WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 8 September 2014

LORD KRISHNA'S PURANA STORY ABOUT "THE GREAT" IN THE WORLD


ఎవురు ధన్యులు?
ఒకాసారి ధుర్యోధనుడు ఒక గొప్ప యాగం చేశాడు. ఎందరెందరో రాజులు వచ్చారు. దానిని చూడడానికి శ్రీకౄష్ణుడు వచ్చాడు. చాల వైభవోపేతంగా జరిగిన ఆయజ్ణ్జాన్ని చూస్లి, కౄష్ణుడు ద్వారకకు మరలివచ్చాడు. ద్వారకలో శ్రీకౄష్ణుని సేవించాలని ఇంద్రుడు దేవతాబౄందంతో వచ్చాడు. స్వర్గరాజ్య లక్ష్మి, ద్వారకారజ్యలక్ష్మితో సరససంభాషణ చేస్తోంది. ద్వారకా రాజ్యలక్ష్మిని చూసి, ఇంద్రుడు ఆసూయపడ్డాడు. ఆశ్చర్యపడ్డాడు. ద్వారకా రాజ్యలక్ష్మిని చూడలని రాజన్యులంతా వచ్చారు. కౄష్ణస్వామి సభలో ‘సుధర్మాలో ఉన్నాడు. సంభాషణలు సాగుతున్నాయి. ఇంతలో పెద్ద ఈదురు గాలివీచింది. వాన వచ్చే సూచనలు కనిపించాయి. పెనుప్రళ్యంగా కురుస్తుందేమో నన్నట్లుగా ఉంది పరిస్థితి. దేవర్షి నారదుడు వచ్చాడు. గాలిచెదిరిపోయింది. వానా ఆగిపోయింది. అంటే దివ్యుల రాక భూమికిలా అనిపిస్తుందా? ఏమో!
‘శ్రీకౄష్ణా! ఈదేవతల మధ్యనునున్న నువ్వు ధన్యుడివయ్యా!’ అన్నాడు. కౄష్ణుడు ‘అదేమిటి? దక్షిణతోపాటు ధన్యత ఎలా నీకు? నీవే మావంటి వాళ్ళకు ధన్యత నిస్తావు. అలాంటి నీకు ధన్యతనిచ్చేది వేరొకటి ఉందా? అదీ సల్పమైన దక్షిణా? చాలా ఆశ్చర్యంగా ఉందే? ఏమిటి స్వామి, ఈవింత, సుంత వివరించవా?’ అన్నారు సభను అలంకరించిన వారంతా. అలవోకగా నవ్వాడు స్వామి. నారదుని వంక సాభిప్రాయంగా చూస్తూ – ‘నీవే దానిని వీరికి తెలియపరచూ అంటూ ఆనతిచ్చాడు. మందహాస వదనంతో నారదుడు అందరినీ కలియజూసి, స్వామి ఆనతిని శిరసావహించి ఆ ఉదంతాన్ని ఇలా చెప్పనారంభించాడు.
నేనొకసారి గంగాతీరంలో నడుస్తున్నాను, గంగా తరంగాల విన్యాసాలను అవలోకిస్తూ, ఆమె పాపాలను ఎలా పోగోడుతుందో, ప్రజలనెలా సంరక్షిస్తోందో ఆలోచిస్తున్నాను. గంగలోంచి ఒడ్డుకు వస్తోంది ఒక తాబేలు, దానిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. ఇదేమి అదౄష్టం చేసుకున్నాదో కదా, నిత్యం గంగలోనే నివస్తుంది; అనుకొని – ‘తాబేలూ! నువ్వు నిజంగా ధన్యజీవివీ అన్నాను. తాబేలు ఫక్కున నవ్వి ‘నారదా! నావంటి జలచరాలకు ధన్యత నిస్తున్న గంగ మహాదేవి ఇంకెంతటి ధన్యమూర్తో కదా! ఆమె ధన్యతతో పోలిస్తే నాదేపాటి ధన్యతా అని నెమ్మదిగా నడుచుకుంటూ సాగిపోయింది. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. నిజమే! తాబేలు మాటల్లో సత్యముంది. గంగ చాల ధన్యురాలు, అనుకొని ఆమాటే ఆమెతో అన్నాను.
‘అమ్మా గంగభవానీ! నీవు నిజంగా ధన్యురాలివమ్మా! ఎందరెందరి కలుషాలని ఇట్టే కడిగిసి పుణ్యాన్ని ప్రసాదించే నీ ధన్యత నిజంగా ప్రశంచదగ్గది, తల్లీ!’
