How-to-Forever-Rid-of-Blackheads-And-Pimples
టీీనేజ్‌లో మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌తో సమస్య అధికమై యాక్నెకు దారి తీస్తుంది. దీని వలన టీనేజ్ అమ్మాయిలు లేక అబ్బాయిలు బయటకు వెళ్లుటకు చాలా ఇబ్బంది పడుచుంటారు. కావున చర్మం తిరిగి క్లియర్‌గా అందంగా, ఆకర్షణీయంగా రావాలంటే ఇంట్లోనే చేసుకోదగిన సింపుల్ సూచనలు...
. పుదీనా ఆకుల్లో చెంచా తేనె, రెండు చుక్కల గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసి పదినిమిషాలయ్యాక కడిగేయాలి. దీని వల్ల మచ్చలే కాదు.. మొటిమలు రాకుండా ఉంటాయి.
. ఆరేంజ్ పీల్ పౌడర్‌ను పన్నీటితో కాని మంచినీటితో కాని పేస్టులా కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వచేసుకుని వాడుకోవచ్చు లేదా మార్కెట్‌లో రెడీిమెడ్‌గా ఈ పౌడర్ దొరుకుతుంది. తాజా కమలాపండు తొక్కలను గ్రైండ్ చేసి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ముఖంలోని మొటిమలు తగ్గి నునుపుగా మారి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
. రోజూ రెండు లీటర్లనీరు తాగడం, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం, 6-7 గంటలు నిద్రపోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే శారీరక ఆరోగ్యం మెరుగుపడి ముఖారవిందం కాంతి వంతంగా తయారవుతుంది.
. తేనెలో రెండు చుక్కల నిమ్మరసం,సరిపడా సెనగపిండి కలిపి ముఖానికి పూతలా వేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మచ్చలు అదుపులోకి వచ్చేస్తాయి.
.దాల్చిన చెక్కను పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు ఉన్న చోట మాత్రమే రాసి ఆరిన తర్వాత శుభ్రపరచాలి. దీనిని వారానికి మూడుసార్లు వేస్తుంటే ముఖంలోని మొటిమలే, మచ్చలు తగ్గుముఖం పడుతాయి. ఈ ప్యాక్ వేసినప్పుడు చర్మం కాస్త మండుతుంది. నొప్పితో కూడిన మొటిమలకు ఇది మంచి ట్రీట్‌మెంట్.
. ఒక టీ స్పూన్ శనగపిండి, 6,7 చుక్కల రోజ్ వాటర్, 6,7చుక్కల నిమ్మరసం, కొద్దిగా నీళ్ళు జారుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకొని15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేసినట్లైతే ముఖంపై మచ్చలు, బ్లాక్‌హెడ్స్ తొలగి పోయి తాజాగా ఉంటుంది.
. గులాబీ రెక్కలు ఐదు తీసుకొని అందులో నిమ్మరసం ఐదు చుక్కలు, శనగపిండి రెండు టీస్పూన్లు, ఛాయపసుపు చిటికెడు, నీళ్ళు కాస్త పోసి పేస్టులా తయారు చేసుకోవాలి. శుభ్రపరచిన ముఖానికి ఈ క్రీమ్‌ని అప్లైచేసి ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని పాలతోనూ, ఆ తరువాత నీటితోనూ శుభ్రపరచాలి. ఇలా 15రోజులకు ఒకసారి చేస్తే చర్మం నునుపు తేలడమే కాకుండా మొటిమలు, నల్లమచ్చలు మాయమైపోతాయి.
. వేరు శనగ నూనెలో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగినచో ముఖం ప్రకాశవంతంగా మారును.
No comments:
Post a Comment