WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 14 February 2014

HOW TO TAKE CARE CHILD/KIDS DENTAL CARE - TIPS IN TELUGU FOR BABIES CHILD CARE


బిడ్డకు దంతాలు రావటానికి ముందుగానే నోటిలోని బాక్టీరియా చిగుళ్లను పాడు చేస్తుంది. మరి బేబీ నోటి చిగుళ్ల పట్ల సంరక్షణ ఎలా వహించాలి ? నీటిని ఉపయోగించి - బేబీ చిగుళ్లను రెగ్యులర్‌గా నీటితో కడగండి. తడి గుడ్డతో చిగుళ్లను మెత్తగా తుడవండి. ఈ అలవాటు మీ బిడ్డకు దంతాలు రాకముందే చేయండి. ప్రతి ఆహరం తర్వాత, నిద్రకు ముందు ఈ చర్య చేపట్టండి. తడిగుడ్డకు బదులుగా మీ చేతిని శుభ్రం చేసుకొని బేబీ నోటికి పట్టించి కూడా శుభ్రం చేయవచ్చు. ఈ చర్య మీ బేబీ నోటిని క్రిములు లేకుండా చేస్తుంది. టూత్‌ బ్రష్‌ - బిడ్డకు దంతాలు రావటం మొదలు పెట్టగానే, చిన్నది మెత్తటిది అయిన టూత్‌ బ్రష్‌ ఉపయోగించి దానితో శుభ్రం చేయండి. ఈ దశలో టూత్‌ పేస్ట్‌ అవసరం ఉండదు. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయండి. మెల్లగా చిగుళ్లు మసాజ్‌ చేయండి. బిడ్డకు ఏ హాని జరుగకుండా చూడండి. బ్రష్‌ కొనలు అరిగితే, బ్రష్‌ మార్చండి. బ్రష్‌ చేసిన తర్వాత నోటిని బాగా కడగండి.

ఫ్లోరైడ్‌ టూత్‌ పేస్ట్‌ - దంతాలు బయటకు రాగానే ఏదేని ఒక నాణ్యతగల టూత్‌ పేస్ట్‌ వాడకం మొదలుపెట్టండి. అది దంత క్షయాన్ని నిలిపి దంతాల ఎనామిల్‌ బలపరుస్తుంది. బాక్టీరియా నోటిలో చేరకుండా చేస్తుంది. అధికంగా పేస్ట్‌ వాడి హాని కలిగించకండి. మీ బిడ్డకు అవసరమైన ఫ్లోరైడ్‌ కొరకు వైద్యుని సంప్రదించండి. ఆహారం - బేబీ చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, బిడ్డకు ఇచ్చే ఆహారాలు ఆరోగ్యంగా ఉండాలి. స్వీట్లు, జ్యూస్‌లు, పాలు వంటివాటితో జాగ్రత్త పాటించండి. చిగుళ్లు, నోటి ఆరోగ్యం ఈ దశలో కాపాడితే, మీ బిడ్డకు జీవితాంతం మంచి నోటి ఆరోగ్యం, దంతాలు కొనసాగుతాయని గ్రహించండి. దంతాలు మనిషికి ఆరోగ్యకరంగా నిర్వహిస్తే జీవితాంతం బలంగా పటిష్టంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం బాగా ఉండాలంటే, పెద్దలైనా చిన్న పిల్లలైనా ప్రతి ఆహారం తర్వాత నోటిని శుభ్రంగా నీటితో కడిగి నోటిలో బాక్టీరియా చేరకుండా ఎప్పటికపుడు రక్షించుకోవాలి.

1 comment:

  1. Great! Every child must have a habit to clean their teeth properly. Meet the best Pediatric Dentists in Punjab at Soni Dental Hospital and Implant centre. Book an appointment soon.

    ReplyDelete