మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించాల్సిన చర్మం.. వేసవిలో నిర్జీవంగా మారిపోతుంది. అలాంటి చర్మానికి ఎప్పటి కప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చర్మం సహజంగా మెరిసేలా:
. ఐదారు బాదం గింజల్ని తీసుకుని పాలల్లో కనీసం నాలుగు గంట నానబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని మెత్తగా గ్రైండ్‌చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి పది నిమిషాలయ్యాక కడిగెయ్యాలి.
.కాచిన పాలమీగడ, తేనె కలిపిన మిశ్రమాన్ని రాసుకుని ఐదు నిమిషాలు మర్దన చేసి ఆ తరువాత కడిగితే, చర్మం చాలా తాజాగా తయారవు తుంది.
.ముఖం మృదు త్వాన్ని సంత రించు కోవాలంటే, బాదం పొడిలోనాలుగు చుక్కల వీట్ జెర్మ్ నూనె, అరచెంచా గులాబీ రేకుల పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషా లయ్యాక కడిగేస్తే సరిపోతుంది. చర్మం తాజాదనాన్ని పొందు తుంది. వేసవి కాలంలో ప్రతిరోజు మంచి క్రీం రాసుకుని పాలమీగడతో మర్దన చేసుకోవటం చాలా మంచిది.
పొడిచర్మం వీడి ప్రకాశ వంతంగా:.చెంచా కలబంద గుజ్జులో గులాబీ నూనె, వీట్‌జెర్మ్ నూనె రెండు చుక్కలు, చొప్పునవేసి, చెంచా బాదం పొడి కలిపి పూతలా వేసుకోవాలి.
. చెంచా పాలపొడినిలో మోతాదులో తేనె, విటమిన్ ఇ క్యాప్యూల్ ఒకటి, అరచెంచా గులాబీ రేకల ముద్ద కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల య్యాక కడిగేస్తే పొడిచర్మం పోయి ప్రకాశవంతంగా మారుతుంది.
No comments:
Post a Comment