WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 15 December 2015

CREAMY VEG ROLL WITH CHINESE SALSA RECIPE


 క్రీమీ వెజ్‌ రోల్‌ విత్‌ చైనీస్‌ సల్సా 

* కావల్సినవి: బేబీకార్న్‌ - ఒకటి, క్యాలీఫ్లవర్‌ పువ్వులు - ఐదారు, క్యారెట్‌ - సగం ముక్క, క్యాబేజీఆకులు - రెండు, క్యాబేజీ తరుగు - టేబుల్‌స్పూను, చీజ్‌ తురుము - టేబుల్‌స్పూను, కారం - చెంచా, వెజిటబుల్‌ బ్రాత్‌పౌడర్‌ - అరచెంచా(బజార్లో దొరుకుతుంది), టొమాటోలు - మూడు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి ముక్కలు - చెంచా చొప్పున, చక్కెర - అరచెంచా, రాజ్‌మా - టేబుల్‌స్పూను, కొత్తిమీర - కట్ట, నువ్వులనూనె - చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా, ఉప్పు - తగినంత, స్ప్రింగ్‌రోల్‌ షీట్లు - ఆరు (బజార్లో దొరుకుతాయి). లేదంటే వాటిని ఇలా తయారుచేసుకోవచ్చు. అందుకోసం: మైదా - కప్పు, ఉప్పు - పావుచెంచా, మొక్కజొన్నపిండి - మూడు చెంచాలు.

* తయారీ: ముందుగా స్ప్రింగ్‌రోల్‌షీట్లను తయారుచేసుకోవాలి. అందుకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో తీసుకుని నీళ్లతో చపాతీపిండిలా కలపాలి. తరవాత కొద్దిగా పిండి తీసుకుని వీలైనంత పల్చగా వత్తుకుని పెనంపై వేసి రెండు నిమిషాలు కాల్చి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలూ, టొమాటో తప్ప మిగిలిన కూర¹గాయలన్నింటినీ సన్నగా తరిగి వాటిపై చీజ్‌ తురుము వేయాలి. తరవాత తగినంత ఉప్పూ, వెజ్‌ బ్రాత్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పొడుగ్గా బులెట్‌లా చేసుకోవాలి. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని చేసుకోవాలి. తరవాత ఒక్కోదాన్ని ఒక్కో స్ప్రింగ్‌ రోల్‌ షీట్‌లో ఉంచి.. రోల్‌లా చుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చైనీస్‌సల్సా సిద్ధం చేసుకోవాలి. టొమాటోలు, ఉల్లిపాయను సన్నగా తరగాలి. ఈ ముక్కల్లో వెల్లుల్లి ముక్కలూ, కొత్తిమీర తరుగూ, పచ్చిమిర్చి తరుగూ, నువ్వుల నూనె, చక్కెరా, కారం, ఉడికించి ముద్దలా చేసిన రాజ్‌మా కలపాలి. తరవాత అందులో కొద్దిగా ఉప్పు కలపాలి. సల్సా తయారైనట్లే. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ముందుగా చేసుకున్న రోల్స్‌ని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని సల్సాతో కలిపి వడ్డించాలి.

No comments:

Post a Comment