రోజంతా చురుకుగా.. !
ఉదయం నిద్రలేచాక బద్ధకంగా ఉండి... ఇంకా నిద్రపోవాలనిపిస్తే ఏం బాగుంటుంది. బాగుండటం సంగతి పక్కన పెడితే బద్ధకంగా ఉంటే ఆధునిక పరుగులో వెనకబడిపోతామన్న భయం వెంటాడుతుంది. బద్ధకంగా రోజు మొదలవ్వకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.
పిండిపదార్ధాలతో ఉన్న అల్పాహారం తింటేనే పొట్ట నిండుగా ఉంటుందనుకుంటే పొరపాటు. చక్కెర కలిగిన తృణధాన్యాలు, బ్రెడ్ వంటివి తింటే సరళ పిండిపదార్థాలు (సింపుల్ కార్బోహైడ్రేట్స్) శరీరానికి చేరతాయి. దాంతో త్వరగా ఆకలవుతుంది.
అందుకని ప్రొటీన్లు లేదా నట్స్ తో తయారుచేసిన స్మూతీలు తినాలి. ఇవేవీ కుదరలేదంటే సంక్లిష్ట పిండిపదార్ధాలను (కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు) కలిగిన ఓట్స్ వంటివి తింటే ఆకలవ్వదు.
నిద్రలేవగానే పళ్లు తోముకోవడం సహజం. అయితే కొందరు బ్రేక్‌ఫాస్ట్ తిన్న తరువాత కూడా పళ్లు తోముతారు. ఇదేమంత మంచిది కాదు అంటున్నారు డెంటిస్టులు. ఎందుకంటే పళ్లరసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్లపదార్ధాలు తీసుకున్నాక ఎనామిల్ మెత్త బడుతుంది. అప్పుడు దంతాలు తోమితే ఎనామిల్ పోతుంది. అందుకే అల్పాహారం తర్వాత దంతధావనం చేయకపోవడం ఉత్తమం.
‘ఉదయం నిద్రలేవగానే మీరేం చేస్తార’ని అడిగితే -‘ఏం చేస్తాం... ఫోన్ చెక్ చేస్తాం’ అనే సమాధానం చెప్తున్నారు ఈ మధ్య ఎక్కువమంది. నిద్రలేవగానే కళ్లలో తేమ అంతగా ఉండదు. దానివల్ల నిద్రలేచీ లేవగానే ఫోన్ స్ర్కీన్ చూస్తే కళ్లకు హాని కలుగుతుంది.
వర్కవుట్‌లనేవి అన్ని రకాలుగా ఎంతో మంచిది. అయితే జిమ్‌కి వెళ్లాలనో, వర్కవుట్‌లు చేయాలనో నిద్ర సరిపడా పోకపోతే కూడా ఇబ్బంది. శరీరానికి సరైన విశ్రాంతి దొరక్కపోతే జిమ్‌లో, వర్క్‌లో మీ సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి శక్తి కావాలంటే కంటినిండా నిద్ర ఉండాలి.
మనలో ఎక్కువమంది రాత్రి నిద్రాభంగం కాకూడదని కిటికీ కర్టెన్లు మూసేసి, లైట్లు ఆపేసి నిద్రకు ఉపక్రమిస్తుంటారు. కాని దీనివల్ల బాడీక్లాక్ (జీవగడియారం)కి సరైన సందే శం వెళ్లదు. ఈ గడియారం వెలుగుకి, చీకటికి సున్నితంగా స్పందిస్తుంది. తెల్లవారిందనే సంకేతాన్ని బాడీ క్లాక్‌కి అందించాలంటే సహజమైన కాంతి పడకగదిలో పడాలి.
గోరువెచ్చటి నీళ్లతో ఉదయంపూట స్నానం చేస్తే బద్ధకం వదిలి రోజంతా ఉత్తేజంగా ఉండొచ్చనుకుంటారు. వాస్తవానికి చన్నీళ్ల స్నానం చేస్తే అలా ఉంటారు. దీనివల్ల అప్పటివరకు గాఢనిద్రలో మునిగిన శరీరానికి ‘తెల్లవారింది మత్తు వదులు’ అనే సంకేతం వెళ్తుంది. అదే గోరువెచ్చని నీళ్లనుకోండి ‘కండరాలు రిలాక్స్ అయ్యే సమయం ఇది’ అని నాడీవ్యవస్థకు సందేశం వెళ్తుంది. ఈ సారి మీరు వేడినీళ్ల స్నానం చేశాక గమనించండి అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇది తెలిశాక ఉదయం చన్నీళ్ల స్నానమే బెస్ట్ అనిపిస్తోంది కదూ..!

No comments:
Post a Comment