ఆలివ్ ఆయిల్‌తో ఎంతో మేలు జరుగుతుందని ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు నితా మెహతా అంటున్నారు. భారతీయ వంటకాల్లో ఆలివ్ నూనెను చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నాంటున్నారు.
వంటకాల్లో ఆలివ్ నూనెను వాడటం ద్వారా కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని "ఇండియన్ కుకింగ్ విత్ ఆలివ్ ఆయిల్" అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కుకరీ ఎక్స్‌పోర్ట్ నితా మెహతా చెప్పుకొచ్చారు.
ఆలివ్ ఆయిల్ వాడకంతో వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని, హృద్రోగ సమస్యలకు ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుందట. దేశంలో వంద మిలియన్ మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని, ఇందులో 40 శాతం నగర వాసులేనని తేలింది. అయితే ఆలివ్ ఆయిల్ వాడకంతో శరీరంలోని వ్యర్థ కొవ్వు పదార్థాలు ఆరోగ్యంలో చేరబోవని మెహతా చెప్పారు.
ఇతర నూనెల కంటే ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించడం ద్వారా మధుమేహం, హృద్రోగసమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెప్పారు. హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులతో ఆలివ్ ఆయిల్ పోటీ పడుతుందని, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు ఆలివ్ ఆయిల్ ఔషధంలా పనిచేస్తుందని ఆసిన్ కుక్ బుక్ అవార్డు విజేత అయిన మెహతా అన్నారు.
No comments:
Post a Comment