WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 10 December 2015

PREPARATION OF CHICKEN TIKKA MASALA RECIPE


చికెన్ టిక్కా మసాలా 

కావల్సినవి: చికెన్ - 400 గ్రా (ముక్కల్లా కోయాలి), పెరుగు - కప్పు, జీలకర్రపొడి - చెంచా, ధనియాలపొడి - అరటేబుల్‌స్పూను, పసుపు - పావుచెంచా, అల్లంవెల్లుల్లి తరుగు - టేబుల్‌స్పూను చొప్పున, కారం - ఒకటిన్నర చెంచా, ఉప్పు - తగినంత.

గ్రేవీకోసం: ఉల్లిపాయలు - రెండు(ముక్కల్లా కోయాలి), ఎరుపురంగు క్యాప్సికం - ఒకటి, జీడిపప్పు - ఆరు, జీలకర్ర - టేబుల్‌స్పూను, ధనియాలపొడి - అరచెంచా, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అర అంగుళం ముక్క, యాలకులు - రెండు (లవంగాలూ, యాలకులూ, దాల్చినచెక్కనుపొడిలా చేసుకోవాలి), కసూరీమేథీ - టేబుల్‌స్పూను, క్రీం - పావుకప్పు, టొమాటో కెచెప్ - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - ఒకటిన్నర చెంచా, వెన్న - టేబుల్‌స్పూను, నూనె - అరకప్పు, ఉప్పు - తగినంత.

తయారీ: ఓ గిన్నెలో పెరుగూ, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, పసుపూ, అల్లంవెల్లుల్లి తరుగూ, కారం, తగినంత ఉప్పూ వేసుకుని బాగా కలపాలి. ఇందులో చికెన్ ముక్కలు వేసి వాటికి ఈ మసాలా పట్టేలా కలిపి మూత పెట్టేయాలి. ఇప్పుడు క్యాప్సికంని సన్ననిమంటపై ఉంచి కాల్చుకోవాలి. అది కొద్దిగా నల్లగా అయ్యాక ఓ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టేయాలి. క్యాప్సికం చల్లారాక చెక్కూ, అందులోని గింజల్ని తీసేయాలి. ఈ క్యాప్సికంని ముక్కల్లా కోయాలి. ఇప్పుడు చికెన్‌ని గ్రిల్‌పై కాల్చుకోవాలి. లేదంటే బాణలిలో కొద్దిగా నూనె వేసి వేయించుకుని తీసుకోవాలి.

బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయముక్కల్ని వేయాలి. అవి వేగాక క్యాప్సికం ముక్కల్ని వేయాలి. రెండు నిమిషాల తరవాత దింపేసి ఈ రెండింటినీ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. మరో బాణలిలో నూనె వేడిచేయాలి. అందులో లవంగాలూ, దాల్చినచెక్కా, యాలకులూ కలిపి చేసుకున్న పొడీ, జీలకర్రా, దనియాలపొడీ వేయాలి. తరవాత ఉల్లిపాయ మిశ్రమం, జీడిపప్పు పేస్టూ వేసి రెండుమూడు నిమిషాలు వేయించాలి. తగినంత ఉప్పూ, కారం, టొమాటో కెచెప్ వేయాలి. ఇందులోనే కసూరీమేథీ, క్రీం, వెన్నా వేసి బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి చికెన్ ముక్కలకు ఆ మసాలా పట్టి.. కూరలా తయారవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది పల్చగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఈ కూర అన్నంలోకే కాదు, రొట్టెల్లోకీ బాగుంటుంది.

No comments:

Post a Comment