‘నారదా! అతిగా ప్రశంసించకు. నీవు చెప్పిన ఆ జనావళినీ నన్ను, నావంటి నదులనూ, ఇంకా ఎన్నో పర్వతాలనూ నిరంతరం మోస్తున్న ధరణి నాకంటే ధన్యురాలు కదయ్యా!’ అంది. ఔను నిజమే అనిపించింది. నేనా భూమి మీదనే అడుగులు మోపి నిలిచి ఉన్నా ఆమె గొప్పదనాన్ని గుర్తించనే లేకపోయానని ఒకింత సిగ్గుపడి భూమితో అన్నాను. ‘ఓ భూమాతా! నీ వెంతో ధన్యురాలివమ్మా!’ అని. భూమి పరిహాసపూర్వకంగా ఇలా అంది. నారదా నే నెలా ధన్యురాలినయ్యా? నన్ను కూడా మోస్తున్న పర్వతాలు ధన్యులు గానీ!. నాకు తల గిర్రున తిరిగినట్లయింది. ఇదేమిటి, ఒకరిని మించి ఓకరున్నారనుకొన్నాను. సరే, పర్వతాలనే అడుగుదామని – ‘ఓ పర్వతరాజముల్లారా! మీరు ధన్యులు, ఎందుకంటే భూమిని ధరించేది మీరే కదా!’ అన్నాను.
పర్వతాలన్ని తమ గుహలు ప్రతిధ్వనించేట్లు పకపక నవ్వాయి. ‘ఓ దేవర్షి నారదా! మే మెలా ధన్యులమవుతామయ్యా? మమ్మల్ని సౄజించినది ప్రజాపతి. మరి ఆయన ధన్యుడు గానీ, మేమా?’ అన్నాయి. ‘ఏమి వీరి నినయ మధురిమ?’ అనుకున్నాను. సరే, ఆ ప్రజాపతినే అడుగుదామని ఆయన్నే ప్రశ్నించాను. ‘ఓ సౄష్టికర్తా! ప్రజాపతి! నీవెంత ధన్యుడివయ్యా! ఇంతటి సంసారాన్ని సౄజిస్తున్నావు. నీ నియతిని అంతా నడిపిస్తున్నావు1 నీవు నిజంగా ధన్యుడివీ అన్నాను. ప్రజపతి నావంక అప్యాయంగా చూసాడు. ‘అబ్బాయి! నారదా! నేను చేసినదా ఈసౄష్టి? ఇదంతా నాప్రజ్ణ్జ అనే నీవనుకొంటున్నావ? వేదాలయ్యా కారణం. వేదాలు లేకపోతే నేనెందుకూ కొరగానివాడినే సుమా!’ అన్నాడు. ‘అహో, వేదాలన్న మాట ధన్యాలు. సరే, వాటినే అడిగి తెలిసికొందామని నేను వేదరాశులను ప్రార్ధించానూ. ‘ఓ వేదమాతలారా! మీరు ధన్యులు. బ్రహ్మగారు సైతం మీ సహాయంలేక ఏమి చేయలేడు. మీ ధన్యత చెప్పనలవి కానిదీ అన్నాను. వేదాలు జాలిగా నావైపు చూశాయి. ‘నారదా! నీ వింత అమాయంకంగా అడుగుతున్నావేమిటి? మా ఉనికినే మేము కాపాడుకోలేమే! ఒకటి రెండు పర్యాయాలు అలాంటి సందర్భాలు ఎదురయ్యయి. అప్పుడు మమల్ని కాపాడినదెవరు? ఆయనే వేదవేద్యుడు, పరమపురుషుడు, ఆయన ధన్యుడూ అన్నాయి.
ఇదీ జరిగింది. అందుకే అన్నాను. ఇందరు దేవతలూ, రాజన్యూలూ, భూసరులూ పరివేష్టించి ఉన్న ఈ సభలో వెలుగొందు తున్న స్వామిని ‘నీవు ధన్యుడి వయ్యా’ అని, కానీ స్వామి అంటాడు, తానొక్కడే కాదట, దక్షిణతో కూడిన తాను ధన్యుడట!
దేవతలంతా ఆశ్చర్యపోయారు శ్రీకౄష్ణుని మాటలకు. రజన్యులు అవాక్కయ్యరు. భూసురులంతా ప్రవిత్ర వేదమంత్రాలతో స్తుతించారు. నారదుడు ఆనందంతో నాట్యమే ఆడాడు. సామాన్య ప్రజ ఉన్నారు, పాపం తామెవరిమో తెలీయక, స్వామి ఆంతర్యమేమో ఎరుకపడక వంగివంగి వందనాలు చేశారి.
చిద్విలాసంగా శ్రీ కౄష్ణుడు తన హౄదయలక్ష్మిని స్పౄశించి నవ్వుకున్నాడు.


No comments:

Post a Comment