1. కార్న్‌ఫ్లోర్-ఒక కప్పు,
2. క్యాలీఫ్లవర్ పెద్దది-ఒకటి,
3. పసుపు-చిటికెడు,
4. కారం-ఒకచెంచా,
5. వెనిగర్-అరచెంచా,
6. సోయాసాస్-అరచెంచా
7. టమాటసాస్-ఒకచెంచా
8. అల్లం-చిన్నముక్క,
9. వెల్లుల్లి-ఐదారురెబ్బలు,
10. ఉల్లికాడలు-ఒకకప్పు,
11. మిరియాల పొడి-అరచెంచా
12. ఉల్లిపాయలు-రెండు,
13. నూనె,ఉప్పు-తగినంత
14. కొత్తిమీర-కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా క్యాలిఫ్లవర్ని శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా విడగొట్టుకోవాలి. తరువాత ఒక మందపాటి పాత్రలో నీళ్ళు వేడిచేసి అందులో ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు వేసి ఒక పది నిముషాలు ఉంచాలి. దీని వలన క్యాలిఫ్లవర్ ముక్కలు కొంచెం మెత్తబడతాయి. తరువాత నీటిని వంపేసి ఆ క్యాలీఫ్లవర్ ముక్కలలో కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, కారం, పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్ళు వేసి బాగా జారుగా కాకుండా, గట్టిగా కాకుండా కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు నాననివ్వాలి.తరువాత బాణలి పెట్టి నూనె వేడి చేసి క్యాలిఫ్లవర్ మిశ్రమాన్ని వుండలు వుండలుగా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించు కోవాలి. తరువాత బాణలిలో రెండు చెంచాల వరకు నూనె మిగిల్చి మిగతా నూనె తీసివేసి, అందులో అల్లం, వెల్లుల్లి ముక్కలు, ఉల్లి తరుగు, ఉల్లికాడల తరుగు, సోయాసాస్, టమోటసాస్, వెనిగర్, కొంచెం కార్న్‌ఫ్లోర్, అవసర మను కుంటే కొంచెం ఉప్పువేసి ఒక రెండు నిమి షాలు వేయించాలి. తరువాత వేయించి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు అందులో వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కొత్తమీరతో అలంకరించు కోవాలి.
No comments:
Post a Comment