WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 29 January 2014

HEALTHY SKIN CARE TIPS - ARTICLE ON SKIN CARE IN TELUGU



శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ఏది? ప్రాణాలు నిలిపేది గుండె కాబట్టి అదే అంటారు ఏమో...! దానితో పాటు అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మనల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే చర్మం అన్నిటికన్నా జాగ్ర త్తగా కాపాడుకోవలసిన అంశం అంటే అతిశ యోక్తి కాదు. చిన్న పిల్లల నుండీ పెద్ద వాళ్లవ రకూ చర్మాన్ని సౌందర్యవంతంగా ఉంచేం దుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుం ది. ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పలేం. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు. కానీ చర్మం యొక్క స్థితిని మార్చలేం అని వది లేయక్కర్లేదు. అనేక జాగ్రత్తలు తీసు కోవడం ద్వారా మన చర్మాన్ని ఆరోగ్య వంతంగా, ఆకర్షణీయంగా ఉంచవచ్చు. ప్రస్తుతం ఎంతో మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. అలాగే చర్మంలో కూడా పలు రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే ఎంతో మంది అవాస్తవాలను ఎదుర్కొంటున్నారు. ఏ విధమైన పదార్థాలను వాడాలో తెలియక సతమతం అవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్ట పోతున్నారు. దానికి కారణం ఆ క్రీములలో వాడే పదార్థాలు ఎటువంటి చర్మానికి సరిపోతాయి అనే విషయంపై సరైన అవగాహన లేకపోవడమే. వీటిపై అనేక అవాస్తవాలనూ, వాటి వెనక ఉండే నిజాలనూ ఒక సారి వీక్షిద్దాం...
అపోహ: మన చర్మంలో మార్పుల ప్రక్రియ తల్లిదండ్రుల చర్మంయొక్క మార్పులతో సమానంగా ఉంటుంది.
వివరణ: ఖచ్చితంగా తల్లిదండ్రుల జన్యుపరమైన మార్పులే పిల్లల చర్మానికి కూడా రావడానికి అధికశాతం అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సమానత బాహ్య ప్రపంచంలోకి రావడం వరకే. తరువాత కాలంలో పిల్లల చుట్టూ ఉండే వాతావరణం మరియు వారి అలవాట్లే చర్మంలోని మార్పులకు కారణం అవుతాయి. కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా అలవాట్లు మార్చగలుగుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.
అపోహ: సన్‌లోషన్లపై ఉండే ూూఖీ సంఖ్య మనకు ఎంత రక్షణ కల్పిస్తుందో వివరిస్తుంది.
వివరణ: సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఖహూ కిరణాలు చర్మం వదులుగా అయ్యేలా చేస్తాయి. ఖVదీ కిరణాలు చర్మంలో ఉండే కణాలను కాల్చివేస్తాయి. సాధారణంగా అన్ని సన్‌లోషన్లూ ఖVదీ కిరణాలను మాత్రమే అడ్డుకుంటాయి. అలాగే దాని ూూఖీ సంఖ్య ఖVదీ కిరణాలను ఆపగల గరిష్టస్థాయిని మాత్రమే వివరిస్తుంది. అందువల్లనే ఎంతో మంది ఖరీదైన సన్‌లోషన్‌ వాడుతున్నప్పటికీ చర్మం వదులుగా అవుతుంది. సన్‌లోషన్‌ను వాడదలిచిన వారు ఖVదీ కిరణాలను మాత్రమేగాక ఖహూ కిరణాలను అడ్డుకొనగల క్రీములను ఎంచుకోవాలి. జింక్‌, అవెబెన్‌ జోన్‌ వంటి పదార్థాలు ఖహూ కిరణాలను అడ్డుకొనగలుగుతాయి. అందువలన సన్‌లోషన్లలో జింక్‌ మరియు అవెబెన్‌జోన్‌ కూడా ఉండే క్రీములను ఎంచుకోవాలి.
అపోహ: సన్‌స్క్రీన్‌ లోషన్‌ మరియు మాయిశ్చరైజర్లను విడివిడిగా వాడాలి.
వివరణ: ఏ క్రీమ్‌ అయినా చర్మం యొక్క రకాన్ని బట్టే ఎంచుకోవాలి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ అనగా సూర్యుని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై ప్రభావం చూపకుండా నివారిస్తాయి. మాయిశ్చరైజర్‌ క్రీములు చర్మంలో ఉండే తేమ స్థాయిని పెంచుతాయి. ప్రస్తుతకాలంలో ఏ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అయినా చర్మానికి తేమ అందించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక జిడ్డుగా ఉండే చర్మం కలవారు మళ్లీ మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల నిగారింపును కొల్పోతారు. అందువలన అందరికీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. ఒక వేళ రెండూ వాడాలని అనుకుంటే ముందుగా మాయిశ్చరైజర్‌ను వాడి నీటితో శుభ్రపరిచి, ఆరిన తరువాత మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి.
అపోహ: సూర్యకాంతి వలన 18ఏళ్ల వయస్సులోనే అధికంగా చర్మము సమస్యలకు గురి అవుతుంది.
వివరణ: ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం 18ఏళ్ల వయస్సు వరకూ కేవలం 18 నుండీ 23 శాతం వరకూ మాత్రమే చర్మంలో సౌరశక్తి వల్ల సమస్యలు ఉత్పన్న మవుతాయి. కనుక ఒక వేళ ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోనంత మాత్రాన జీవితాం తం బాధపడాలి అనే అపోహను నమ్మరాదు. ఎంత వయస్సు వచ్చిన వారైనా తగిన మందులను తీసు కోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోగలుగుతారు.
అపోహ: కాస్మటిక్‌ క్రీములు మీ పూర్వపు అందాన్ని తీసుకురాగలవు.
వివరణ: ఇది ఏమాత్రం నమ్మకూడదని డాక్టర్లు చెప్తున్నారు. వయస్సు పెరుగుతున్న కొలదీ చర్మంలోని పటిష్టత, కొవ్వు తరుగుదల జరుగుతూనే ఉంటుంది. వానిపై ఎంత క్రీమ్‌ రాసిననూ వాటిని తిరిగి రానివ్వడం చాలా వరకూ సాధ్యపడదు. కాస్మిటిక్‌ క్రీములు కేవలం కొద్ది సమయం మాత్రమే చర్మాన్ని పటిష్టంగా ఉంచగలవు. అది కూడా మన చర్మపు ఆరోగ్యంపై ఆధారపడిఉంటుంది.
అపోహ: మొటిమలు వచ్చినప్పుడు మందులు వాడితే సరిపోతుంది.
వివరణ: మొటిమలు బాహ్యచర్మంపై తయార వ్వడానికి రెండు వారాల ముందు నుంచే లోపలి కణాలను బలహీనపరుస్తుంది. అందు వలన మొటిమలు వచ్చిన తరువాత అవి తగ్గడం కోసం మందులు వాడినప్పటికీ పైకి కనపడుతున్న మొటిమలను తగ్గించగలుగు తామే తప్ప లోపలి కణాలను బలహీన పరచ డాన్ని కూడా తగ్గించాలి అంటే నిర్ణీత కాలం వాడుతూనే ఉండాలి. డాక్టర్లు మొటిమలు వ్యాప్తి చెందడంలోని తీవ్రతను బట్టి మందు లు వాడవలసిన కాలాన్ని నిర్థారిస్తారు. 

No comments:

Post a Comment