బుద్ధిమంతుడికి ఓ బహుమతి!
ఓ పెద్ద కంపెనీలో ఉన్నతాధికారుల మీటింగ్ జరుగుతోంది.కంపెనీ చైర్మన్ ఒక కాన్ఫిడెన్షియల్ విషయం మాట్లాడాలని చెప్పి ముఖ్యులైన ఎనిమిది మంది అధికారులను మాత్రం ఉంచాడు.
చైర్మన్ గొంతు సవరించుకున్నాడు.
“ మన ఆఫీసులో రిసెప్షనిస్టు షీలా అందంగా ఉంటుందని, కాస్త ప్రెండ్లీ గా ఉంటుందనీ అందరికీ తెలుసు.మీలో కొందరు ఆ అమ్మాయితో బయట తిరుగుతున్నారని నాకు తెలియవచ్చింది. ఎవరెవరు ఆ అమ్మాయితో తిరుగుతున్నారో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. నిజాయితీగా చెప్పండి-మీలో ఎవరు ఆ అమ్మాయితో తిరుగుతున్నారు ? తిరిగే వాళ్ళు చేతులెత్తండి " అన్నాడు.
అందరూ మొహామోహాలు చూసుకున్నాక కాస్సేపుండి బెదురుతూ ఒక చేయి పైకెత్తాడు. అతన్ని చూసి ధైర్యం చేసి మరోడు.ఆ తర్వాత మరోడు.కాస్సేపటికి చూస్తే అప్పారావు తప్ప తక్కిన ఏడుగురూ చేతులెత్తారు.
చైర్మన్,అప్పారావు కేసి ఆశ్చర్యంగా చూశాడు.
“ నిజంగానే ఆ అమ్మాయితో నీకే సంబంధమూ లేదంటావా అప్పారావ్ ? ఉన్న విషయం ప్రాంక్ గా చెప్పు...ఫర్వాలేదులే " అన్నాడు.
“ అమ్మాతోడు సార్, ఆ అమ్మాయికేసి గట్టిగా చూడనుకూడా చూడలేడు నేను " అన్నాడు అప్పారావు నెత్తి మీదా చేయి పెట్టుకుని.
“గుడ్...నువ్వొక్కడివే దొరికావ్ " అంటూ నిట్టూర్చాడు చైర్మన్.
అందరూ అయోమయంగా చూశారు.
“ ఆ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేద్దామనుకుంటున్నాను. ఆ ఊస్టింగ్ అర్డర్ మీద నువ్వే సంతకం చెయ్యి.మా అందరికీ మా మా మొహమాటాలున్నాయి కదా " చెప్పాడు చైర్మన్.

No comments:
Post a Comment