జుట్టు ఆరోగ్యానికి
కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి... ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయపొడి మార్కెట్లో లభించడం ఆరంభమయింది. ఆ పొడిని నీటిలో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయపొడి కాకుండా కుంకుడుపొడి కూడా లభిస్తోంది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెండ్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు
ఈ రోజుల్లో షాంపూలు వచ్చాక చాలా మందికి కుంకుడు కాయలు సంగతి తెలియదు. తల రుద్దుకోవటానికి కుంకుడు కాయలను ఉపయోగిస్తాం. అలాగే క్లీనింగ్ కొరకు కూడా కుంకుడు కాయలు బాగా సహాయపడతాయి
జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యం గా పెరగడానికి షాంపూల కంటే కుంకుడుకాయలు మందారఆకు పొడి వాడితే మంచిది
No comments:
Post a Comment