WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 6 September 2016

STANDING BODY LANGUAGE REDUCES TENSION


ఇలా నిల్చుంటే.. ఒత్తిడి ఉఫ్‌ అట!

ఏమిటీ నమ్మలేరా? కేవలం ఇలా నిల్చుంటేనే ఒత్తిడి తగ్గుతుందా.. అనుకుంటున్నారా! 

మనం నిల్చునే తీరూ, కూర్చునే విధానం.. ఒక్కమాటలో మన రోజువారి భంగిమలకీ మానసిక చిత్తవృత్తులకీ మధ్య చాలా దగ్గర సంబంధం ఉందంట. శరీర కదలికలు హార్మోన్‌లని ప్రభావితం చేయడమే ఇందుకు కారణమంటున్నారు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సోషల్‌ సైకాలజిస్ట్‌ అమీ కడి. ఆమె ఇటీవల వెలువరించిన ‘పవర్‌ పోజెస్‌’ ఫొటోలు వ్యక్తిత్వ వికాస రంగంలో కొత్త ఒరవడి దిద్దుతున్నాయి.

ఎప్పుడూ వంగిపోయినట్టు, ఏదో భయంతో కుంచించుకుపోయినట్టు, చేతులు ముడుచుకుని ఉంటే శరీరంలో కార్టిసాల్‌ హార్మోను పెరగుతుందట. మనలో ఒత్తిడికి ఇదే కారణం! అలా కాకుండా నిటారుగా భుజాలు విరిచి.. చేతులు రెండూ నడుంపై ఉంచి నిల్చోవడం, వెన్నెముక భాగం పూర్తిగా కుర్చీకి ఆనేలా ప్రశాంతంగా కూర్చోవడం, కాస్త ముందుకు వంగి బల్లపై చేతులు ఉంచి సూటిగా చూస్తున్నట్టు నిల్చోవడం వంటివన్నీ టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ని పెంచుతాయట. ఒత్తిడిని తగ్గించి ధైర్యాన్ని పెంచే హార్మోన్‌ ఇదే! అందుకే మనకెంతో ఆత్మవిశ్వాసం ఉన్నట్టు చూపే ఈ భంగిమలని ‘పవర్‌ పోజెస్‌’ అంటున్నారు అమీ కడి. మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒత్తిడి తెచ్చేవిగా ఉంటే? తీవ్రమైన ఉద్వేగాలకు గురిచేసేలా ఉంటే..? ఈ పవర్‌ పోజస్‌ పనిచేస్తాయా..? ఇదేనా మీ సందేహం. వీటిని మన రోజువారి జీవితంలో భాగం చేసుకుంటే కచ్చితంగా ఒత్తిడీ, ఆందోళనల నుంచి దూరం కావొచ్చని అంటారామె. రోజూ ఆఫీసులో మీకు ఖాళీ ఉన్నప్పుడు రెండు నుంచి ఐదు నిమిషాలు ఇలా నిల్చోవడం, కూర్చోవడం సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందట. కనుక దీన్నో వ్యాయామంగా సాధన చేయాలంటున్నారామె!!

No comments:

Post a Comment