలుసు కోవాలి. తమ మాటలకు, అభిప్రాయాలకు తల్లిదం డ్రులు విలువ ఇస్తున్నారనే విషయం పిల్లలకు తెలియాలి. ఖీ పిల్లలు చేసే తప్పు లకు వారే బాధ్యులవుతారని తెలియ జేస్తూ ఉండాలి. ఖీ పిల్లలను ఎవరితోనూ పోల్చి మాట్లాడ కూడదు. ఏ సమస్యనైనా ఏ కోణంలో చూసి పరిష్కరించాలో సూచన లిస్తూ ఉండాలి.
పిల్లల్ని ఆలోచించనివ్వాలి: పిల్లలకు తెలుసు కోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. వారు అడిగే ప్రశ్నలకు వారికి అర్థమయ్యే రీతిలో జవాబులు చెప్పాలి. ప్రశ్నలువేసి విసి గించవద్దని వారిని నిరుత్సాహపరచకూడదు. ఖీ పిల్లలు ప్రశ్నించే అలవాటు పెంచుకుం టారో వారిలో ఆలో చనాశక్తి, భాషమీద పట్టు పెరుగుతుంది. ఖీ పిల్లలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సరియైన నిర్ణయం అయితే వారిని ప్రోత్సహించాలి. సరియైన నిర్ణయం కాకపోతే అందలిలోపాలను పిల్లలకు వివ రించి చెప్పాలి. ఖీతల్లిదండ్రుల ప్రోత్సాహం, మెచ్చుకోలు పిల్లలకు మంచి టానిక్‌గా పని చేస్తాయి. పిల్లలు ఏమి చేసినా మెచ్చుకోమని కాదు..వారు చేసిన పని న్యాయబద్ధంగా ఉన్నప్పుడే ప్రోత్సహించాలి. లేకపోతే సరియైన మార్గదర్శక విధానాలు తెలియజెప్పాలి.
ఖీ పిల్లల్ని 'చదువుకో! చదువుకో!' అని తరచు వేధించకూడదు. వారిని స్వేచ్ఛగా వదిలితే బాధ్యత తెలుసుకుని వారంతట వారు తమ పనులు చేసుకోవడం అలవరచు కుంటారు. ఖీ సమస్యలను పరిష్కరించే ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోగల నైపుణ్యం వారిలో అభివృద్ధి చెందేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖీ పిల్లల అభిరుచి మేరకు వారికి ఇష్టమైన రంగంలో కృషి చేసేందుకు ప్రోత్సహించాలి. చదువు చాలా ముఖ్యమేగాని అదే జీవితంగా భావించకూడదు. పిల్లల్ని హాయిగా ఆడుకోనివ్వాలి.
No comments:
Post a Comment